సమాచారం సమీక్ష - A Telugu News Podcast

సమాచారం సమీక్ష - A Telugu News Podcast

ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఉంటుంది. మీ సలహాలు, తెలుగులొ మీరు వినాలి అనుకునె విషయాలు గురించిన వివరాలు మాకు తెలపాలి అనుకుంటె, hello@sunoindia.in (mailto:hello@sunoindia.in) కి email పెట్టండి. (Samacharam Sameeksha will bring to you news and views of all the latest developments from Telangana and Andhra Pradesh. The podcast will also analyse news coverage and bring in seldom heard perspectives and will help you cut through the noise. Priority will be given to issues from the two Telugu states. Write into us at hello@sunoindia.in with your suggestions and feedback.)

  1. సిజేరియన్  ప్రసవాలు vs నార్మల్ ప్రసవాలు  part 1 (Caeseran delivery Vs Normal delivery part 1)

    2022. 10. 30.

    సిజేరియన్ ప్రసవాలు vs నార్మల్ ప్రసవాలు part 1 (Caeseran delivery Vs Normal delivery part 1)

    దేశం లో అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం సిజేరియన్ ప్రసవాలలో కూడా పెరుగుదల రికార్డు చేసింది . సి. సెక్షన్ డెలివెరీస్దాదాపు 60% . కొన్ని జిల్లాలో ఇంకా ఎక్కువని రిపోర్ట్స్ . నేషనల్ సగటు 22% కంటే ,WHO permisable రేట్ 10-15 % కంటే ఎక్కువే .గత కొద్దీ కాలం గ తెలంగాణ ప్రభుత్వం సిజేరియన్ ప్రసవాలు తగ్గించి ,నార్మల్ డెలివెరీస్ ను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది .ఈ పరిస్థితికి కారణాలు ఏమిటి ?  ప్రజల ఆలోచన ,వైద్య రంగం లో వచ్చిన మార్పా ?ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎక్కువ  ఫీజు వస్తుందనే  వాదన నిజమా ?నార్మల్ లేదా సిజేరియన్ ప్రసవాల్లో ఏది ? ఎప్పుడు ? ఎంతవరకు తల్లి బిడ్డకు మంచిదిసిజేరిన్ ప్రసవాల తగ్గింపులో  ప్రభుత్వం ,ఫామిలీ , డాక్టర్స్ ,ఇతర midwiffery  రోల్ఎంత వరకు ఉంది ?అవేర్నెస్ ప్రోగ్రామ్స్  ఎంతవరకు అవసరం ?ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం  సునో ఇండియా వారి సమాచారం సమీక్షలో హోస్ట్ చాముండేశ్వరి తో ప్రముఖ gynaecologist  DR .  అనురాధ.  m గారి ఇంటర్వ్యూ పార్ట్  వన్ లో వినండి. See sunoindia.in/privacy-policy for privacy information.

    40분
  2. తలసేమియా  గురించి ఎందరికి తెలుసు? (How many people know about Thalassemia?)

    2022. 10. 26.

    తలసేమియా గురించి ఎందరికి తెలుసు? (How many people know about Thalassemia?)

