4 episodes

జీవని...
కొంచెం సరదా...కొంచెం బాధ...ఇంకొంచెం జ్ఞాపకాలు

‘మధు’వని..‪.‬ madhu sudhan

    • Arts

జీవని...
కొంచెం సరదా...కొంచెం బాధ...ఇంకొంచెం జ్ఞాపకాలు

    ఖాళీ చేసి పోదామా...

    ఖాళీ చేసి పోదామా...

    ఆలోచనల్ని అనవసరంగా నిల్వ ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగముండదు. మనలో జనరేట్ అయిన ఏ చిన్ని మంచి ఆలోచననైనా సరే ...వ్యక్తం చేస్తేనే ఉపయోగం. మనం కనుమూసేలోగా గుండెలో పేరుకుపోయిన ఆలోచనలపై వెలుగు పరచాలి. అవి నలుగురికీ పంచాలి. అపుడే సార్థకత. అంతిమయాత్రలో మీ ఆలోచనల బ్యాగేజీ తీసుకెళ్ళకండి. బతికున్నప్పుడే అంతా ఖాళీ చేసి వెళ్ళండి . అలా చేయగలిగితే ఇక తీరని కోరికలు, చెప్పలేని ఆలోచనలు ఉండవు. అపుడు వాటికోసం మళ్ళీ ఈ లోకానికి రావాల్సిన అవసరం ఉండదు. భాగవతంలో కృష్ణుడు గోపికలతో అన్నదీ ఇదే. వెదురు తనలోని గుజ్జునంతా ఖాళీ చేసుకుని వేణువు అయ్యింది. అందుకే నా చెంతకు చేరింది అని. మనమూ అంతే... ఏ చిన్న ఆలోచననైనా సరే  దాచుకోవద్దు.  మన ఆలోచనలు నిర్ణయాలు మనకు చిన్నవనిపించవచ్చు. కానీ అవి ఎన్ని జీవితాలకు వెలుగు దారులవుతాయో ఎవరికి తెలుసు? 

    • 9 min
    ఇగోలు...ఇటుక గోడలు

    ఇగోలు...ఇటుక గోడలు

    ఎవరైనా అంటే ఎందుకు పడాలి? నాకంటూ ఆత్మాభిమానం ఉండదా? అనసవరంగా ఎవరన్నా నే పడనంతే. నేనింతే...మనకు తరచూ వినిపిపించే మాటలివి. మెచ్యూరిటీ వచ్చిందన్న పెద్దలు మొదలు... అమాయకత్వం వీడని చిన్నవాళ్ళ దాకా అందరికీ అత్యవసర పదార్థం ఆత్మాభిమానం...దాన్నే ముద్దుగా ఇగో అంటుంటాం. ఈ ఇగో ఉందే...పప్పులో ఉప్పులాంటిది. ఉప్పు తక్కువయితే ముద్ద దిగదు...ఎక్కువయినా ముద్ద దిగదు. ఇగో కూడా అంతే. తక్కువయితే జనాభా లెక్కలోంచి తీసేస్తారు. ఎక్కువయితే అహంకారి...ఇగోయిష్ట అని ముద్ర వేసేస్తారు. వాడికి మహా ఇగోలే...మనిషన్నాక కాసింతయినా ఇగో ఉండాలి కదా...ఇలా అయిన దానికీ కాని దానికీ  అవసరం లేకున్నా  ఇష్టా రాజ్యంగా ఇగోలను పెంచేసుకు పోతే అవి కాస్త ఇటుకగోడలుగా మారిపోతాయి. అప్పుడు మనకు బైటవారెవరూ కనిపించరు...వినిపించరు. వారికీ మనమంతే. మనసు ఒంటరిగా మారిపోతుంది...ఒంటిగానే మిగిలిపోతుంది... 

    • 13 min
    కన్నీటికీ మాటలుంటాయ్....

    కన్నీటికీ మాటలుంటాయ్....

    కన్నీటికీ  మాటలుంటాయ్....

    నవ్వు గురించి అందరం మాట్లాడుకుంటాం. కానీ ఏడ్పు గురించి మాట్లాడుకోం. హాయిగా నవ్వుకోడానికి చిట్కాలున్నాయి గానీ ఏడ్ఛేందుకు చిట్కాలేముంటాయి? కానీ నవ్వు ఎంత ముఖ్యమో...ఏడ్పు కూడా అంతే ముఖ్యం. గుండె బరువెక్కితే అప్రయత్నంగా కంట్లో తడి కనిపిస్తుంది. అది సహజం. కానీ దాన్ని దాచుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తుంటాం. 

    కొన్ని సార్లు కళ్ళే కాదు మనసూ కన్నీరు కారుస్తుంది. కంటిలో ఉబికే నీరు అందరికి కనిపిస్తుంది. కానీ మనసు కార్చే   కన్నీరు ఎవరికి కనిపిస్తుంది? నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. ఏ కన్నీటి ఎనకాల ఏముందో తెలుసుకో అన్నాడు ఆత్రేయ. ఆయనే మరో పాటలో కళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు...రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు? అంటూ ప్రశ్నిస్తాడు. నిజమే బాగా ఆలోచిస్తే ఎదుటి వారి కంటనీరుకు కారణాలు అంత సులువుగా అర్థం కాదు... 

    • 8 min
    ఆనందం చిరునామ

    ఆనందం చిరునామ

    ఆనందం ఎక్కడుంటుంది? అసలు అది ఎలా ఉంటుంది? రంగు రుచి వాసన  చెప్పండి ప్లీజ్‌...అంటే ఏమని చెబుతాం? పోనీ ఆది మనిషిని బట్టి ఉంటుందా...మనసును బట్టి ఉంటుందా అనడిగితే అదీ చెప్పలేం. కొందరికి ఒంటరితనంలోనే ...అంతర్ముఖంలోనే ఆనందం. తనలో తనను అన్వేషించుకుంటూ...నిశ్శబ్దాన్ని నేస్తంగా మలచుకుంటూ ...సాగిపోవడంలో ఆనందం ఉంటుంది. మరి కొందరికి...సెలయేరులా గలగలమంటూ శబ్దించడంలోనే ఆనందం...సమూహాలను వ్యామోహాలుగా అల్లుకుపోవడంలో అనందం...అడవిలో వదిలేసినా మొండిగా నిలుచున్న మానును సైతం మాటల్లో పడేసి మైమరచి పొంగిపోవడంలో ఆనందం. కొందరికి ఘనీభవించిన చీకటి పరదాల్లో చిక్కుకున్న అవ్యక్త భావాలను ఆవాహన చేసుకోవడమే ఆనందం.....

    • 4 min

Top Podcasts In Arts

Roundfinger Channel
Roundfinger Channel
Readery
Readery
Good Night #ฟังก่อนนอน
Mission To The Moon Media
อ่านแล้วอ่านเล่า
Ta Thananon Domthong
Myths and Legends
Jason Weiser, Carissa Weiser, Nextpod
Mission To The Moon #สรุปหนังสือ
Mission To The Moon Media