163 episodes

Harshaneeyam is a podcast for 'telugu Short stories', wherein we podcast famous telugu short stories in audio form , Interviews with writers and analysis of popular stories.

This podcast uses the following third-party services for analysis:

Chartable - https://chartable.com/privacy

Harshaneeyam Harshavardhan

  • Arts
  • 4.4 • 9 Ratings

Harshaneeyam is a podcast for 'telugu Short stories', wherein we podcast famous telugu short stories in audio form , Interviews with writers and analysis of popular stories.

This podcast uses the following third-party services for analysis:

Chartable - https://chartable.com/privacy

  'జెన్' - పతంజలి శాస్త్రి గారు

  'జెన్' - పతంజలి శాస్త్రి గారు

  రిటైరై, కొడుకూ కోడలితో జీవించే నాయుడు గారు. వృత్తి రీత్యా ఒక మెకానిక్. చుట్టూ వుండే ప్రపంచాన్ని ఆశావహ దృక్పధంతో చూస్తూ, ఓపిగ్గా, చుట్టూవుండే పరిస్థితులను కావలసిన విధంగా మలుచుకుంటూ, జీవించడాన్ని ఇష్టపడతారు.
  ఆయనకు పూర్తిగా విరుద్ధ స్వభావం వుండే ఆయన కొడుకు కృష్ణ , తన జీవితంలో వుండే అసంతృప్తిని వస్తువులపై చూపించడమే కాక , తన భార్యను కూడా వాటి గాటన కట్టేసే మనిషి.
  కథలోవుండే ఇంకో ముఖ్యపాత్ర ‘అమ్మతల్లి’ - స్నేహితుడు పనికి రాదని పారేస్తూంటే నాయుడుగారు అతన్ని ఆపి తన ఇంటికి తెచ్చుకున్న, పాడుబడ్డ ఒక మెషీను.
  చెప్పదల్చుకున్న విషయాన్ని పాఠకుడికి చేరవేయడానికి , ఒక శిల్పాన్ని చెక్కినట్టు కథను చెక్కుతూ మెల్లగా పాఠకుణ్ణి తనకు కావలసిన ఆవరణంలోకి తీసుకువెళతారు, శాస్త్రిగారు.
  నా కథలన్నీ అనుభూతి ప్రధానమైనవి, కథ నుంచి ఏమి తెల్సుకోవాలో, పాఠకుడే అలోచించి అందిపుచ్చుకోవాలి అంటారు ఆయన.
  పతంజలి శాస్త్రి గారు రాసిన అనేక గొప్ప కథల్లో ఇప్పుడు మీరు వినబోతున్న ‘జెన్’ ఒకటి.
  హర్షణీయం టీం తరఫున ఆయనకు డెబ్భై ఐదవ జన్మ దిన శుభాకాంక్షలు . Happy Birthday Sir.
  హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1?fbclid=IwAR3dGlHH6EPuiEL_nO1TMzf5DQaVd3zDZXF9Nf2VrhCxCJe3wQXKjce84hg (https://gaana.com/podcast/harshaneeyam-season-1)
  స్పాటిఫై యాప్ లో వినాలంటే –https://l.facebook.com/l.php?u=https%3A%2F%2Fbit.ly%2Fharshaneeyam%3Ffbclid%3DIwAR1UMuEBBSaNRUeI-SGj7EJQwmOELP-EJZd-P_f1srY9z8ZqrX5cGEZilicandh=AT0tIO8x5m_rULQsUqyYhxSrIQXEW5-tdj7lLy4sE5Kh5VvgypqmAJc5UGTBy_yEYgV7lWqk7VFm3Hl3CKDBh5qflXlaeT2UxgPmzx4xq1YhL9pRaN0WEiAq4FiLPqiLBKnFyHvEand__tn__=-UK-Randc[0]=AT0gKbspEUplU1kEi0MDzv5g0GOSRM_XdVR7mjdvCs6PRcCZf_M9TZ-9YM48y1lJFzhnQuBd7Ggujm-_gaLHiztQg46dhIz0P4VbX8_uu85bXQ-nIrj0LJxaeJQDppKQOv-ep8cGaZaabqlWgPJQo1oS (http://bit.ly/harshaneeyam) (Harshaneeyam on Spotify)
  ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5?fbclid=IwAR13HlPtPlygu999ulL6DUH7T5VaotHiblYb5XNORZngg7PooI6tGAPr_Z0 (http://apple.co/3qmhis5) (Harshaneeyam on Apple. Podcast)
  ‘జెన్’ :
  గేటు ముందర స్కూటరు భయంకరంగా పొరబోయి దగ్గుతోంది. కిక్ కొట్టే కొద్దీ పొడి దగ్గే తప్ప ప్రాణం పోసుకుంటున

  • 28 min
  Part - ii : సంపెంగ పువ్వు - గోపీచంద్ గారు.

