
31 episodes

Kathalu. Kaburlu. (Dasubhashitam) Dasubhashitam
-
- Society & Culture
దాసుభాషితం యాప్ లో విడుదల అయ్యే కొత్త పుస్తకాల వివరాలు, సంభాషణలు, మా ఆలోచనలే ఈ పాడ్‌కాస్ట్.
--
దాసుభాషితం తెలుగు వారి అభిమాన తెలుగు శ్రవణ యాప్.
దీనికి అసంఖ్యాక రేటింగ్స్ రివ్యూస్ సాక్షి.
దాసుభాషితం యాప్ లో చికాకు పెట్టే ప్రకటలను ఉండవు.
జీవితంలో శ్రేయస్సును పెంచే సాహిత్య, కళలు, ఆధ్యాత్మిక విషయాలు తప్ప.
ఇది తెలుగులో అతి పెద్ద శ్రవణ పుస్తకాల యాప్ కూడా.
దాసుభాషితం యాప్ ను ఇపుడే ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.
Apple App Store
https://apps.apple.com/us/app/dasubhashitam-telugu-audiobook/id1319854474
Google Play Store
https://play.google.com/store/apps/details?id=com.dasubhashitam&pli=1
-
31. Ennalo Vechina Udayam
Kathalu. Kaburlu. S02 Chapter 31.
నేను మే 2021లో దాసుభాషితం టీంలో చేరాను. మొదటి మీటింగ్ లో టీం పరిచయం జరిగింది. రెండో మీటింగ్ లో కిరణ్ గారు చాలా excited గా ఒక presentation ఇచ్చారు నాకు. తాను కలలు కంటున్న smooth experienced app demonstration అది. ఆ యాప్ layout పూర్తిచేసుకుని, developers దగ్గర ఉందని, అందులో content కి సంబంధించిన కొత్త tabs రూపొందించమని నాకు చెప్పారు.
యాప్ విడుదల పనులు ఆలస్యమయ్యే కొద్దీ మా టీంలో ఉత్సాహం తగ్గకుండా కిరణ్ గారు ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. కొన్నాళ్ళకి ఆయనకే సహనం తగ్గే స్థితి ఏర్పడింది. కానీ ఆ స్థితిని కూడా అధిగమించారు. కలలో కూడా ఊహించడానికి ఇష్టపడని ఒక సంఘటన అప్పుడే జరిగింది.
కొత్త యాప్ విడుదల మాట దేవుడెరుగు, ఉన్న యాప్ లో security ని develepors team గాలికి వదిలేయడం వలన, యాప్ hack అయింది. దాదాపు 3 నెలలు గాఢాంధకారం. కొత్త విడుదలలు లేవు, కొత్త పుస్తకాల గురించి రచయితలతో మాటలు లేవు, వారం వారం రాసే న్యూస్ లెటర్ లేదు, నెల తిరిగే సరికల్లా బిళ్ళబెత్తుల్లా జీతం రాళ్ళు మాత్రం బ్యాంక్ లో హాజరు.
నిజానికి చాలా సిగ్గుగా అనిపించేది ఆ డబ్బులు ముట్టుకోవాలంటే. ఏం పని చేస్తున్నాం కనక జీతం తీసుకోవడం అనిపించేది. అయ్యో ఎన్నో లక్ష్యాలతో మొదలుపెట్టిన ఉద్యోగం ఇక ఇంతేనా అనే నైరాశ్యం. అప్పుడే లాక్ డౌన్ నుంచి బయటకు వచ్చి, యాప్ లాక్ డౌన్ లో ఇరుక్కున feeling.
అలాంటి సమయంలో కిరణ్ గారి నుండి ఫోన్. 'మీనా, విడుదలలు లేకపోతే మాత్రం ఏమిటి? ఏదో ఒక న్యూస్ లెటర్ రాయి, నీకు ఇష్టం వచ్చిన విషయంపై రాయి. నీ writing skills ని improve చేసుకో. ఎలాగూ ప్రతీవారం audio content ఇవ్వలేకపోతున్నాం కదా శ్రోతలకి, ఒక మంచి సాహిత్య వ్యాసం ఇద్దాం' అన్నారు. మరలా ఒక ఉత్సాహం. నాకిష్టమైన విషయంపై వారానికో వ్యాసం.
ఈలోపు మన యాప్ సంగతి మీ అందరితోనూ పంచుకున్నారు కిరణ్ గారు. ఆ సమయంలో మీ అందరి నుండి వచ్చిన స్పందన అనూహ్యం. మీ వెంట మేము ఉంటాం. మీపై మాకు నమ -
30. Kaalame Chalanamu. Chalaname Chitramu.
Kathalu. Kaburlu. S02 Chapter 30.