    రక్తం  అంటే ఎర్రని రంగని తెలుసు . రక్తం చూస్తే  ఆందోళన , భయం కలగటం natural . రక్తం లో ఉన్న  groups,  classifications గురించిన అవగాహన అందరికి లేదు . అలాంటిది జన్యు పరమైన blood related  వ్యాధుల గురించి తలసేమియా గురించి ఎందరికి తెలుసు?ప్రజలలో  అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మే 8 వ తేదీన ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. తలసేమియా అనేది జన్యు రక్త రుగ్మత, .  తలసేమియా ఉన్న పిల్లవాడు అలసట, బలహీనత, నెమ్మదిగా పెరుగుదల, పేలవమైన ఆకలి మరియు రక్తహీనత వంటి లక్షణాలను చూపుతాడు. చికిత్స రక్త మార్పిడితో ఉంటుంది, దీని వల్ల కుటుంబంపై మానసిక మరియు ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది.తలసేమియా అంటే గ్రీక్ భాషలో సముద్రం అని అర్థం. ఈ వ్యాధికి గురైన చిన్నారికి జీవితాంతం రక్తం ఎక్కిస్తూనే ఉండాలి.  తలసేమియా రోగుల్లో శరీరానికి అవసరమైనంత హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి కాదు. ఒకవేళ ఉత్పత్తయినా ఎక్కువకాలం  ఉండదు. హిమోగ్లోబిన్‌ నిల్వలు పడిపోయిన ప్రతిసారీ హిమోగ్లోబిన్‌ని కృత్రిమంగా రక్తం ద్వారా అందించాలి.నివేదికల ప్రకారం, ప్రతి సంవత్సరం సగటున 10,000 మంది పిల్లలు తలసేమియాతో జన్మిస్తున్నారు మరియు జనాభాలో 3-4% మంది క్యారియర్లు. అందువల్ల, తల్లిదండ్రుల ఇద్దరికీ సమగ్ర జన్యు పరీక్ష యొక్క అవగాహన పెంచడం చాలా అవసరం.ప్రీ-నాటల్ టెస్టింగ్ మరియు క్యారియర్ స్క్రీనింగ్ అవసరం  తలసేమియా కేసులను నివారించడానికి కీలకం పనిచేస్తుంది.రక్తం పంచుకుని పుట్టిన పిల్లలకు  తమకు తెలియని , నివారణ లేని ,లైఫ్ లాంగ్ రక్త మార్పిడి  అవసరం అయ్యే  తలసేమియా లాంటి  అనారోగ్యం వస్తే   రోగి ,కుటుంబం పరిస్థితి ఏంటి ? ఎక్కడికి వెళ్ళాలి ?  వైద్యం ఎలా ?  రోగ నిర్ధారణ ఎలా ?  ఈ ప్రశ్నలకు  సమాధానం ఇవాళ్టి  సునో ఇండియా వారి సమాచారం  సమీక్షలో   హోస్ట్  D .చాముండేశ్వరి తో  ప్రముఖ  డాక్టర్   అదితి కిశోర్  ఇంటర్వ్యూ లో  తెలుసుకుందాము . See sunoindia.in/privacy-policy for privacy information.

    43분
  3. పిల్లలపై లైంగిక దాడులు - పోక్స్కో చట్టం  (Child sexual abuse - What does POCSO act say)

    2022. 10. 21.

    పిల్లలపై లైంగిక దాడులు - పోక్స్కో చట్టం (Child sexual abuse - What does POCSO act say)

    గత కొద్దికాలంగా  దేశం లో చిన్నారుల మీద లైంగిక అకృత్యాలు పెరిగిపోతున్నాయి . గర్ల్ లేదా బాయ్ సేఫ్ గ ఉండే పరిస్థితి లేదు .ఎప్పుడు ఎక్కడ  ఎవరు ఎలా ? పిల్లల ని abuse చేస్తారో తెలియదు . సేఫ్ గ చెప్పబడే స్కూల్ ,ఇల్లు వారి పాలిట నరకం గా మారుతున్నాయా ?పిల్లల అమాయకత్వం ,వయస్సు ని ఆసరాగా తీసుకుని నమ్మించి బెదిరించి సెక్సువల్ గా అబ్యూస్ చేస్తున్న సందర్భాలు అనేకం . abuse అయినా చైల్డ్ మానసిక ,శారీరిక  conditions సంగతి ఏమిటీ ? పిల్లలకు safe, unsafe టచ్ గురించి చెప్పటం ఎవరి భాద్యత ? ఎంత ముఖ్యం ?నేరం జరిగినప్పుడు సోషల్ స్టిగ్మా అని భయపడకుండా  ఎప్పుడు ఎవరికీ ఎలా రిపోర్ట్ చెయ్యాలి?పిల్లల ప్రవర్తనలో కనపడే  మార్పులు ఎలా తెలుసుకోవాలి ?POCSO చట్టం అమలు ఎలా జరుగుతోంది ?పిల్లలు మానసికంగ కుంగిపోయినప్పుడు  ఎవరు ఎలా కౌన్సిల్ చేస్తారు ?ఈ ప్రశ్నలకు  సమాధానం ఇవాళ్టి సునో ఇండియా వారి సమాచారం - సమీక్ష లో హోస్ట్ చాముండేశ్వరి తో   ప్రముఖ న్యాయవాది , అనేక POCSO కేసుల్లో లీగల్ ఎక్స్పర్ట్ అయిన స్పందన సదాశివుని  ఇంటర్వ్యూ లో వినండి . See sunoindia.in/privacy-policy for privacy information.