  Part - ii : సంపెంగ పువ్వు - గోపీచంద్ గారు.

  కొంచెం సేపయిన తర్వాత ఆమె ఒక్క నిట్టూర్పు విడిచి ఇలా అంది. “మీ ఊరు చాలా వెనకబడి ఉందండీ!”
  నాకేమీ తోచక, “శాస్త్రి కూడా వస్తే బాగుండేది” అన్నాను.
  ఆమె ఒక క్షణం ఆగి, “చాలా వెనకబడి ఉంది” అతని తనలో తాను అనుకుంటున్నట్లు అన్నది.
  “లేకపోతే బొంబాయి ఉన్నట్లు ఉండమంటే ఎట్లా ఉంటుంది!” అన్నాను.
  “ఊరు సంగతి కాదు. మనుషుల సంగతి. నేను వచ్చినప్పటినుంచి చూస్తున్నాను. మీరు మాంధాత కాలంలో ఉన్నారు. అబ్బా, మీ ఊళ్ళో ఎలా బ్రతుకుతున్నారో. ఒకరితో మాట్లాడితే యింకొకరికి కోపం, అందరితో మాట్లాడితే అందరికీ కోపమే! దీన్నే ఈర్ష్య అంటారు కాబోలు. శాస్త్రి ఇంటో మీ అందరి సంగతి గమనించాను. కాఫీ హోటల్ కి వెళ్ళేటప్పుడు ఊళ్ళో వాళ్ళ సంగతి చూచాను. ఏం అన్యాయం? అన్నీ ప్రిమిటివ్ లక్షణాలే. ఆడవాళ్ళ పని మరీ అన్యాయంగా ఉంది. ప్రతి భార్యా తన భర్తని యితర స్త్రీలనుండి కాపాట్టమే తన ధర్మంగా నటిస్తుంది. తన భర్తతో మాట్లాడే ప్రతి స్త్రీ తన భర్తను కాజెయ్యటానికే ప్రయత్నిస్తూ ఉంది అనుకుంటుంది. ఎంత ప్రిమిటివ్! మీరంతా మాంధాత యుగంలో ఉన్నారు.”
  నేనేమీ మాట్లాడలేదు. ఆమె మాటలు యదార్థం అని నాకు తెలుసు. ఆమె వచ్చిందగ్గరనుంచి మా జీవితంలో అమానుషత్వం నాకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.
  “మీరు తెలివిగలవాళ్ళు. మీరు అనుకుంటున్న దానికంటే తెలివికలవాళ్ళు. అందుకని మిమ్మల్ని చూస్తూవుంటే నాకు ముచ్చటగా ఉంటుంది. కాని ఏం లాభం? మీ చుట్టూ వున్న సంఘంలో మీరు ఒకరు అవటంవల్ల మీలో కూడా ప్రిమిటివ్ ఇనిస్టింక్స్ చాలా ఉన్నయ్. మొదటినుంచి నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీరిక్కడ ఉండి చెడిపోతున్నారు. మీ కొక్క సలహా చెపుతాను
  మీరిక్కడ స్త్రీల క్లబ్బు నొకదాన్ని ఆర్గనైజు చెయ్యండి. ఆడవాళ్ళని కొంచెం కలిసి మెలసి తిరిగేటట్టు చేస్తే తప్ప ఈ పశుత్వం పో

  • 22 min
  Part - I : సంపెంగ పువ్వు - గోపీచంద్ గారు.

  Part - I : సంపెంగ పువ్వు - గోపీచంద్ గారు.