ఇంగ్లీషు కామెడీ సిట్కాం అయిన The Big Bang Theory లో ఒక పాట ఉంటుంది. ఆ పాటలో ప్రతి చరణం విశ్వం పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్పి It all started with the big bang అని ముగుస్తుంది. ఆ పాట సారాంశం ఇలా ఉంటుంది:
గణితమూ, సైన్సూ, చరిత్ర అన్నీ కలిసి ఎన్నో మిస్టరీలను ఛేదించడం మొదలు పెట్టాయంటే అసలు అదంతా మొదలయ్యింది ఈ మహా విస్ఫోటనం వలనే. మతాల నుంచి ఖగోళ శాస్త్రం వరకు, ఐన్స్టైన్ నుంచి జ్యోతిష్య శాస్త్రం వరకూ, పిరమిడ్స్ ని నిర్మించడం నుంచి చైనా గోడని కట్టడం వరకూ వచ్చినవన్ని జరిగినవన్నీ సృష్టికి ముందు జరిగిన ఆ మహా విస్ఫోటనం వలనే. అసలు చరిత్రలో మొదలయిన ప్రతీ విషయానికి కారణం సృష్టికి ముందు జరిగిన ఆ మహా విస్ఫోటనమే.
ఇలా విశ్వంలో జరిగిన ప్రతి వి’చిత్రానికి కారణం మహావిస్పోటనమే అని విచిత్రంగా తేల్చి చెప్పేస్తుంది ఆ పాట.
ఇలా ప్రపంచ చరిత్ర అంతా రూపు దిద్దుకోడానికి ఎప్పుడో జరిగిన మహావిస్పోటనం కారణం అయినట్లు, తెలుగు సినిమా చరిత్ర అంతా రూపు దిద్దుకోడానికి ఏవేవి కారణం అయ్యాయో ఈ నెల జరిగిన తెలుగోళ్ళు. సినిమాలు. ఒక చరిత్ర. ప్రసంగం చూస్తే ఎన్నో ఆశ్చర్యకరమైన కారణాలు తెలుస్తాయి.
ఈ నెల ప్రసంగంలో నాకు బాగా నచ్చిన పాయింట్లు.
• రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం గురించి వినడమే గాని, ఆయన గురించి అసలు తెలియని నాకు ఆయన చేసిన కృషి ఏంటో ఈ ప్రసంగం ద్వారా తెలిసింది. 1920లో ఊరూర తిరిగి సినిమాలు ప్రదర్శించడమే కాక, ఆ సినిమాల కోసం పెట్టిన ఖర్చు, సినిమాల్లో మంచి భవిష్యత్ ఉందని ఊహించి కుమారుడు RS. ప్రకాష్ ను యూరప్ దేశాలు పంపి మరి సినిమా గురించి నేర్చుకు రమ్మనడం.
• 1929లో ఎక్కడో స్టాక్ మార్కెట్ కూలిపోయి అక్కినేనీ నాగేశ్వర రావుని సినిమాల్లోకి పంపడం.
• నా చిన్నప్పుడు 8వ తరగతి జీవశాస్త్రం పాఠ్యాంశంలోని హరిత విప్లవం, కొందరు వ్యక్తులను సినిమాల్ల -
29. Telugu Velugulu.
Kathalu. Kaburlu. S02 Chapter 29.
అడిగెదనని కడువడిఁ జను.
అడిగినదన మగుడ నుడువడని నడయుడుగున్,
వెడవెడ జిడిముడిఁ దడబడ,
నడుగిడు.నడుగిడదు. జడిమ నడుగిడు నెడలన్.
చదవడానికి బాగా ఇబ్బందిగా ఉంది కదా!
మన తాతల, తండ్రుల కాలంలో ఇలాంటి పద్యాలని పాఠ్యపుస్తకంలో లెసన్స్ గా పెట్టి చదివించేవారు. దాని వల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాక , నోరు బాగా తిరిగేది. అందుకే వాళ్ళు భారత, భాగవత మూలాలని పద్య రూపంలో చదవగలిగేవారు. ఇప్పుడు చాలా స్కూల్స్ లో తెలుగు మాధ్యమంలో చెప్పడం మానేశారు. తెలుగు అనే ఒక సబ్జెక్ట్ ఉందని రాను రానూ చాలా మందికి తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో!
మన భావాల్ని ఎంతో అందమైన పదాలతో, సొంపుగా మంచి సొబగులతో చెప్పాలంటే అది మాతృభాషలోనే సాధ్యం. పైన చెప్పిన పద్యం పోతన భాగవతంలోని "గజేంద్రమోక్షం" లోనిది.