    1시간 2분
  4. ధాన్య సేకరణలో  ప్రైవేట్ కి అవకాశం . ఎవరి మేలు కోసం ? (Private players in grains procurement)

    2022. 09. 29.

    ధాన్య సేకరణలో ప్రైవేట్ కి అవకాశం . ఎవరి మేలు కోసం ? (Private players in grains procurement)

    140 కోట్ల జనాభా అందులో దాదాపు 60%  వ్యవసాయం వ్యవసాయ ఆధారిత రంగాల్లో పనిచేస్తారని అంచనా . కంట్రీ ఎకానమీ లో అగ్రికల్చర్ వాటా 2021 లెక్కల ప్రకారం  20. 19% . కరోనా పాండమిక్లో అనేక ఉత్పత్తి రంగాలు తాత్కాలికం గా మూతపడిన , వ్యవసాయ రంగం ఆదుకుందని తెలుసు .రైతే రాజు .లక్షల్లో బ్యాంకు బాలన్స్ ఉండేలా వ్యవసాయ రంగాన్ని  నిలుపుతామన్న హామీలు. రైతుల ఆశ లు  ఆకాంక్షలకు  షాక్ తగిలేలా  వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేర్పుల మూలంగా అగ్రికల్చర్ ,రైతుల కు దిక్కుతోచని  పరిస్థితులు  ఏర్పడ్డాయన్నది ఎంత నిజం ? కారణం ఏంటి ?అగ్రికల్చర్ లో ఫైనల్ స్టేజి అయినా ధన్య సేకరణ ,మద్దతు ధర , సమయానికి పేమెంట్   ని ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా , కేంద్ర , రాష్ట్ర  ప్రభుత్వాలు  చేస్తాయి . పండించిన పంటను రైతు మార్కెటింగ్ చేసుకునే స్థోమత , వీలు ,అనుభవం ఉండకపోవచ్చు . ప్రజలు ఎన్నుకున్న ప్రభు త్వాలే  రైతుల పాలిట ఆశాకిరణం . వెల్ఫేర్ స్టేట్ భాద్యత కూడా .అలాంటిది  ప్రభుత్వమే ధాన్య సేకరణ  ఖర్చు భరించలేము . ప్రైవేట్ వాళ్ళు తక్కువ ధరకే నాణ్యమైన  ధాన్యం సేకరిస్తారు  అంటే దేశ  ఆర్ధిక పరిస్థితి  ఎలా ఉందనుకోవాలి ? రైతులకి  బేరం ఆడే శక్తి ఉంటుందా ?  కనీస మద్దతు ధర సంగతి ఏంటి ? ధాన్య సేకరణ  ప్రైవేట్ వాళ్ళు చేస్తే  గ్రైన్స్ ప్రాసెసింగ్ , స్టోరేజ్  పంపిణి  ఎవరి ఆధీనం లో ఉంటుంది ? అగ్రికల్చర్ లో .ప్రభుత్వం  భాధ్యత  ఏంటి  ? ఆహార భద్రతా  చట్టం అమలు సంగతి ఏంటి ? FCI  పాత్ర  ఏంటి ? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్   వ్యవస్థ  ఎలా మారవచ్చు ? రైతులకు , ప్రజలకు  లేదా ప్రైవేట్ కి ఎవరికీ లాభం ?ఇవాళ్టి సమాచారం సమీక్షలో    హోస్ట్  డి . చాముండేశ్వరి  తో తెలంగాణ స్టేట్ రైతు సంఘం జనరల్ సెక్రటరీ  పశ్య పద్మ  గారి ఇంటర్వ్యూ లో  వినండి . See sunoindia.in/privacy-policy for privacy information.

