5 episodes

మన తెలుగు మాటల గురించి, వాటిలో దాగివున్న అర్థాల మూటల గురించి కొన్ని మాటలు

మాటల మూటల‪ు‬ వీవెన్

  • Education
  • 5.0 • 1 Rating

మన తెలుగు మాటల గురించి, వాటిలో దాగివున్న అర్థాల మూటల గురించి కొన్ని మాటలు

  ద్వంద్వప్రమాణాలు ద్విగుణీకృతం

  ద్వంద్వప్రమాణాలు ద్విగుణీకృతం

  ఈ విడతలో రెండు, రెండవ అనే అర్థాలలో సంస్కృతం నుండి వచ్చిన ద్వి, ద్వయ, ద్వంద్వ తదితర మాటలను తెలుసుకుందాం:
  (కొనసాగింపు) ఆది: ఆదివారం, ఆదిపురుషుడు, ఆద్యుడు, ఆదిభిక్షువు, ఆదిదంపతులు
  ద్వి: ద్విసంఖ్యామానం, ద్వయాంశ పద్ధతి
  ద్వయాక్షరి, ద్విత్వం, ద్విత్వాక్షరం, ద్విరుక్తం
  ద్వితీయం, అద్వితీయం, అద్వయం, అతిద్వయం
  ద్వితీయ → విదియ
  ద్విజుము, ద్విజుడు
  ద్వైతం, అద్వైతం, అద్వైతి, అద్వైయుడు
  ద్విగుణీకృతం
  ద్వయం: మిత్రద్వయం
  ద్వయి → దోయి → దోయిలి → దోసిలి
  ద్వంద్వం: ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వనీతి, ద్వంద్వ వైఖరి, ద్వంద్వ పౌరసత్వం, ద్వంద్వ సమాసం
  నిర్ద్వంద్వం = మరోమాట లేకుండా తేల్చిచెప్పడం
  ద్వంద్వం → దొందం → దొందు: దొందూ దొందే
  ద్వైపాక్షిక సంబంధాలు, చర్చలు  మీ సందేశాలను, సందేహాలను నాకు తెలియజేయండి: ఆంకర్.ఎఫ్ఎమ్ సైటు ద్వారా లేదా నా ట్విట్టరు పేజీలో!

  • 10 min
  జోడు గుర్రాలపై స్వారీ

  జోడు గుర్రాలపై స్వారీ

  ఈ విడతలో మలి, జత, జంట, జోడు తదితర మాటల గురించి తెలుసుకుందాం:


  మరు → మలు → మలి: మలిచూపు, మల్చూరు, మలిసంధ్య/మలుసంజ, మలికారు
  జత, జతకట్టడం, జతపరచడం, జతచేయడం
  జంట, జంట నగరాలు
  జోడు
  జమలి/జమిలి: జమిలి ఎన్నికలు; జమిలించడం
  కవ: కనుగవ, చనుగవ, కవలలు
  అమడ: అమడలు, అమడకాయ, అమడమాటలు
  యుగళము, యుగ్మము: యుగళగీతం  మీ సందేశాలను, సందేహాలను నాకు తెలియజేయండి: ఆంకర్.ఎఫ్ఎమ్ సైటు ద్వారా లేదా నా ట్విట్టరు పేజీలో!

  • 8 min
  రెండు, ఇరు

  రెండు, ఇరు

  ఈ మలి విడుతలో రెండు, ఇరు తదితర మాటల గురించి తెలుసుకుందాం.


  రెండు = 2, భేదము, తేడా
  ఇరుగురు → ఇరువురు → ఇద్దరు
  ఇరుక్కుపోవడం, ఇరకాటం
  ఇరుమూడు, ఇరునాలుగు, ఈరైదు, ఈరారు, ఈరేడు, ఈరెనిమిది, ఇరుపది → ఇరుబది → ఇరవై
  ఇనుమడించు
  ఇనుమడి → ఇన్మడి → ఇబ్బడి
  ఇబ్బడి, ముబ్బడి
  రెండు చేతులా సంపాదించడం
  రెండు నాల్కల ధోరణి
  రెండు కళ్ళ సిద్ధాంతం

  మీ ప్రతిస్పందనలను తెలియజేయండి:


  ఆంకర్ సైటులో మీ గొంతు ద్వారా
  నా ట్విట్టర్ ఖాతా ద్వారా

  • 9 min
  ఉభయతారకం

  ఉభయతారకం

  ఈ అదనపు భాగంలో ఉభయులు తదితర మాటల గురించి తెలుసుకుందాం!


  ఉభయతారకం
  ఉభయచరం
  ఉభయ కుశలోపరి
  ఉభయ గోదావరి జిల్లాలు

  • 1 min
  మొదలు, మొదటి, మొదలుపెట్టడం

  మొదలు, మొదటి, మొదలుపెట్టడం

  ఇది మాటల మూటలు పాడ్‌కాస్టు తొలి భాగం. దీనిలో మొదలు, మొదటి, మొదలుపెట్టడం అనే అర్థాన్ని తెలిపే తెలుగు మాటల గురించి తెలుసుకుందాం.


  మొదలు, మొదటి, మొదటిగా, మొదలుపెట్టడం, మొట్టమొదలు
  తొలి, తొలుత, తొలుదొల్త, తొట్టతొలి
  ముందు, ముందుగా, మున్ముందు
  ఆరంభం, శుభారంభం, ఆరంభించు, ప్రారంభం, ప్రారంభించు
  ప్రథమం, ప్రధమ, ప్రప్రథమం
  ఆది, ఆద్యము
  మొదలుపెట్టడం: నాంది పలుకడం, అంకురార్పణ చేయడం, శ్రీకారం చుట్టడం, ఉపక్రమించడం, నడుంకట్టడం, నడుంబిగించడం, పట్టాలెక్కించడం
  మొదలవడం: మొలకెత్తు, మొగ్గతొడుగు, చిగురించు, రూపుదాల్చు, ఉదయించు, ఉద్భవించు, ఆవిర్భవించు

  • 6 min

Customer Reviews

5.0 out of 5
1 Rating

1 Rating

Top Podcasts In Education