
300 episodes

హర్షణీయం Harshavardhan
-
- Arts
-
-
4.6 • 12 Ratings
-
Harshaneeyam is a podcast for 'telugu Short stories', wherein we podcast famous telugu short stories in audio form , Interviews with writers and analysis of popular stories.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy
-
సద్గతి - శ్రీ మధురాంతకం నరేంద్ర
రచయిత తన రచనా వ్యాసంగాన్ని నలభై ఆరేళ్ళ క్రితం ప్రారంభించారు. వారిది సాహిత్య కుటుంబం. వారి తండ్రి గారు మధురాంతకం రాజారామ్ గారు , సోదరుడు మహేంద్ర గారు కూడా సుప్రసిద్ధ తెలుగు కథా రచయితలు.ఇది గాక , ఆయన ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన చేసి , అధ్యాపక వృత్తిలో ప్రవేశించి, నలభై ఏళ్ల పైన, వేలమంది విద్యార్థులకి విద్యా దానం చేశారు.మన సమాజంలో, మన వ్యక్తిత్వాలలో వుండే వైచిత్రిని , అనేక రకాలైన సంఘర్షణలని అతి సుతారమైన తనదైన శైలిలో , అత్యంత సహజంగా చిత్రీకరించడమే ఆయన రచనలలో వుండే ప్రత్యేకత.ఒక సకారాకాత్మకమైన మార్పు , కథ చదివే ప్రతి వ్యక్తిలో, తద్వారా మన సమాజంలో తీసుక రావాలని నిరంతరమూ కృషి చేసే హాలికుడాయన.అత్యంత ప్రతిష్టాత్మకమైన 'కథ' అవార్డు తో బాటూ ఎన్నో పురస్కారాలు అందుకున్నారాయన, ఈ ప్రయాణంలో.
ఈ కథ కు ఆడియో అందించింది శ్రీమతి స్వాతి గారు . వారికి నరేంద్ర గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.
స్వాతి గారి యూట్యూబ్ ఛానల్ లో మీరు మరిన్ని తెలుగు కథలు వినవచ్చు.
https://www.youtube.com/c/SwathiPantula
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy -
ట్రిగ్గర్
ట్రిగ్గర్
అశోకరాజు సోఫాలో కూచుని కాఫీ తాగుతూ టీవీ ఆన్ చేసాడు.
‘ ముగ్గురు కాలేజీ పిల్లలు ఓ నగల దుకాణం మీద దాడిచేసి పట్టుబడ్డారని బ్రేకింగ్ న్యూస్ కింద చూపిస్తున్నారు. సంఘటనలో గాయపడ్డ వాచ్ మెన్ చావు బతుకుల్లో వున్నాడు. జరిగిందంతా ఊహించి 3 -డీ యానిమేషన్ సాయంతో, నేపధ్య సంగీతంతో కలిపి ఛానల్ వాళ్ళు ప్రేక్షకులకు అందచేస్తున్నారు. దీనికి అదనంగా స్టూడియోకి వచ్చి కూచున్న మేధావులు ‘నేటి యువత - సినిమాలు’ అనే చర్చా కార్యక్రమంలో ఒళ్ళు మరచి పాల్గొంటున్నారు.
టీవీ ఆఫ్ చేసాడు. కాఫీ గ్లాసు పక్కన బెట్టేసి, బయలుదేరబోతూ భార్యని అడిగాడు, “వీడింకా లేవలేదా?”
“లేదు. అదేదో తాడో, పేడో కొని చేతిలో పెట్టారుగా, రాత్రంతా దాన్ని ముందరేసుకుని కూర్చోనుంటాడు. స్కూల్ బస్ టైం కి అరగంట ముందు లేచి పరిగెడతాడు” అందావిడ.
