19 min

'పది రోజులు' - శ్రీ అప్పాదురై ముత్తులింగ‪ం‬ Harshaneeyam

    • Books

'పది రోజులు' అనే ఈ కథకు మూలం ‘పట్టు నాట్కళ్’ అని   శ్రీ అప్పాదురై ముత్తులింగం రచించినది. తమిళంలో ఈయన రాసిన కథలను, అతి చక్కగా తెలుగులోకి అనువదించారు శ్రీ అవినేని భాస్కర్ గారు. ఛాయా ప్రచురించిన ఈ పుస్తకం పేరు 'ఐదు కాళ్ళ మనిషి'.
శ్రీలంకలో జన్మించిన శ్రీ ముత్తులింగం శ్రీ లంక లో ఛార్టర్డ్ అకౌంటెన్సీ లో , ఇంగ్లాండ్ లో మానేజ్మెంట్ అకౌంటెన్సీ లో పట్టా పుచ్చుకున్నారు. శ్రీలంక పాకిస్తాన్ లతో పాటూ అనేక యూరోపియన్ దేశాల్లో , నార్త్ అమెరికా లో కూడా ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేశారు. చాలా మంచి కథారచయిత. ఆయాదేశాల్లో తనకు  ఎదురైన జీవితాలపై, అనుభవాలపై కథలు రాసారు. 
ఇప్పుడు  మీరు వినబోయే కథ పాకిస్తాన్ లో ఇస్లామాబాద్ లో ఆయనకెదురైన ఒక వ్యక్తి గురించి.

పుస్తకం కొనడానికి కింది లింక్ ని ఉపయోగించండి.  https://harshaneeyam.captivate.fm/aidu

‘పది రోజులు’

ఇస్లామాబాద్ ఎనిమిది భాగాలుగా నిర్మించబడ్డ నగరం. అక్కడ ఎఫ్ ప్రాంతంలో అద్దె ఇళ్ళు దొరకడం అన్నది బ్రహ్మ ప్రళయం అనే చెప్పాలి. ప్రభుత్వోద్యోగులు, మిలిటరీ అధికారులు, రాజకీయంగా పలుకుబడి ఉన్నవారూ మాత్రమే అక్కడ ఇళ్ళు కట్టుకుని నివసిస్తుంటారు. కాబట్టి అద్దె వాటాలన్నవి తక్కువ. ఉన్న కొన్నిటికీ అవి ఖాళీ కాక ముందునుండే టెనంట్లు ఎదురు చూస్తుంటారు. ఏ గొప్ప ప్రభుత్వాధికారికో ముందరే చెప్పివుంచి ఓ ఐదారు నెలలు కాచుకునుంటే ఇల్లు దొరకచ్చు. అలాంటి ఒక ప్రయత్నంతోనే నేను అక్కడొక ఇల్లు వెతుక్కుని అద్దెకు దిగాను.

ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. ఎండగా వున్నప్పుడు డాబా మీదకెక్కిచూస్తే మర్గెల్లా  కొండలు కనబడుతాయి. వీధులు, రోడ్లు ఒకదానికొకటి సమకోణంలో ఉంటాయి. ఎత్తయిన మేడ మీదనుండి చూస్తే ఊరంతా చతురస్రాల్లా కనబడుతుంటుంది. మావీధి మొత్తం నేరేడు చెట్లు వుండటం వల్ల ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. మార్కెట్ట