6 episodes

90వ దశాబ్దపు మనుషుల జీవనవిధానం ఎలా ఉండేదో తెలపడం ఈ కథల ముఖ్య ఉద్దేశ్యం

90వ దశాబ్దపు మనుషుల‪ు‬ Karthik raju Pusapati

    • Arts

90వ దశాబ్దపు మనుషుల జీవనవిధానం ఎలా ఉండేదో తెలపడం ఈ కథల ముఖ్య ఉద్దేశ్యం

    90వ దశాబ్దపు మనుషులు|#రాముడు సీత ఆట|#Ramudu seetha game|#village stories|#90skids|season 2|episode 1

    90వ దశాబ్దపు మనుషులు|#రాముడు సీత ఆట|#Ramudu seetha game|#village stories|#90skids|season 2|episode 1

    90వ దశాబ్దపు మనుషులు/season-2

    (రాముడు సీత ఆట- episode 1)

    మా చిన్నప్పుడు ఎండకాలం వచ్చిందంటే ఇంటిలొనే ఆడుకునే ఎన్నో ఆటలు ఉండేవి? అంటే ఇప్పటిలా మా చిన్నప్పుడు ఇంటర్ నెట్ సదుపాయం లేదు...ఉన్న మాకు అందుబాటులో ఉండేది కాదు...ఇప్పుడు అంటే మొబైల్ లో గేమ్స్ వచ్చేసాయి...కానీ మా చిన్నప్పడు ఆటలు అంటే శారీరక ,మానసిక ఉల్లాసాన్ని కలిగించే ఆటలు ఆడే వాళ్ళం...ఇప్పటిలా చేతిలో మొబైల్ పట్టుకొని వేయి...వెనుక నుండి కొట్టు అంటూ పిచ్చి పిచ్చి గా అరుస్తూ ఆడే గేమ్ కదండీ...మనసుకి ఆహ్లాదకరమైన ఆటలు ఆడే వాళ్ళం అందులో రాముడు సీత ఆట ఒకటి....ఒంటి పూట బడి నుండి ఇంటికి రాగానే లేదా వేసవి కాలం సెలవుల్లో శుభ్రంగా మధ్యాహ్నం భోజనం చేయగానే సరదాగా ఇంటి పక్కన వాళ్ళ తో ఇంటిలో అక్క ,చెల్లి, తమ్ముడు , స్నేహితుడు, బంధువులు ఇలా చాలామంది కలసి ఆడే వాళ్ళం ఈ ఆట...తలుచుకుంటే ఆ రోజులు అన్ని ఇట్టే కరిగిపోయాయి అనిపించిన మధుర జ్ఞాపకాలుగా మదిని మీటుతూనే ఉంటాయి...అయితే ఈ ఆట ఎలా అడుతారు అంటే...ముందుగా రెండు అంగుళాలు ఉన్న ఆరు కాగితం ముక్కలు, స్కోరుకి వేయడానికి ఓ పుస్తకం, అలానే రాయడానికి ఒక పెన్ కావాలి...సరదాగా అందరం కూర్చొని పుస్తకం, పెన్ తీసుకొని ఒక తెల్లని పేపర్ ని ముక్కలుగా చేసి ఆ కాగితపు ముక్కల పై రామాయణం కావ్యంలో పాత్రల పేర్లు రాసి.. ఈ ఆటలో రాముడుకి - 1000, సీతకి - 0,లక్ష్మణుడు కి-900 వందలు భరతుడు - 800, శత్రుఘ్నడుకి - 700, హనుమంతుడు -600 అని వ్రాసి కాగితాలను గుండ్రంగా చుట్టాలి.ఆట పెద్ద చుట్టూ కూర్చున్న వారికి గుండ్రంగా చుట్టిన కాగితాలను నేలమీద వేయాలి. వెంటనే ఎవరికి ఇష్టం వచ్చిన కాగితం వారు తీసుకుంటారు. రాముడు ఎవరో ముందు చెప్పాలి. ఆ తర్వాత రాముడు వచ్చినవారు సీత ఎవరికొచ్చిందో ఊహించి చెప్పగలగితే 1000 మార్కులు వస్తాయి. తప్పు చెబితే 0 మార్కులు. సీత వచ్చిన వారికి 1000 మార్కులు పడతాయి.

