34 episodes

ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఉంటుంది. మీ సలహాలు, తెలుగులొ మీరు వినాలి అనుకునె విషయాలు గురించిన వివరాలు మాకు తెలపాలి అనుకుంటె, hello@sunoindia.in (mailto:hello@sunoindia.in) కి email పెట్టండి.

(Samacharam Sameeksha will bring to you news and views of all the latest developments from Telangana and Andhra Pradesh. The podcast will also analyse news coverage and bring in seldom heard perspectives and will help you cut through the noise. Priority will be given to issues from the two Telugu states. Write into us at hello@sunoindia.in with your suggestions and feedback.)

సమాచారం సమీక్ష - A Telugu News Podcast Suno India

  • News
  • 4.8 • 8 Ratings

ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఉంటుంది. మీ సలహాలు, తెలుగులొ మీరు వినాలి అనుకునె విషయాలు గురించిన వివరాలు మాకు తెలపాలి అనుకుంటె, hello@sunoindia.in (mailto:hello@sunoindia.in) కి email పెట్టండి.

(Samacharam Sameeksha will bring to you news and views of all the latest developments from Telangana and Andhra Pradesh. The podcast will also analyse news coverage and bring in seldom heard perspectives and will help you cut through the noise. Priority will be given to issues from the two Telugu states. Write into us at hello@sunoindia.in with your suggestions and feedback.)

  చేనేత కు కావాలి చేయూత (Handlooms need help)

  చేనేత కు కావాలి చేయూత (Handlooms need help)

  కేవలం చేనేత వారోత్సవాలు మాత్రమే కాదు నిరంతరం  ప్రజలు వినియోగదారులు, సంస్థలు ప్రభుత్వాల నుండి కావాలి ఒక భరోసా. ఉత్పత్తులకు కావాలి సరైన ఆదరణ మార్కెటింగ్.ప్రతి ఊరు పట్టణం లో ఉండాలి చేనేత అమ్మకాలు.  తెలంగాణ రాష్ట్ర చేనేత ఉత్పత్తులుకు దేశవిదేశాల్లో పేరున్నది. పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, గొల్లభామ పట్టు నూలు చీరలు , వరంగల్ దర్రీలు , తువ్వాళ్ళు దుప్పట్ట్లు డ్రెస్సస్ ఒకటేంటి లిస్ట్ పెద్దది. చేనేత రంగం లో నేత కార్మికులు ఇతర అనుబంధ కార్మికులు 40533 కంటే ఎక్కువగా ఉన్నారు.పవర్ లూమ్స్ లో 36000 కార్మికులు ఉన్నారని ఒక అంచనా.615 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి.
  నేత కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ చేనేత రంగం లో తయారీదారులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు , వారి సూచనలు ,వారు ప్రభుత్వం ,వినియోగదారుల నుండి ఆశిస్తున్న చేయూత ఏమిటి? ఇతర సాధకబాధకాలు ముఖ్యం గా వరల్డ్ ఫేమస్ వరంగల్ దర్రీ ల తయారీదారులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు వరంగల్ చేనేత కార్మికుల గౌరవాధ్యక్షులు చిప్ప వెంకటేశ్వర్లు గారి ఇంటర్వ్యూ లో విందాము.

  (Handlooms need our support not just during handloom festivals but on a regular basis. They need proper rate and market. Every village and town should have markets to sell handloom. Telangana handlooms are well known in India and abroad. Pochampalli, Gadwal, Narayanapet, Golabama silk sarees, Warangal rugs, carpets, towels, bedsheets, dresses etc are well known. There are more than 40533 workers working in handlooms in telangana and around 36000 in power looms. And there are around 615 cooperatives.

  There are many schemes by state and central governments for handloom workers even then the handloom workers are facing many problems. In this episode, we listen to what they expect from the government? what do they expect from consumers? And other issues mainly by manufacturers of world-famous Warangal rugs. Host, D Chamundeswari talks about this and more with Warangal Handloom workers association president Mr. Chippa Venkateswarulu.)

  You can contact them on +91-9908244777/ 9849221300  See sunoindia.in/privacy-policy for privacy information.

  • 29 min
  మారిటల్ రేప్ - మహిళల రాజ్యాంగ, మానవ హక్కులు. (Marital Rape)

  మారిటల్ రేప్ - మహిళల రాజ్యాంగ, మానవ హక్కులు. (Marital Rape)

  ఎన్నో ఊహలు ఆశలతో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన మహిళలకు కాలక్రమం లో ఎదురయ్యే ఇబ్బందుల పట్ల సరైన అవగాహన తక్కువే.ముఖ్యం గా భార్యాభర్తల దాంపత్యం గురించి.అన్నింటా సర్దుకుపోవటమే పరమావధి అనే సలహాలే ఎక్కువ.ఒకవేళ గృహహింస ముఖ్యం గా మారిటల్ రేప్ కి
  గురైతే ఏలా? ఎవర్ని సాయం అడగాలి?ఎక్కడ.ఎలా రిపోర్ట్ చెయ్యాలి? రేప్ కి మారిటల్ రేప్ కి లీగల్ పరిభాషలో ఉన్న తేడా ఏంటి?  మహిళల రక్షణకు ఉన్న చట్టాల అమలు ఎంతవరకు జరుగుతోంది.   

