7 episodes

అనగనగా అంటూ మొదలైన మన జీవిత ప్రయాణంలో ఎన్నో కధలు విన్నాం. ఎన్ని కధలు విన్నా మనసుకు ఇంకా వినాలనిపించే తెలుగు కధలు కోకొల్లలు. అటువంటి అద్భుత మణిపూసల్లాంటి కధలను మీకు అందించాలని , SBS తెలుగు మొదటిసారిగా ఆస్ట్రేలియా తెలుగు సాహిత్య రచయితలచే, గొప్ప కధలను "అనగనగా" పోడ్కాస్ట్ సిరీస్ గా విడుదల చేస్తున్నారు.

అనగనగ‪ా‬ SBS Audio

    • Fiction

అనగనగా అంటూ మొదలైన మన జీవిత ప్రయాణంలో ఎన్నో కధలు విన్నాం. ఎన్ని కధలు విన్నా మనసుకు ఇంకా వినాలనిపించే తెలుగు కధలు కోకొల్లలు. అటువంటి అద్భుత మణిపూసల్లాంటి కధలను మీకు అందించాలని , SBS తెలుగు మొదటిసారిగా ఆస్ట్రేలియా తెలుగు సాహిత్య రచయితలచే, గొప్ప కధలను "అనగనగా" పోడ్కాస్ట్ సిరీస్ గా విడుదల చేస్తున్నారు.

    అనగనగా ఎపిసోడ్ 6 : వేట

    అనగనగా ఎపిసోడ్ 6 : వేట

    బండారు అచ్చమాంబ,చింతా దీక్షితులు, భమిడిపాటి, మల్లాది, మా గోఖలే, మునిమాణిక్యం వంటి లబ్దప్రతిష్టులైన తొలితరం కథకుల తర్వాతి తరంలో కొందరు కథలు రాశిలో తక్కువ కథలు రాసినా వాసిపరంగా గొప్ప కథలు రాసారు.

    • 9 min
    అనగనగా ఎపిసోడ్ 5 : గాలి వాన

    అనగనగా ఎపిసోడ్ 5 : గాలి వాన

    పాలగుమ్మి పద్మరాజు గారు, ప్రపంచ కథానికల పోటీలో "గాలి వాన" కధకు రెండో బహుమతిని అందుకున్నారు.అయన ప్రముఖ తెలుగు రచయిత మరియు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కూడాను.తెలుగు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ప్రతిభాశాలి. ఈయన వ్రాసిన 60 కథలు గాలివాన, పడవ ప్రయాణం, ఎదురుచూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి.

    • 11 min
    అనగనగా ఎపిసోడ్ 4 : చేసిన ధర్మం

    అనగనగా ఎపిసోడ్ 4 : చేసిన ధర్మం

    ప్రపంచ ప్రఖ్యాత కథకుల్లో రష్యన్ రచయిత ఆంటొన్ చెహోవ్ మొదటి వరుసలో వుంటారన్నది నిర్వివాదాంశం. కథల్లో వస్తువుతోపాటు, ఒక విలక్షణ శైలితో రచనలు చేసారాయన. ఒకటొ, రెండో, మహా అయితే మూడో పాత్రలు మాత్రమే వుండే కథలతో ఆయన జీవితాన్ని గురించిన గాఢమైన నిజాలను ఆవిష్కరించారు.

    • 17 min
    అనగనగా ఎపిసోడ్ 3 : అత్తగారి కధలు

    అనగనగా ఎపిసోడ్ 3 : అత్తగారి కధలు

    అత్తగారి కథలు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతీ రామకృష్ణ వ్రాసిన పుస్తకం..

    • 17 min
    అనగనగా ఎపిసోడ్ 2 : అలరాస పుట్టిళ్లు

    అనగనగా ఎపిసోడ్ 2 : అలరాస పుట్టిళ్లు

    అలరాస పుట్టిళ్లు రచయిత్రి నిడుమోలు కళ్యాణ సుందరీ జగన్నాధ్.తన రచనాప్రస్థానంలో 20కి మించి కథలు రాయని ఈ రచయిత్రి తనదైన గంభీరమైన శైలి,శిల్పం,బిగి సడలని కథనంతో గ్రామసీమల నేపథ్యాలను,దివాణాల్లోని స్త్రీల అంతరంగాలను రమ్యంగా ఆవిష్కరించింది.

    • 13 min
    అనగనగా ఎపిసోడ్ 1 : నీడ వెనుక నిజం

    అనగనగా ఎపిసోడ్ 1 : నీడ వెనుక నిజం

    జలంధర చంద్రమోహన్‌ (మల్లంపల్లి జలంధర) తెలుగు రచయిత్రి.ఆమె రాసిన కథల్లో బ్రతుకు గురించి గొప్ప తాత్త్వికమైన పరిశీలనా, విశ్లేషణా కనిపిస్తాయి.కథాంశాల్లో నవ్యత, సంఘం పైన బాధ్యతా, అవగాహనా కనిపిస్తాయి.

    • 18 min

Top Podcasts In Fiction

Stories from the Village of Nothing Much
iHeartPodcasts
A Better Paradise
Absurd Ventures
The NoSleep Podcast
Creative Reason Media Inc.
Emilie Meng Mysteriet
B.T.
Den Korte Podcast
Cilius // Bruun
Malevolent
Harlan Guthrie