  ‘సంపెంగ పువ్వు’ గోపీచంద్ గారు రాసిన కథ . 1971 వ సంవత్సరం, జనవరి నెల యువ మాస పత్రిక లో ప్రచురింపబడింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు.
  ఈ కథను మీకు అందించదానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు.
  ముందుగా, రజని గారు గోపీచంద్ గారి గురించి , ఈ కథ గురించీ మాట్లాడతారు.
  హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1?fbclid=IwAR3dGlHH6EPuiEL_nO1TMzf5DQaVd3zDZXF9Nf2VrhCxCJe3wQXKjce84hg (https://gaana.com/podcast/harshaneeyam-season-1)
  స్పాటిఫై యాప్ లో వినాలంటే –https://l.facebook.com/l.php?u=https%3A%2F%2Fbit.ly%2Fharshaneeyam%3Ffbclid%3DIwAR1UMuEBBSaNRUeI-SGj7EJQwmOELP-EJZd-P_f1srY9z8ZqrX5cGEZilicandh=AT0tIO8x5m_rULQsUqyYhxSrIQXEW5-tdj7lLy4sE5Kh5VvgypqmAJc5UGTBy_yEYgV7lWqk7VFm3Hl3CKDBh5qflXlaeT2UxgPmzx4xq1YhL9pRaN0WEiAq4FiLPqiLBKnFyHvEand__tn__=-UK-Randc[0]=AT0gKbspEUplU1kEi0MDzv5g0GOSRM_XdVR7mjdvCs6PRcCZf_M9TZ-9YM48y1lJFzhnQuBd7Ggujm-_gaLHiztQg46dhIz0P4VbX8_uu85bXQ-nIrj0LJxaeJQDppKQOv-ep8cGaZaabqlWgPJQo1oS (http://bit.ly/harshaneeyam) (Harshaneeyam on Spotify)
  ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5?fbclid=IwAR13HlPtPlygu999ulL6DUH7T5VaotHiblYb5XNORZngg7PooI6tGAPr_Z0 (http://apple.co/3qmhis5) (Harshaneeyam on Apple. Podcast)
  సంపెంగపువ్వు:
  సంపెంగ పువ్వు
  “ఆమె ఈ బండికి వస్తోందని నీకెట్లా తెలిసింది?” అని శాస్త్రిని అడిగాను. అప్పుడు ఆరుగంటలవుతుంది. బొంబాయినుంచి రైలువొచ్చే టైం. నేనూ, శాస్త్రి ప్లాటుఫారం మీద నుంచొని మాట్లాడుకుంటున్నాం.
  “ఇవ్వాళే వైరిచ్చింది” అన్నాడు శాస్త్రి. ఆమె శాస్త్రి స్నేహితురాలట ఆమె బండికి వస్తోందని చెప్పి నన్ను వెంట పెట్టుకొచ్చాడు శాస్త్రి.
  శాస్త్రి ఆమెని గురించి చెప్పిన మాటల్ని బట్టి ఆమె విచిత్ర వ్యక్తి అనిపించింది నాకు
  “బలే మనిషి, బలే మనిషి” అంటాడు శాస్త్రి. ఏమడిగినా “నువ్వే చూస్తావుగా” అంటాడు. “ఏమోనబ్బా, నాకు చెప్పటం చాతగాకుండా ఉంది మన సంఘంలో ఇటువంటి మనిషి ఉండదు. వచ్చే సంఘంలో ఆడవాళ్ళు ఇట్లా వుంటారేమో!