    • 3 min
    90వ దశాబ్దపు మనుషులు|ఏడుపెంకులాట (Yedupenkulata)

    90వ దశాబ్దపు మనుషులు|ఏడుపెంకులాట (Yedupenkulata)

    ఏడు పెంకులాట..!

    దాదాపుగా గ్రామీణ ఆటలన్నీ అటకెక్కి ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆబాల గోపాలం లీనమై పోతున్న ప్రస్తుత తరుణంలో లీలగా గత జ్ఞాపకాలలో గోల చేస్తూ ఆడిన ఒక పసందైన ఆట కలలో పలకరించి ఒక్క క్షణం పాటు పులకరింపు చేసింది... ఒక్క సారి ఆ పిల్ల కేరింతల జల్లులలో తడుద్దాం రండి....
    90వ దశకం వరకు చిన్నారులు ఆడే ఆటల్లో ఇష్టమైన ఆట ఏడు పెంకులట.ఈ ఆటను అప్పట్లో మా ఊర్లో ఉన్న స్నేహితులతో కలిసి ఆడిన వారిలో నేను ఒకడిని...మా వీధిలో ఉండే పిల్లలు మా ఇంటి పక్కన వాళ్ళతో కలిసి ఆడే వాళ్ళం.మొదటగా అందరం రోడ్ పై కి వచ్చి రెండు టీమ్స్ లా విడిపోయి.ఎవరికి నచ్చిన వాళ్ళు ఆ టీమ్ లో ఆడే వారు.అప్పట్లో మాతో పాటుగా మా చెల్లి వరుస అయ్యే వాళ్ళు, మా బంధువులు అమ్మాయిలు కూడా ఈ ఆటను ఆడే వాళ్ళు.ఒక్కోసారి ఉదయం మరొకసారి సాయంత్రం వేళల్లో ఈ ఆటను ఆడే వాళ్ళం.

    క్లుప్తంగా వివరించాలంటే ఈ ఆటలో రెండు జట్లు ఉంటాయి. ఒక్కొక్క జట్టులో దాదాపు అయిదు మంది సభ్యులు లేదంటే ఒక్కోసారి 8 మంది సభ్యులు ఉండేవారు.ఆట ముందుగా నిర్ణయించుకొన్న సరిహద్దులలో జరుగుతుంది.అయితే ఈ ఆటకు కావలసిన ముఖ్య వస్తువులు ఏడు పెంకులు, ఒక బంతి.ఈ ఆట ప్రారంభంలో ఏడు పెంకులను రోడ్ మధ్యలో అడ్డంగా ఒక గీత గిసి ...ఆ గీత మధ్యలో గుండ్రంగా ఒక సర్కిల్ గిసి అందులో ఒకదానిపై మరొకటి పేర్చి ఉంచుతారు.ఈ పెంకులకు అటూ ఇటూ అయిదారు అడుగుల దూరంలో గీతలు ఉంటాయి.

    ఆట ఏ జట్టు మొదలు పెట్టాలో నిర్ణయించడానికి బొమ్మ బొరుసు వేసే వాళ్ళు.బొమ్మ బొరుసు అంటే ఏమో అనుకునేరు.అంటే ఇప్పుడు మనం “టాస్” వేస్తాం కాదా దాన్నే బొమ్మ బొరుసు అనే వారు.
    ఇంకా చెప్పలంటే ఇక్కడ కాయిన్ వేయరు.కానీ ఒక పెంకు ముక్క తీసుకొని, దానికి ఒకవైపు ఉమ్మి రాసి, గాలిలోకి ఎగురవేయాలి. ఇరు జట్ల నాయకులూ “తడి” లేదా “పొడి” లో ఒక దాన్ని ఎన్నుకొంటారు. పెంకు ఏవైపుగా తి