*****
అన్న, చేతులు అటూ ఇటూ చాపుతూ రకరకాల పోజులు ఇస్తూంటే, తమ్ముడు మొబైల్ తోటి ఫోటోలు తీస్తున్నాడు. గదిలో ఓ మూల బంకర్ మంచం వేసుంది. ఇంకో పక్క పుస్తకాల అలమరలు, వాటి పక్కనే రెండు స్టడీ టేబిల్స్.
చేస్తున్న పని ఆపి “అన్నా నేనూ పట్టుకుంటా. నాకు గూడా ఫోటో తీయవా” అన్నాడు తమ్ముడు.
“నీ చేతి కొద్దు చిన్నా. నాన్న గూడా కింది నించీ వచ్చేస్తూంటారు ఈపాటికి”
చిన్నా మొహం ముడుచుకుని ఫోటో షూటింగ్ మళ్ళీ కంటిన్యూ చేసాడు. అలా ఓ ఐదు నిమిషాలు గడిచింతర్వాత, చెయ్యి కుర్చీకి తగిలి, అన్న చేతిలో ఉన్న తుపాకీ, జారి, బెలూన్ చిట్లినట్టుగా శబ్దం వచ్చింది. మొబైల్ పట్టుకునున్న, చిన్నా కుప్పకూలాడు. మెడ మీంచి రక్తం, సన్నటి ధారగా స్రవించడం మొదలైంది.
పదేళ్ళ తమ్ముణ్ణి ఒళ్ళోకి తీసుకుని చిన్నా! చిన్నా! అని అరవడం మొదలెట్టాడు అన్న. ఏ మాత్రం కదలిక లేదు. కుదిపి కుదిపి అలిసిపోయి, గోడకు చేరగిలబడ్డాడు. కళ్ళు మూతబడ్డాయి. తలమీ -
స్వింగ్ - ఛాయా మోహన్ గారి 'ఒంటరి పేజీ' కథ
స్వింగ్
-----------------------------
వేసవి సాయంత్రపు ఎండ, కాలం చీకటిలోకి జారిపోకుండా శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
పార్కులో పిల్లల సందడి అలల అల్లరిలా ఉంది.
చాలా సేపటి నుంచి నా చూపు కొంచెం దూరంగా ఉయ్యాల ఎక్కి ఊగుతున్న పిల్లలు , అక్కడే తచ్చాడుతున్న ఓ ముసలాయన దగ్గర ఆగిపోయింది.
ఓ పది మంది దాకా పిల్లలు వంతులు వంతులుగా ఉయ్యాల ఊగుతున్నారు. ఓ పిల్లాడు దిగంగానే ముసలాయన ఏదో అడుగుతున్నాడు. వాళ్ళు అడ్డంగా బుర్ర ఊపుతున్నారు. అంతలో ఉడతలా మరో కుర్రాడు ఉయ్యాల మీదికి ఉరుకుతున్నాడు.
నేను రోజూ సాయంత్రం పార్క్ కి వస్తా. తను పనినుంచి రావడానికి ముందే నేను ఇంటికొస్తా, తనొచ్చేదాకా పార్క్ లో గడుపుతా. నేనెప్పడూ ఈ ముసలాయన్ని చూసిన గుర్తులేదు.
నెమ్మదిగా చీకటి బలానికి వెలుగు లొంగక తప్పలేదు. కొందరు పిల్లలు వెళ్లి పోయారు.
ఇంతలో మా అపార్టమెంట్ అబ్బాయి ఒకడు ఉయ్యాల దగ్గర నుంచి పరిగెత్తుకొస్తూ కనబడ్డాడు.
" ఏయ్ విశేష్ ఆ ముసలాయన ఇందాకటి నుంచి మిమ్మల్ని ఏంట్రా అడుగుతున్నాడు. "
" ఏం లేదంకుల్ ఆయన ఉయ్యాల ఎక్కుతాట్ట మేం హెల్ప్ చేయ్యాల్ట , ఏమైనా చిన్న పిల్లాడా అంకుల్ !? " సమాధానం ఇస్తూనే ట్యూషన్ కి టైం అవుతోందని పరుగెత్తాడు.
