26 min

part I - ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచ‪న‬ Harshaneeyam

    • Books

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘గాలివాన ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది . న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన కథల పోటీలో రెండవ బహుమతి పొందింది.
పుస్తకం కొనడానికి కావాల్సిన web link
Palagummi Padmaraju Rachanalu -Vol1
కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు.
ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు.
హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)
ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)
గాలివాన’
మబ్బు మసగ్గా అలుముకుపోయింది. రైలు చాలా ఆలస్యంగా వచ్చింది. రావుగారు రెండో తరగతి పెట్టె ఎక్కుతుంటే, ఆయనకు తన యిల్లు, ఆ యింట్లో అలవాటుపడ్డ సుఖాలు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. 
ఆయన చదువుకునే గది అతి శుభ్రంగా తుడిచివుంది. అందులో నల్ల విరుగుడు చేవతో చేసిన రాతిబల్ల, దానిమీద ఒక మూలగా, ఒక ఆకుపచ్చ గొట్టంలో దీపం వెలుగుతూ వుంటుంది. ఆయన కుర్చీ మెత్తలో కూర్చునే చోట అనుకూలమయిన పల్లాలు ఏర్పడ్డాయి. సోఫాలో వున్నట్టు కూడా తెలియకుండా ఆయన భార్య కూర్చుని ఉంటుంది. ఆయనకు నలుగురు పిల్లలు. ఇద్దరు ఆడ, యిద్దరు మగ.వాళ్ళని చూస్తే ఆయనకు ఎంతో గర్వం.
రైలు పెట్టెలో మూడుమెత్తలూ ఎవరో ఆక్రమించుకుని పరుపులు పరుచుకున్నారు. తను ఎక్కినందుకు అందులో వున్న నలుగురు ప్రయాణికులు చిరాకు పడుతున్నట్లు, రావుగారు వాళ్ల ముఖాలు చూడకుండానే గ్రహించారు. ఇంకో పెట్టెలోకి వెడితే బాగుంటుందని ఆయనకు అనిపించింది. కాని కూలివాడు ఆయన బెడ్డింగూ, పెట్టె, గొడుగు పైబల్లమీద పెట్టి వెళ్ళిపోయాడు. రైలు కదిలిపోయింది. ఒక పెద్దమనిషి పరుపు కొంచెం మడిచి రావుగారికి చోటు చేశ