    • 4 min
    90వ దశాబ్దపు మనుషులు |పల్లెటూరు(palleturu)|

    90వ దశాబ్దపు మనుషులు |పల్లెటూరు(palleturu)|

    పల్లెటూరు


    90 దశకంలో పల్లెటూర్లు ఎటు చూసిన పచ్చదనం అవహించిందనిపించేలా ఆహ్లదకరమైన వాతావరణం కనిపించేది.పల్లెటూరు అంటేనే స్వచ్ఛతకు మారుపేరులా ఉండేది.పల్లెల్లో నివసించే ప్రజలలో ఆప్యాయతలు,అమాయకత్వం కనబడుతుంది.ఊరిలో ఒకరికి మధ్య ఒకరికి ఎలాంటి బంధుత్వం లేకపోయిన వారి మధ్య ఆప్యాయతలు,ఓ విధమైన అనురాగలు ఉండేవి.పల్లె ప్రజల జీవనవిధానంలో కపటం లేని స్నేహం,నిర్మలమైన ప్రేమ,భక్తి భావం,కలగొల్పుతనం,మర్యాదపూర్వకమైన పిలుపు కనిపిస్తుంది.పెద్ద బంగ్లాలలు,చిన్న పూరి గుడిసెలు,మట్టి రోడ్లు వాటిపై రకాల రకాల ఆటలు ఆదుకునే పసివాళ్ళు,విధుల్లో అరుగులపై కూర్చుని సంభాషణలు జరిపే వ్యక్తులు,రోజులో ఎదో ఒక పూట రచ్చబండ దగ్గర సమావేశం అయ్యే పల్లెల్లోని పెద్దమనుషులు,ప్రాముఖ్యత గల దేవాలయాలు, పచ్చని పొలాలు,పెద్ద బావిలు,చెరువులు, కాలువలు,ఎత్తయిన కొండలు ,పెద్ద వృక్షాలు వాటికి ఉయ్యాల కట్టి ఊగే పడుచు పిల్లలలు ఇలా ఎటు వైపు చూసిన ఓ అద్భుతమైన సన్నివేశాలు ఆ అప్పటి పల్లెలు మనకి దర్శనం ఇస్తాయి.


    ఇంతకీ మా ఊరు చెప్పలేదు కాదా...మాది ఆంధ్రప్రదేశ్ లోని ఓ చిన్న పట్టణమైన తెనాలి.మా తెనాలి అంటే కృష్ణ నది నుండి ప్రవహించే మూడు కాలువలు గుర్తువస్తాయి.ఈ కాల్వల మధ్య రోడ్లు పచ్చని చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.మా ఊరు ఆంధ్రప్యారిస్ గా పేరుగాంచింది.కవులకు,నాటక,సినిమా రంగానికి చెందిన ఎందరో ప్రముఖులకు పుట్టినిల్లు మా ఊరు.భారతదేశం స్వాతంత్రం కోసం జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళ చేతులో ప్రాణాలు పోగొట్టుకున్న అమరవీరుల కోసం ఓ స్మారక కట్టడాన్ని నిర్మించారు.బ్రిటిష్ వాళ్లు పాలించే సమయంలో మా ఊరి కాలువల్లో పడవల ప్రయాణించేవని పెద్ద వాళ్ళు చెప్పే వాళ్ళు.దేశంలో మొట్ట మొదటిసరిగా తెనాలిలో కాల్వలో ప్రయాణించే నౌకల్లో గ్రం

    • 8 min
    ఉత్తరం(uttaram)

    ఉత్తరం(uttaram)

    ఉత్తరం

    జ్ఞాపకాల గొప్పతనం అవి పాతబడే కొద్దీ పెరుగుతుంది.అలాగే అపురూపమవుతుంది.కొన్ని స్మృతులు మనం సంపాదించుకున్న ఆస్తులకన్నా ఎక్కువే...తరాలు మారినా మారని చిరు జ్ఞాపకాల వెలుగు నీడలు ఉత్తరాలు.

    అవి ఎన్నో ఆహ్లాద ,ఆనంద,బాధా ఆశ్చర్యాలను తనలో నింపుకుని మనకి గతంలా మిగిలి పోయిన మాటల జ్ఞాపకాల కోటలు.దాదాపుగా ఇప్పుడు 30లకు దగ్గర పడిన వారు,అంతకు పైబడిన వారు ఈ ఉత్తరాల కోసం రోజులు తరబడి ఎదురు చూసిన రోజులు ఇప్పటికీ మసకబారి మరీ మన కళ్లముందు మెదలాడుతున్నట్లే ఉంది.


    ఉభయకుశలోపరి అంటూ అచ్చ తెలుగు పలకరింపుతో చదవడం మొదలు పెట్టి మనవారి క్షేమసమాచారాన్ని, వివరాలను తెలుసుకుని వారే ఎదురుగా ఉండి చదువుతున్నట్లు అనిపించే అద్భుతమైన అనుభూతి పొందిన క్షణాలు ఇప్పటికీ గుర్తే....మనం రాసి ఉత్తరానికి అవతలి వారి జవాబు కోసం చూసే ఎదురుచూపులలో ఉన్న అనుభూతి....క్షణాల్లో ఖండాంతరాలులో ఉన్న వారితో వీడియో కాల్ లో మాట్లాడినా ఆ అనుభూతి కలగడంలేదు...బహుశా సాంకేతికతతో పాటు సంబంధాలు కూడా పలుచబడిపోయాయేమౌ.....అనిపిస్తుంది.