నే నెమ్మదిగా ఉయ్యాల దగ్గరికి వెళ్ళా. పిల్లలు ముగ్గురో, నలుగురో ఉన్నారు. చీకటి పడుతుండటంతో వాళ్ళు వెళ్ళి పోయే మూడ్ లో ఉన్నారు.
నెమ్మదిగా నే ముసలాయన దగ్గరికి వెళ్ళా. కొంచెం మావయ్యలా ఉన్నాడు. ఒకసారి ఆయన మొహంలోకి చూసి నవ్వా, ఆయనా నవ్వాడు.
" ఉయ్యాల ఊగడం చాలా ఇష్టమా ? "
మొహమాటంగా నవ్వాడు.
" ఎక్కుతారా ? "
" నే నేమైనా చిన్న పిల్లాడినా " కొంచెం చికాగ్గా మొహం పెట్టి అన్నాడు.
" పర్లేదు రండి "
దగ్గరుండి ఉయ్యాల మీద కూర్చోబెట్టా. బాలన్స్ చేసుకోలేక జారిపోబోయాడు. పట్టుకుని సర్ది కూర్చో బెట్టి నెమ్మదిగా ఊపసాగాను.
" చిన్నప్పుడు మావయ్య ఇలా -
'పది రోజులు' - శ్రీ అప్పాదురై ముత్తులింగం
'పది రోజులు' అనే ఈ కథకు మూలం ‘పట్టు నాట్కళ్’ అని శ్రీ అప్పాదురై ముత్తులింగం రచించినది. తమిళంలో ఈయన రాసిన కథలను, అతి చక్కగా తెలుగులోకి అనువదించారు శ్రీ అవినేని భాస్కర్ గారు. ఛాయా ప్రచురించిన ఈ పుస్తకం పేరు 'ఐదు కాళ్ళ మనిషి'.
శ్రీలంకలో జన్మించిన శ్రీ ముత్తులింగం శ్రీ లంక లో ఛార్టర్డ్ అకౌంటెన్సీ లో , ఇంగ్లాండ్ లో మానేజ్మెంట్ అకౌంటెన్సీ లో పట్టా పుచ్చుకున్నారు. శ్రీలంక పాకిస్తాన్ లతో పాటూ అనేక యూరోపియన్ దేశాల్లో , నార్త్ అమెరికా లో కూడా ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేశారు. చాలా మంచి కథారచయిత. ఆయాదేశాల్లో తనకు ఎదురైన జీవితాలపై, అనుభవాలపై కథలు రాసారు.
ఇప్పుడు మీరు వినబోయే కథ పాకిస్తాన్ లో ఇస్లామాబాద్ లో ఆయనకెదురైన ఒక వ్యక్తి గురించి.
పుస్తకం కొనడానికి కింది లింక్ ని ఉపయోగించండి. https://harshaneeyam.captivate.fm/aidu ( https://harshaneeyam.captivate.fm/aidu)
‘పది రోజులు’
ఇస్లామాబాద్ ఎనిమిది భాగాలుగా నిర్మించబడ్డ నగరం. అక్కడ ఎఫ్ ప్రాంతంలో అద్దె ఇళ్ళు దొరకడం అన్నది బ్రహ్మ ప్రళయం అనే చెప్పాలి. ప్రభుత్వోద్యోగులు, మిలిటరీ అధికారులు, రాజకీయంగా పలుకుబడి ఉన్నవారూ మాత్రమే అక్కడ ఇళ్ళు కట్టుకుని నివసిస్తుంటారు. కాబట్టి అద్దె వాటాలన్నవి తక్కువ. ఉన్న కొన్నిటికీ అవి ఖాళీ కాక ముందునుండే టెనంట్లు ఎదురు చూస్తుంటారు. ఏ గొప్ప ప్రభుత్వాధికారికో ముందరే చెప్పివుంచి ఓ ఐదారు నెలలు కాచుకునుంటే ఇల్లు దొరకచ్చు. అలాంటి ఒక ప్రయత్నంతోనే నేను అక్కడొక ఇల్లు వెతుక్కుని అద్దెకు దిగాను.
ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. ఎండగా వున్నప్పుడు డాబా మీదకెక్కిచూస్తే మర్గెల్లా కొండలు కనబడుతాయి. వీధులు, రోడ్లు ఒకదానికొకటి సమకోణంలో ఉంటాయి. ఎత్తయిన మేడ మీదనుండి చూస్తే ఊరంతా చతురస్రాల్లా కనబడుతుంటుంది. మావీధి మొత్తం నేరేడు చెట్లు వుండటం వల్ల ఎప్పుడూ చల్లగానే ఉంట -
రామేశ్వరం కాకులు: కథ - ప్రతిస్పందన.
ఈ కథ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘ రామేశ్వరం కాకులు’ పుస్తకం లోనిది.
పుస్తకం కొనాలంటే – https://amzn.to/3rDN1YM (https://amzn.to/3rDN1YM)
రామేశ్వరం కాకులు :
వెనకవైపు రెండు వేపచెట్లు పెరడంతా నీడ పెడతాయి. ఆ రెండు చెట్లనీడలో వానల్లో, ఎండల్లో, చలిలో క్షేమంగా ఉంటుంది పోలీసు స్టేషను. పెరటిగోడ పక్కభాగంలో లోపలికి రావడానికి చిన్న గేటుంది. సామాన్యంగా తెరవరు. వేపనీడలో ఒకవైపు రెండు స్నానాల గదులూ, ఒక పాయఖానా, వీటికి దూరంగా నాలుగు నీలం ప్లాస్టిక్ కుర్చీలు పడుంటాయి. స్టేషనుకి వెనక వరండా ఉంది. వరండాలో అనేకమంది నేరస్థులు, అమాయకులు, అనుమానితులు కూర్చుని కూర్చుని నున్న బరిచిన రెండు పొడవాటి బెంచీలుంటాయి. రెండుకాళ్లూ ఎదుట కుర్చీలో పడేసి, టీ తాగిన కప్పు పక్కకుర్చీలో పెట్టి, తీరిగ్గా సిగరెట్టు వెలిగించి, పొగ వదులుతూ, కానిస్టేబులు వేపు చూశాడు రెడ్డి.
దరిదాపు ఒంటిగంటవుతోంది – వేప కింద మంచం వేసుకుని హాయిగా పడుకోవాలనుంది అతనికి.
“ఊ. ముండలకి అన్నం పెట్టారా?” కానిస్టేబులు నవ్వాడు.
“తిన్నారు సార్. బేబీ వచ్చి డబ్బులిచ్చింది.”
“ఎలాగైనా వాళ్లని బానే చూసుకుంటారా మీరు.”
ఎస్సైగారి మాటలకి మళ్లీ నవ్వాడు పీసీ.
“ఎంతమందీళ్లు.”
“నలుగురు సార్. ముగ్గురు పాతోళ్లే. నాలుగోది ఈడది కాదు సార్.”
“అవునే, ఈళ్లకి మన్లాగే ట్రాన్స్ ఫర్లుంటాయి గదా!”
మళ్లీ నవ్వేడు పీసీ.
“దాని గుంటూరు యాసండి. అదేదో పల్లెటూరు సార్. మాణ్నెల్లయిందంట దీనికాడికొచ్చి. ఇంటర్ చదివిందంట సార్.”
“ఆ. ఉష్ణోగాలు జేసే వోళ్లీ సెల్ ఫోన్లు అడ్డుపెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు. నే వైజాగులో మెడిసిన్ చదివే అమ్మాయిల్ని పట్టుకున్నాను. అంటే డబ్బు కోసం కాదనుకో. ఈ డ్రగ్స్ ఉంటయి గదా, వాటికి అలవాటుపడి.”