ఈ పద్యం మొత్తంలో డ, న,గ ఈ అక్షరాలే ఎక్కువగా వాడినా, వాటి మధ్య ఉన్న పద విరుపు వల్ల దాని అర్ధంలో ఎంతో మార్పు వస్తుంది. బహుశా ఈ అందం తెలుగుకే సొంతం అనుకుంట. అంతటి అందమైన ఘనమైన తెలుగు గురించి ఈనాటి కథలు కబుర్లలో విందామా!
---
మరిన్ని కథలు కబుర్లు వినడానికి ఈ లింకు నొక్కి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/dasubhashitam-2/message -
28. Pitta Kathalu. Pedda Kaburlu.
Kathalu. Kaburlu. S02 Chapter 28.
ఒక రెండో మూడో పాత్రలు తీసుకుని వాటి మధ్య ఒక కథ గాని, నవరసాలు పలికేట్టు ఒక నవల గానీ రాయాలంటే ఎంతో తీరిక కావాలి. రచయితకు తనలోని కలిగే అందమైన భావాలను కలంతో కాగితం పై పెట్టే వాతావరణం కూడా కావాలి. మరి 300 పేజీలకు సరపడే విషయాన్ని 3 లేక 4 వాక్యాలలో రాయాలంటే, ఇంకా ఎంతో కష్ట పడాలి. ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నా సామాన్యుడికి తెలియజేసేది పత్రిక. ఈ పత్రికలో, ఎందరో ప్రముఖుల జీవితాలలో మనకు తెలియని సంగతులను కాలమ్స్ గా రాసిన రచయిత శ్రీరమణ గారు. వారు రాసిన కొన్ని కాలమ్స్ ఈ "మొగలిరేకులు"లో వినండి.
---
మరిన్ని కథలు కబుర్లు వినడానికి ఈ లింకు నొక్కి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/dasubhashitam-2/message -
27. Mahonnatha Moorthimatvam, Adhbuta Kaarya Deeksha
Kathalu. Kaburlu. S02 Chapter 27.
ఈ ఆగస్టు నెల మొదటి శనివారం రోజున PVRK ప్రసాద్ గారు రాసిన నాహం కర్తా, హరిః కర్తా పుస్తకం పై ప్రత్యేక చర్చా కార్యక్రమం జరిగింది. PVRK మహోన్నత వ్యక్తిత్వం గురించి, ఆయన కార్య దీక్ష గురించి ఆయనతో పరిచయం ఉన్న ఎందరో ప్రముఖులు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొని వారి వారి అనుభవాలు, జ్ఞాపకాలు పంచుకున్నారు. ఆ మహోన్నత వ్యక్తి గురించి, ఆ కార్యక్రమం గురించి ఈ వారం కథలు కబుర్లలో వినండి.
---
పూర్తి ప్రసంగం లింకు : https://youtu.be/Y8xWZImdOL4
---
మరిన్ని కథలు కబుర్లు వినడానికి ఈ లింకు నొక్కి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/dasubhashitam-2/message -
26. Naham Kartha Harihi Kartha
Kathalu. Kaburlu. S02 Chapter 26.
జరగకముందు నాకు చాలా టెన్షన్, జరిగాకా బొలెడంత తృప్తి-ధైర్యం ఇచ్చిన కార్యక్రమం ఈ నెల ప్రసంగాలు కార్యక్రమం. నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన ఈ పుస్తకాన్ని celebrate చేయడం, ఎందరో ప్రముఖులు, మొట్టమొదటిసారి క్విజ్ ఇలా ఒక్కో అంశం నాలో కంగారు పెంచుతూ పోయాయి. చిన్నప్పటి నుండి మా నాన్నగారు సభలు, కార్యక్రమాలు నిర్వహించడం చూస్తు పెరిగిన నాకు, ఆయనలా మాట్లాడగలగాలి అనేది ఒక bench mark.
ఆయన అంతగా కాకపోయినా, ఫరవాలేదు వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది అని అనిపించుకోవాలని ఆశ. ఏదైనా కార్యక్రమం నిర్వహించే ముందు ఒక్కటే అనిపిస్తుంటుంది, మా నాన్నగారు నిర్వహించిన సభలు చూసినవారు, ఈ కార్యక్రమానికి వచ్చి 'పండిత పుత్రః పరమ శుంఠః' అనుకోకపోతే చాలు. ఈ కార్యక్రమం చూసి, మా నాన్నగారే స్వయంగా ఫోన్ చేసి 'బాగా చేశావు చిన్నీ' అనిపించుకోగలిగాను. హమ్మయ్య అనిపించింది. ఈ కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి journey అంతా ఈ వారం కథలు కబుర్లలో వినండి.
----
మరిన్ని కథలు కబుర్లు వినడానికి ఈ లింకు నొక్కి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/dasubhashitam-2/message