  గత కొద్ది రోజుల కిందట మారిటల్ రేప్ కేసు లో కేరళ హై కోర్ట్ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు  గురించి మారిటల్ రేప్ ,చట్టాల గురించి వివరంగా  సమాచారం సమీక్ష   లో  D.చాముండేశ్వరి తో  legal expert Mrs.Unnava Rajeswari గారి ఇంటర్వ్యూ లో తెలుసుకుందాము.

  (Many women who get married with hopes and aspirations know little about the problems that they may foresee, mainly about the relationship between a husband and a wife. Many will advise the women to adjust without realising the gravity.  What if the woman is subjected to domestic harassment and marital rape? Who should she ask for help? What is the difference between rape and marital rape in the eyes of law? Are the laws that are supposed to be helping women implemented?  

  In this episode of Samacharam Sameeksha, host D Chamundeswari spoke with legal expert Mrs. Unnava Rajeswari to discuss a judgement delivered by  Kerala high court on Marital rape as grounds for divorce.)  See sunoindia.in/privacy-policy for privacy information.

  • 34 min
  6దశాబ్దాల పాటు ఆదరణ గుర్తింపు కు నోచుకోని తెలంగాణ ఘన చరిత్ర గురించి తెలుసా? (Do you know about the heritage of Telangana that h

  6దశాబ్దాల పాటు ఆదరణ గుర్తింపు కు నోచుకోని తెలంగాణ ఘన చరిత్ర గురించి తెలుసా? (Do you know about the heritage of Telangana that h

  గత కొద్ది దశాబ్దాలుగా డిగ్రీలు అంటే engineering medicine లాంటివి మాత్రమే అందరి దృష్టి లో. పదవ తరగతి వరకు మొక్కుబడిగా చదివే చరిత్ర ను మరింతగా అధ్యయనం చేయాలనే కోరిక కలగటం అంటే ప్రస్తుత రోజుల్లో అదొక వింత.విదేశాల్లో బహుశా మామూలు విషయం కావచ్చు.వారికి  చారిత్రిక కట్టడాల పరిరక్షణ పట్ల ఉన్న శ్రద్ధ వల్ల.

  అలాంటి  పురాతత్వ శాస్త్రం చదువుతూ పిన్నవయస్సులో తెలంగాణ చరిత్ర నీ తెలిపే శిథిలాలు శాసనాలను వెతికి వెలుగులోకి తీసుకు వస్తున్న యువ  ఔత్సాహిక చరిత్ర పరిశోధకులు అరవింద్ ఆర్య   d.చాముండేశ్వరి గారి తో  చరిత్ర పట్ల తనకి ఉన్న ఆసక్తి పరిశోధన గురించి వివరించిన interview. 

  (For the past few decades, a degree meant engineering or medicine. History is only taught till the tenth standard and wanting to pursue history is left to one's imagination. It is more common in foreign countries where there is more interest in conserving heritage. 

  In times like this, Arvind Arya took up studying about Archeology and Telangana Heritage after his engineering out of interest. In this episode, he talks to host D. Chamundeswari about how he developed an interest and why it is important to protect Telangana heritage.)   See sunoindia.in/privacy-policy for privacy information.

  • 27 min
  కనీస మానవ, ప్రాథమిక హక్కులు కూడ లేని waste pickers

  కనీస మానవ, ప్రాథమిక హక్కులు కూడ లేని waste pickers

  పరిసరాలలో పేరుకుపోయే అనేక రకాల వ్యర్ధాలను వేరుచేసి రీసైకిల్ చెయ్యటంలో చెత్త నుండి ఆదాయాన్ని క్రియేట్ చెయ్యటం లో ,waste management లో pioner అనదగిన waste picker గురించి మనకి తెలిసింది ఎంత?దేశం లో ఒక అంచనా ప్రకారం వీరు 1.5 నుండి 4 మిలియన్ల సంఖ్యలో ఉంటారు.దేశ ఆర్థిక కార్యకలాపాల్లో వీరి వాటా 3200కోట్లని అంచనా.urban waste management లో 20%వీరి ద్వారా రీసైకిల్అ వుతుంది అని మరో అంచనా. సమాజానికి హెల్ప్ చేస్తున్న వీరికి ప్రజలు ప్రభుత్వాలు నుండి అందే సహకారం ఎంత?సమస్యలు ఏంటి? Dalit Bahujan Resource Centre (DBRC) India ఇండియా సంస్థ కు చెందిన అనిల్ కుమార్ మరియు waste picker హరి కృష్ణ గారు, D. చాముండేశ్వరి తో వివరంగా ముచ్చటించారు. 