  • 15 min
  part ii - ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన

  part ii - ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన

  ఆగదిలో యింకోవస్తువేదో ఉన్నట్టు రావుగారికి కనిపించింది. తెరచిన తలుపులోనుంచి లోపలికేదో ప్రవేశించినట్లుగా, చేతిలో దీపం వెలిగించి ఆయన ఆవేపు చూశారు. ముష్టి ఆమె గజగజ వణకుతూ నీరు కారుతూ వొకమూల నిలబడివుంది. ఆమె తడివెంట్రుకలు ముఖాన్నీ చెక్కులనీ అంటుకున్నాయి. వాటివెంట నీరు కారుతోంది.
  ‘బాబుగారు! తలుపు ముయ్యలేదే! కొంచెం వెచ్చగా వుంటుంది’ అంది ఆమె గొంతుక బాగా పెద్దది చేసి. ఆయన ఒక యంత్రంలాగా లేచి తలుపు ముయ్యడానికి ప్రయత్నించి విఫలులయ్యారు. ఆమె సహాయం చేసింది. ఎలాగో తలుపు మూసి లోపల గడియవేశారు. కాని గాలి ఒక్కసారి వూపింది. గడియ వూడిపోయింది. ఇద్దరూ మళ్ళీ తలుపులు మూసి గదిలో వున్న కర్రసామాను అంతా కొన్ని కుర్చీలూ, ఒక బీరువ, బరువైన డ్రాయరూ తలుపుకి అడ్డంగా చేర్చారు. తలుపులు ముయ్యాలని తనకు తోచకపోవడం రావుగారికి వింతగా తోచింది.
  ఇపుడు కొంత వెచ్చగా వుంది. భయం తగ్గింది. ఎక్కడో పెద్ద చప్పుడైంది. ఏదో పడిపోయింది. స్టేషన్ లోపలే పడిపోయిందేమో? “ఏం గాలి వానండి బాబుగారు నేను పుట్టిన్నాటి నుండి యింత గాలివాన నేను సూడలేదు.” అంది ముష్టి ఆమె గొంతులో ఏమీ బెదురులేకుండా.
  అంత ప్రశాంతంగా ఆమె ఎట్లా మాట్లాడకలుతుందో ఆయనకు అర్థం కాలేదు. ఆమెవేపు దీపం వేసి చూశారు. మూలగా చలిచేత ముడిచి పెట్టుకుని వొణుకుతూ ఆమె కూచుంది. రావుగారు పెట్టి తీసి తనపంచ ఒకటి తీసి ఆమెవేపు విసిరి ‘తడిబట్ట విడిచి యిది కట్టుకో’ అన్నారు. ఆయనన్న దేమీ ఆమెకు వినిపించలేదు. కానీ పొడిబట్ట యిచ్చినందుకు కృతజ్ఞత చూపిస్తూ బట్టమార్చుకుంది. ఆ మూలే పొడిగా వున్నచోట కూర్చుంది. రావుగారికి తనకు ఆకలి వేస్తున్నట్లు జ్ఞాపకం వచ్చింది
  తన పెట్టె తీసి అందులో వున్న బిస్కట్ల పొట్లం తీశారు. ఒకటొకటి చొప్పునా నమలడం మొదలు పెట్టారు. |
  అక్

  • 18 min
  part I - ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన

  part I - ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన

  కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘గాలివాన ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది . న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన కథల పోటీలో రెండవ బహుమతి పొందింది.
  పుస్తకం కొనడానికి కావాల్సిన web link
  https://bit.ly/3s7mPCW (Palagummi Padmaraju Rachanalu -Vol1)
  కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు.
  ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు.
  హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1?fbclid=IwAR3dGlHH6EPuiEL_nO1TMzf5DQaVd3zDZXF9Nf2VrhCxCJe3wQXKjce84hg (https://gaana.com/podcast/harshaneeyam-season-1)
  స్పాటిఫై యాప్ లో వినాలంటే –https://l.facebook.com/l.php?u=https%3A%2F%2Fbit.ly%2Fharshaneeyam%3Ffbclid%3DIwAR1UMuEBBSaNRUeI-SGj7EJQwmOELP-EJZd-P_f1srY9z8ZqrX5cGEZilicandh=AT0tIO8x5m_rULQsUqyYhxSrIQXEW5-tdj7lLy4sE5Kh5VvgypqmAJc5UGTBy_yEYgV7lWqk7VFm3Hl3CKDBh5qflXlaeT2UxgPmzx4xq1YhL9pRaN0WEiAq4FiLPqiLBKnFyHvEand__tn__=-UK-Randc[0]=AT0gKbspEUplU1kEi0MDzv5g0GOSRM_XdVR7mjdvCs6PRcCZf_M9TZ-9YM48y1lJFzhnQuBd7Ggujm-_gaLHiztQg46dhIz0P4VbX8_uu85bXQ-nIrj0LJxaeJQDppKQOv-ep8cGaZaabqlWgPJQo1oS (http://bit.ly/harshaneeyam) (Harshaneeyam on Spotify)
  ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5?fbclid=IwAR13HlPtPlygu999ulL6DUH7T5VaotHiblYb5XNORZngg7PooI6tGAPr_Z0 (http://apple.co/3qmhis5) (Harshaneeyam on Apple. Podcast)
  గాలివాన’
  మబ్బు మసగ్గా అలుముకుపోయింది. రైలు చాలా ఆలస్యంగా వచ్చింది. రావుగారు రెండో తరగతి పెట్టె ఎక్కుతుంటే, ఆయనకు తన యిల్లు, ఆ యింట్లో అలవాటుపడ్డ సుఖాలు అన్నీ జ్ఞాపకం వచ్చాయి.
  ఆయన చదువుకునే గది అతి శుభ్రంగా తుడిచివుంది. అందులో నల్ల విరుగుడు చేవతో చేసిన రాతిబల్ల, దానిమీద ఒక మూలగా, ఒక ఆకుపచ్చ గొట్టంలో దీపం వెలుగుతూ వుంటుంది. ఆయన కుర్చీ మెత్తలో కూర్చునే చోట అనుకూలమయిన పల్లాలు ఏర్పడ్డాయి. సోఫాలో వున్నట్టు కూడా తెలియకుండా ఆయన భార్య కూర్చుని ఉంటుంది. ఆయనకు నలుగురు పిల్లలు. ఇద్దరు ఆడ, యిద్దరు మగ.వాళ్ళని చూస్తే ఆయనకు ఎంతో గర్వం.
  రైలు పెట్టెలో మూడుమెత్తలూ ఎవరో ఆక్రమించుకుని పరుపులు పరుచుకున్నారు. తను ఎక్కినందుకు అందులో వు