    ఒక్కోసారి పొడి పొడి పలకరింపుల కంటే.... అప్పుడప్పుడు పలకరించే ఆకార్డు ముక్కే గుండెలను తాకి ఆనందంతో కళ్లను తడిపేది.అన్ని ఉత్తరాలను పోగుచేసి...ఒక సువ్వకు గుచ్చి దాచి ఉంచడం...ఏమితోచనప్పుడూ తిరిగి తెరిచి చూసిన సందర్భాలు అనేకం...నాకు ఆరు సంవత్సరాల వయస్సు లో మొదటి సారి అమ్మ పర్యవేక్షణలో పిన్ని కి నేను ఉత్తరం రాయడం....ఆ విషయాన్ని అందులో పేర్కొనడం...అది రాసినప్పుడు కలిగిన ఆనందం... పోస్ట్ డబ్బాలో వేయడానికి వెళ్లి దాని ఎత్తు అందుక ఎగిరెగిరి వేయడం.... ఇప్పటికీ ఎర్రడబ్బా కనబడితే జ్ఞాపకాల దారుల్లో అవే గుర్తుకు వస్తాయి.

    అనుభవం అయ్యేదాకా తెలియదు ఏదీ జ్ఞాపకంగా మిగులుతుందో లేదో అని...ల్యాండ్ లైన్ ఊసులతో ,ఈ-మెయిల్ చాట్ లతో అప

    • 2 min
    Arugu (అరుగు)

    Arugu (అరుగు)

    అరుగు

    కొన్ని సంవత్సరాలు క్రితం మా ఊరులో ప్రతి ఇంటి ముందు ఉండేది అరుగు.అలానే ప్రతి విధుల్లో ఉండేది...నాకింకా గుర్తుంది రోడ్ లో వెళ్తుంటే సాయంత్రం సమయంలో ప్రతి ఇంటి ముందు ఉండే అరుగుపై జనాలు కూర్చొని మాట్లాడుకుంటూ గడిపే వారు. అలానే దారిన వెళ్లే వాళ్ళని పలకరిస్తూ...యోగ క్షేమలను అడిగే వారు.నాకు 9 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు,అలానే ఆ వీధిలో ఉండే ఇంటి ముందు విశాలమైన అరుగులు ఉండేవి వాటిపై మా ఊరిలో ఉండే వాళ్ళు సాయంత్రం వేళలలో కూర్చునే కబురులు చెప్పుకునే వారు.అయితే అరుగు అనే పదం బహుశా ఈతరానికి కొత్తగా అనిపిస్తుంది...అరుగు అంటే ఏంటి అని వింతగా చూసే పరిస్థితి...ఒక్కప్పడు ప్రతి పల్లెటూరులోని ప్రతి ఇంటిముందు ఉండేది.అయితే అది మేడ అని పిలిచిన...మిధ్య అని పిలిచిన...ఓ పెద్ద బంగాళా అయిన...ఓ చిన్న గుడిసె అయినా ప్రతి ఇంటి ముందు ఉండేది...దాదాపుగా 3 అడుగులు వెడల్పు...6 అడుగులు పొడవు వరకు ఉండేది ఈ అరుగు.ప్రతి ఇంటి ముందు కూర్చోవడానికి వీలుగా నిర్మించింది ఈ అరుగు.దీని పై పడుకోవడానికి వీలుగా తల పెట్టె చోట ఎత్తుగా ఉండేలా నిర్మించే వాళ్ళు..స్తోమతను బట్టి ఈ అరుగును కొంతమంది మట్టితో..మరికొంతమంది సిమెంట్ తో నిర్మించే వాళ్ళు పల్లెటూరులో ఎంతో మందికి కాలక్షేపం కోసం కూర్చునే పల్లకి ఇది.గుడిసెలో ఉండే అలసిన బ్రతుకులు పవలించడానికి మట్టి పనుపు ఈ అరుగు.పిల్ల ఆటలకి, పెద్ద ఊసులకు అడ్డ ఇది.అప్పట్లో కాలినడకన ఊరులు చుట్టే బాటసారులకు విశ్రాంతి ఇచ్చే ప్రదేశం.నాటి చిన్నారులు ఆటలకు నెలవు ఈ అరుగు...పెద్ద వాళ్ళు,ఆడవాళ్ళు అంత సాయంత్రం ఓ చోట చేరి మాటలు కలిపే ఆత్మీయ సౌధం అరుగు.అమ్మమ్మ తాతయ్యాలు వారి మనవడు,మనవరాలను ఎత్తుకొని ఆడిస్తూ...ముద్దు చేస్తూ...చిన్నారులతో కాసేపు కాలక్షేపానికి తీయని గుర్తుగా నిలిచింది.