కాసేపాగి పీసీ వెళ్లిపోయాడు. రెడ్డి భోజనం చేసి వచ్చాడేమో చల్లటి వేపగాలికి కునుకు తీయాలనుంది. త -
‘తెరిచున్న కిటికీ’: మూలం - హెక్టర్ హ్యూగో మన్రో (Saki) రాసిన ‘The Open window’
‘తెరిచున్న కిటికీ’: మూలం - హెక్టర్ హ్యూగో మన్రో (Saki) రాసిన ‘The Open window’
(https://americanliterature.com/author/hh-munro-saki/short-story/the-open-window)
“అత్తయ్య ఇప్పుడే వచ్చేస్తుందండీ, ఈలోపల నా కంపనీ భరించాలి మీరు” అంది ఆ పదిహేనేళ్ల యువతి నవ్వుతూ, కొత్త మనిషిని కలుస్తున్నాను అన్న బెరుకేవీ లేకుండా.
వాళ్ళ అత్త రాక ప్రాముఖ్యతని తక్కువ చేయకుండా, ఈ అమ్మాయిని పొగుడుదామని కొంత ఉత్సాహపడ్డాడు, ఫ్రాంటన్ నట్టెల్.
నిజానికి, ఇలా ఒకరి తర్వాత ఒకర్ని, కొత్తవాళ్ళని కలవడం అతనికంత గొప్ప ఐడియాలా అనిపించడంలేదు. తన నరాల వ్యాధి తగ్గడానికి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందో అర్థం కావడం లేదు.
పల్లె ప్రాంతంనికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని ఏర్పాట్లు చేసుకుంటూంటే, వాళ్ళ అక్కయ్య అంది, “నాకు బాగా తెల్సు. నువ్వు అక్కడికెళితే, ముసుగేసుకుని ఎవ్వరినీ కలవకుండా మూలుగుతూ కూర్చుంటావు. ఆ ఒంటరి బతుక్కి, నరాలు ఇంకా బలహీనపడతాయి. నాకు తెల్సిన వాళ్లందరికీ ఉత్తరాలు రాసిస్తాను. నా మాట విని, వాళ్ళని కలుస్తూ వుండు. నాకు తెల్సినంతమటుకు వాళ్ళందరూ మంచి మనుషులు. నిన్ను ఇబ్బంది పెట్టరు .”
ఫ్రాంటన్ కి అనుమానం వచ్చింది, ‘తను కలవబోయే మిసెస్ సాపిల్టన్, ఈ ‘మంచి’ అనబడే కాటగిరీలో ఉందా?’ అని.
అతను కొంత కుదురుకున్నాడు అని నిర్ధారించుకుని , “మీకీ చుట్టుపక్కల చాలా మంది తెల్సా?” అని అడిగింది ఆ అమ్మాయి.
“ఒక్కరు తెలిస్తే ఒట్టు. ఓ నాలుగేళ్ళ క్రితం అనుకుంటా, మా అక్కయ్య ఇదే ఊళ్ళో, పాస్టర్ గారింట్లో కొన్నాళ్ళుండింది. తనకు పరిచయం ఉన్నవాళ్ళని కలవమని కొన్ని ఉత్తరాలు రాసిచ్చింది.” అని బదులిచ్చాడు, చివరి వాక్యం మటుకు పట్టి పట్టి ఉచ్ఛరిస్తూ.
“అయితే మా అత్తయ్య గురించి కూడా మీకేవీ పెద్ద తెలిసుండదే?” నింపాదిగా అడిగింది ఆ అమ్మాయి.
“ఆమె పేరు, అడ్రస్ మాత్రం తెల్సు” అంటూ అనుకున్నాడు, ‘అసలు ఈ మ
Customer Reviews
Chandratha
Akarshniyam