  (How much do we know about the waste pickers who help in recycling and are pioneers of waste management? According to an estimate, there are 1.5 to 4 million waste pickers in India. Their contribution to the economy is expected to be around 3200 crores. They recycle approximately 20% of urban waste. What are the benefits that the government is providing to these waste pickers who are helping society? To know more about this, host, D Chamundeswari talks to Samuel Anil Kumar of Dalit Bahujan Resource Centre (DBRC) India in this episode.)  See sunoindia.in/privacy-policy for privacy information.

  • 29 min
  కరోనా లో మానసిక కల్లోలం (Mental Health during COVID)

  కరోనా లో మానసిక కల్లోలం (Mental Health during COVID)

  శరీరం చెప్పే లక్షణాలు ,హెచ్చరికలు వింటాము.వైద్యం తో ఆరోగ్యం కాపాడుకొంటాం, మరి మనస్సుకు కుంగుబాటు ఆందోళన ఒత్తిడి కలిగితే వచ్చే సూచనలు లక్షణాలు ఏమిటో సరిగ్గా తెలియదు. ఒకవేళ ఎవరైనా depressed గా ఉందంటే సరైన సలహా కంటే నీకేం సమస్య?అంతా బావుంటే .అంటూ మనసు చెప్పే మాట వినరు.విననివ్వరు.


  దానికి తోడు గత ఏడాదిన్నర గా వేధిస్తున్న కరోనా. Lockdowns,social distancing,work from home గందరగోళం మధ్య ఆందోళన అయోమయం తో మానసికం గా బెదిరిపోయిన ప్రజలు. మానసిక సమస్యలు mental health. అంటే నే చిన్న చూపు చూసే సొసైటీ లో మనసు గతి ఇంతే.మనిషి బ్రతుకింతే.అని కుంగిపోవాలా?
  మేమున్నము మీ మనోవేదన విని సహాయపడటానికి అంటూ భరోసా ఇస్తున్నారు తెలంగాణ సైకాలజిస్టులు. 30 మంది సభ్యులు ఫోన్ ద్వారా టెలి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.Dr. లక్ష్మి నిప్పాని గారు D.Chamundeswari తో మానసిక ఆరోగ్య సమస్యల గురించి వివరించారు.
   

  మీరు సైకాలజిస్టులు సలహాలు సూచనలు పొందాలంటే క్రింద ఇచ్చిన ఫోన్ no లో contact చెయ్యవచ్చు.

  లక్ష్మి నిప్పాని (Laxmi nippani) -9440684805
  హిమ బిందు (Himabindu) - 8919508522
  M. కృష్ణ సాహితీ (Krishna Saahiti) - 7993715081  See sunoindia.in/privacy-policy for privacy information.

  • 33 min
  కరోనా కష్ట కాలం లో స్కూల్స్ నడిపేది ఎలా? విద్య ఎలా? (How can a school run during COVID times?)

  కరోనా కష్ట కాలం లో స్కూల్స్ నడిపేది ఎలా? విద్య ఎలా? (How can a school run during COVID times?)

  బడి గంటలు విని ఎంత కాలం అయ్యింది ? School కి ఆలస్యం అవుతోందని ఆటో వచ్చింది పద పద మనే మాటలు గతం.మళ్ళీ ఆ రోజులు వస్తాయా? పిల్లల భవిత ఏమిటి?

  Covid దెబ్బకు మూతపడిన వాటిలో విద్యారంగం ఒకటి.లక్షల మంది విద్యార్థులు, టీచర్స్,ఇతర staff ఉన్న వ్యవస్థలో పేద ,దిగువ మధ్య తరగతి విద్యార్థుల కోసం స్కూల్స్ నడుపుతూ , స్టాఫ్ అందరినీ సమన్వయం చేస్తూ మంచి చదువును అందించే ప్రయత్నం నిరంతరం చేస్తున్న చిన్న స్కూల్ యాజమాన్యాల పరిస్థితి ఇబ్బందులు గురించి,ఆశిస్తున్న వెసులు బాటు గురించి  చాముండేశ్వరి తో గోపి మెమోరియల్ స్కూల్ యాజమాన్య ప్రతినిధి శ్రీ .శ్రీనివాస్ రెడ్డి గారు వివరించారు.

  (Schools are one sector that has been shut down because of COVID. Running schools and paying teachers and staff with schools shut and without support from the government is a challenge for small schools which cater mainly to the lower middle class and poor. In this episode host, Chamundeswari talks to Mr. Srinivas Reddy, Principal of Gopi memorial school in Hyderabad.)  See sunoindia.in/privacy-policy for privacy information.

  • 26 min

Customer Reviews

4.8 out of 5
8 Ratings

8 Ratings

Top Podcasts In News