    • 3 min
    MahaNandi idly (మహానంది ఇడ్లీ)

    MahaNandi idly (మహానంది ఇడ్లీ)

    మా అమ్మ ఎప్పుడు చెబుతుండేది.మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు మా ఊరి రామాలయం ఎదురు సందులో మహానంది అనే ఒక ఆయన ఉండేవాడు అంట.ప్రతి రోజు ఉదయం  అతను ఓ బాదం చెట్టు క్రింద వేడి వేడిగా ఇడ్లి వేసి అమ్మేవాడు.అతను చూడనికి శివుడు ముందు నందిలా బొద్దుగా అడ్డ నామాలు పెట్టుకొని నిలువు చారాల చొక్కా నిక్కారు వేసుకొని నడుముకు ఎర్ర కండవ కట్టుకొని ఉండే వాడు.అతను చేతితో వేసిన ఇడ్లిని మా ఊరిలో వాళ్ళందరూ లొట్టలు వేసుకొని తినేవారు అని అమ్మ చెప్పింది.అతను ఉదయాన్నే కట్ల పొయ్యి పై పెద్ద రేకు డబ్బాలో ఓ పది పేట్లలో పిండి వేసి పెద్ద పెద్ద ఇడ్లి వేసే ఉడికించేవాడు.అతను దగ్గర వరుసగా నిలబడి ముందు నేను వచ్చును నాకు...కాదు నేను ముందు వచ్చాను నాకు అంటూ జనాలు ఎగబడి తినేవారట.రేకు డబ్బాల్లో నుండి తీసిని ఇడ్లిని అక్కడే ఉన్న బాదం చెట్టు ఆకుల్లో పెట్టి పొట్లం కట్టి ఇంటికి ఇచ్చి పంపించే వాడు.అప్పట్లో ఆ ఇడ్లి ధర పైసలు,పావలా,అర్థ రూపాయలల్లో ఉండేదట.
    అతని దగ్గర ఒక్కసారి పూర్తిగా చెట్నీ అయ్యిపోయి ఉట్టి ఇడ్లి మిగిలిపోయేవాని అమ్మ చెప్పింది.అలా అతని దగ్గరకి వచ్చిన వారితో మహానంది ఊరిలో జరిగి విషయాలు అడిగి తెలుసుకునేవాడు.అలానే ఊరిలో ఏ ఇంటిలోనైన పుట్టినరోజు,పెళ్లి,చిన్న చిన్న వేడుకలకు మహానందిని పిలిచి అతనితో పిండి వంటకాలు,మిఠాయిలు,లడ్డులు చెప్పించే వారు.అలా అతని వ్యాపారం కొన్ని రోజులపాటు సజావుగా సాగిపోయింది.అతనికి వయసు మీదపడిన తల్లి ఉండేది.ఆమె జబ్బు పడటంతో తన వ్యాపారం దెబ్బతినడంతో మహానందిని కష్టాలు చుట్టుముట్టాయి.చివరికి అప్పులపాలయ్యాడు.ఓ రోజున హఠాత్తుగా ఊరు విడిచి వెళ్లిపోయారు.ఎంతో రుచికరమైన ఇడ్లిని అందించిన మహానందిని జనం కొన్ని రోజులు తలుచుకుని అయ్యో పాపం అనుకున్నారు.ఆ తర్వాత మహానంది ఏమి అయ్యాడో ఎవరికి తెలియదు.. అత

    • 2 min

Top Podcasts In Arts

موسوعة الكتب الصوتية
Podcast Record
أسمار
Mics | مايكس
Marvel's Wolverine: The Lost Trail
Marvel & SiriusXM
Dish
S:E Creative Studio
The afikra Podcast
afikra
Dom Tak | دُمْ تَكْ
Sowt | صوت