26 episodes

Happy Morning Friends, I am Manikanta Kamatam, Learning & Volunteering Coach, Positive Psychologist, International Trainer, Psychotherapist, Life Coach and Counsellor. More about me at www.bit.ly/Manikantakamatam

Mak Talks Manikanta Kamatam

    • Health & Fitness

Happy Morning Friends, I am Manikanta Kamatam, Learning & Volunteering Coach, Positive Psychologist, International Trainer, Psychotherapist, Life Coach and Counsellor. More about me at www.bit.ly/Manikantakamatam

    నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం

    నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం

    నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం
    రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం
    భారత దేశం మన జన్మ ప్రదేశం
    భారత ఖండం ఒక అమృత భాండం || భారత దేశం ||

    ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం
    దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం
    తూరుపు దిశ పొంగిపొరలె గంగా సంద్రం
    పశ్చిమాన అనంతమై సింధు సముద్రం || భారత దేశం ||

    ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం
    రత్న గర్భ పేరుగన్న భారత దేశం
    ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం
    సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం || భారత దేశం ||

    కోకిలమ్మ పాడగలదు జాతీయగీతం
    కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం
    గుండె గుండె కలుసుకొనుటె సమరస భావం
    చేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం || భారత దేశం ||

    • 4 min
    పాడుదమా స్వేచ్ఛా గీతం

    పాడుదమా స్వేచ్ఛా గీతం

    పాడుదమా స్వేచ్ఛా గీతం

    రచన: శ్రీ గంటేడ గౌరునాయుడుగారు, శ్రీకాకుళం జిల్లా.

    పాడుదమా స్వేచ్ఛాగీతం
    ఎగరేయుదమా జాతిపతాకం
    దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం
    |పాడుదమా|

    జలియన్ వాలా బాగు దురంతపు
    నెత్తుటి ధారలు హత్తుకొని
    ఉరికొయ్యల చెరసాలల గోడల
    దారుణాలు తలకెత్తుకొని
    పొగిడిన కాలం పోరాడిన కాలం
    మరి మరి ఒకపరి తలచుకొని
    మృత వీరుల గాధలు తెలుసుకొని
    |పాడుదమా|

    వందేమాతరమని నినదించిన
    వీరుల శౌర్యం తలచుకొని
    స్వాతంత్రం నా జన్మహక్కని
    గర్జించిన గళమందుకొని
    పోరాట ఫలం స్వాతంత్ర ఫలం
    కలకాలం కాపాడుకొని
    కడు గర్వంగా కొనియాడుకొని
    |పాడుదమా|

    మన్యం గుండెల మంటై రగిలిన
    విప్లవ జ్యోతి స్ఫూర్తియని
    గుండు కెదురుగా గుండె నిలిపిన
    తెలుగు సింగముల తెగువగని
    చీకటి గుండెల బాకై మెరిసిన
    గరిమెళ్లను గురుతుంచుకొని
    మన తెలుగు తేజమును నింపుకొని
    |పాడుదమా|

    జనగణమనముల జాగృతినింపిన
    జెండా గాథలు చెప్పుకొని
    జయహే జయజయహే జననీ యని
    జయ గీతమ్ములు పాడుకొనీ
    పావన చరితం పరిమళభరితం
    అఖండ భారత ఖండమని
    అది అక్షయ అమృతభాండమనీ
    |పాడుదమా|

    • 5 min
    Children's Festival 2023 Guidelines by Lions of Punganur Noble

    Children's Festival 2023 Guidelines by Lions of Punganur Noble

    Children's Festival 2023 Guidelines by Lions of Punganur Noble

    • 41 min
    International Volunteers Day Gurukulam Challenge for Champions

    International Volunteers Day Gurukulam Challenge for Champions

    About me www.bit.ly/Manikantakamatam

    • 19 min
    Andhra Chess Association Player Registration Process

    Andhra Chess Association Player Registration Process

    https://apchess.org/register

    • 20 min
    విద్యార్థి - 2023 బాలల దినోత్సవం నాటకం

    విద్యార్థి - 2023 బాలల దినోత్సవం నాటకం

    విద్యార్థి - బాలల దినోత్సవ నాటకం నవంబర్ 2023

    ఉపోద్ఘాతము - భారతదేశం. భాగ్యోదయ దేశం. సువర్ణ భారతదేశం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు దాస్య శృంఖలాలనుంచి, ఎందరో వీరులు మరెందరో మహానుభావుల త్యాగ ఫలితమే మన ఈ సర్వసత్తాక గణతంత్ర స్వరాజ్యం. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలవుతున్నా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం. మన తర్వాత స్వాతంత్ర్యాన్ని పొందిన ఎన్నో దేశాలు అభివృద్ధి పథంలో నూతన ఆవిష్కరణలకు బీజం పోస్తున్నారు. మనం మాత్రం ఇలాగే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని తరతరాలుగా చెప్పుకుంటున్నాము. కారణం అవినీతి, నిర్లక్ష్యం, సోమరితనం, పేదరికం. ఏనాడైతే దేశ యువత ఈ నాలుగు అధర్మ పాదాలను కూకటివేళ్ళతో సహా పెకిలించివేస్తుందో, ఆనాడే మన దేశం, అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలియజేసే చిన్న ప్రయత్నమే మా ఈ విద్యార్థి. ఇది కల్పితం కాదు. మన చుట్టూ ప్రతి రోజు జరుగుతున్న సంఘటనల ఆధారంగా రూపొందించిన చిన్న నాటక ప్రయోగం మాత్రమే. ఇది ఎవర్ని ఉద్దేశించి రాసినది కాదు. ఇది ఎవరి జీవితానికైనా దగ్గరగా ఉన్ననూ, ఎవరి మనసునైనా నొప్పించినట్లైననూ సాదరాభిమానంతో ఆదరిస్తారని ఆశిస్తూ మీ నవయువ సారథులం. గురుకులం వారథులం.

    నాటక సమయం - 5 నిమిషాలు

    పాత్రలు - విద్యార్థి, మంచి, చెడు, సోమరిపోతు, బిక్షగత్తె, రాజకీయ నాయకురాలు (అబ్బాయిలైనా, అమ్మయిలైనా ఎవరైనా చేయవచ్చు)

    మొత్తం సంభాషణలు - 33
    విద్యార్థి సంభాషణలు - 7
    మంచి సంభాషణలు - 11
    చెడు సంభాషణలు - 9
    సోమరిపోతు సంభాషణలు - 2
    బిక్షగత్తె సంభాషణలు - 2
    రాజకీయ నాయకురాలు సంభాషణలు - 2

    సంభాషణలు

    విద్యార్థి - కష్టపడి డిగ్రీ పట్టా సాధించేశా. ఈ పట్టా చూపిస్తే అమ్మానాన్నలు చాలా సంతోషిస్తారు. ఇలాగే కష్టపడి ఒక మంచి ఉద్యోగం కూడా సాధిస్తే ఇక జీవితంలో సెటిల్ అయినట్లే (అనుకుంటూ సంతోషపడుతుంటే తనలోనుంచి మంచి కుడి

    • 10 min

Top Podcasts In Health & Fitness

The Mind Full Podcast
Dermot Whelan
Unveiled with Niamh and Nessa
GoLoud
ZOE Science & Nutrition
ZOE
Passion Struck with John R. Miles
John R. Miles
Exhibit A
Marvellous
Feel Better, Live More with Dr Rangan Chatterjee
Dr Rangan Chatterjee: GP & Author