  • 26 min
  'మంత్రపుష్పం' - మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథ

  'మంత్రపుష్పం' - మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథ

  హర్షణీయంలో ఇప్పుడు వినబోయే కథ - మంత్రపుష్పం, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన.
  తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన డుమువులు కథ 14 భారతీయ భాషలలోకి అనువదింపబడింది. https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B2%E0%B1%80%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%A8%E0%B0%82 (మచిలీపట్నంలో) బి.ఎ. వరకు చదివారు. తరువాత https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81 (మద్రాసులో) సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నారు. నాట్యకళలో, చిత్రలేఖనంలో, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది.
  కృష్ణాతీరం అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలగా ఖ్యాతి గడించింది.
  ఈ కథను మీకందించడానికి అనుమతినిచ్చిన క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ సూరిబాబు గారికి కృతజ్ఞతలు.

  హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1?fbclid=IwAR3dGlHH6EPuiEL_nO1TMzf5DQaVd3zDZXF9Nf2VrhCxCJe3wQXKjce84hg (https://gaana.com/podcast/harshaneeyam-season-1)

  స్పాటిఫై యాప్ లో వినాలంటే –https://l.facebook.com/l.php?u=https%3A%2F%2Fbit.ly%2Fharshaneeyam%3Ffbclid%3DIwAR1UMuEBBSaNRUeI-SGj7EJQwmOELP-EJZd-P_f1srY9z8ZqrX5cGEZilicandh=AT0tIO8x5m_rULQsUqyYhxSrIQXEW5-tdj7lLy4sE5Kh5VvgypqmAJc5UGTBy_yEYgV7lWqk7VFm3Hl3CKDBh5qflXlaeT2UxgPmzx4xq1YhL9pRaN0WEiAq4FiLPqiLBKnFyHvEand__tn__=-UK-Randc[0]=AT0gKbspEUplU1kEi0MDzv5g0GOSRM_XdVR7mjdvCs6PRcCZf_M9TZ-9YM48y1lJFzhnQuBd7Ggujm-_gaLHiztQg46dhIz0P4VbX8_uu85bXQ-nIrj0LJxaeJQDppKQOv-ep8cGaZaabqlWgPJQo1oS (http://bit.ly/harshaneeyam) (Harshaneeyam on Spotify)

  ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5?fbclid=IwAR13HlPtPlygu999ulL6DUH7T5VaotHiblYb5XNORZngg7PooI6tGAPr_Z0 (http://apple.co/3qmhis5) (Harshaneeyam on Apple. Podcast)
  మంత్రపుష్పం :

  పాపం! - చిట్టి రాలిపోయిందిరా!" అన్నాడు, మొనమొన్ననే జిల్లా కాంగ్రెసు సంఘంలో కృత్యాద్యవస్థమీద సభ్యుడుగా జొరబడ్డ మా పంతులు.
  "ఎప్పుడు?" అని మేం నలుగురం అడిగాము, గొంతులు బిగిసి.
  “వారం రోజులయింది!" అని జవాబు ఎక్కడో నూతిలోంచి వచ్చినట్టు!
  "బ్రతికి ఎందర్నో సుఖ పెట్టింది! పోయి తాను సుఖపడుతుంది" అంటూ మాలో ఒకడి నిట్టూర్పు!
  "ఆ బ్రతుక్కి చచ్చిపోవడంకన్న సుఖమేముంది? తెరిపి ఏముంది?-

  • 20 min

Customer Reviews

4.4 out of 5
9 Ratings

9 Ratings

chitti gavvalu ,

Chandratha

Akarshniyam

Top Podcasts In Arts