    48분
  5. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 (Significance of Sept 17 for telangana)

    2022. 09. 17.

    తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 (Significance of Sept 17 for telangana)

    తెలంగాణ  ప్రాంత చరిత్రలో  సెప్టెంబర్ 17 కి ఒక గుర్తింపు ,ప్రాముఖ్యత ఉందని అందరికి తెలిసిందే . రైతులు చేసిన  తెలంగాణ సాయుధ పోరాటం  అంటారు . కమ్యూనిస్టుల  ప్రాబల్యం తో 1952 వరకు జరిగిన పోరాటం అంటారు .  నిజాం పాలనను వ్యతిరేకిస్తూ చేసిన ప్రజల పోరాటం అంటారు. దేశ స్వతంత్రం కోసం పోరాడినా  నిజాం పాలన నుండి ఫ్రీడమ్  దొరకనందున జరిపిన పోరాటం అంటారు. దేశ సమైక్యత లో భాగం కావటానికి జరిపిన  పోరాటం లేదా ఆక్షన్ డే  అంటే జాతీయ. సమైక్యతా దినం  అని ఒకరు తెలంగాణ  విమోచన దినం అని అనేక విధాలుగా  పిలుస్తూ  75 సంవత్సరాల తరువాత  ఘనంగా ఉత్సవాలు నిర్వహణ ప్లాన్ చేసారు . వీరు వారు అని కాదు అన్ని రాజకీయ పార్టీలు  సెంటర్ నుండి స్టేట్ వరకు  సెలబ్రేషన్స్ ప్లాన్ చేసారు . వారి వారి పార్టీ అవసరానికి తగ్గట్టు  ఉత్సవాలు ఉంటాయి . ఎన్నడూ లేనంత  గా  ప్రజల మధ్యలోకి   డిస్కషన్ గా వచ్చింది .అంటే కాదు చాల  అయోమయాన్ని కలిగిస్తోంది . అసలు చరిత్రలో  ఆరోజు  ఏమి జరిగింది ? ఎందుకు జరిగింది ?  75 yrs తరువాత  సంఘటనను  ఎలా చూడాలి ?        ఈ ప్రశ్నలకు  సమాధానం  ఇవ్వాల్టి  సమాచారం సమీక్ష   లో  హోస్ట్   చాముండేశ్వరి తో  ప్రముఖ పాత్రికేయులు  కే . శ్రీనివాస్  గారి ఇంటర్వ్యూ లో  తెలుసుకుందాము . See sunoindia.in/privacy-policy for privacy information.

    51분
  6. తల్లి పాల బ్యాంకు (Mothers milk bank)

    2022. 08. 31.

    తల్లి పాల బ్యాంకు (Mothers milk bank)

    బిడ్డ ఆకలితో అల్లాడినా..  తల్లి మనసు అల్లాడిపోతుంది. అప్పుడే పుట్టిన పసికందులు తల్లిపాలు అందక ఆకలితో విలవిలలాడుతుంటే   మాతృహృదయం.. కుల, మత, పేద, ధనిక తేడాలకు అతీతంగా స్పందిస్తుంది. నేటి సాంకేతికత తల్లుల పిల్లల కోసం సాయపడుతోంది. పాలు మిగిలిపోయే బాలింతలు, బిడ్డలు దూరమైన తల్లులు చనుబాలను దానం చేస్తున్నారు. తల్లి  పాలు అందని పిల్లల కోసం  వేరే మహిళ Breast milk feed cheyyatam  మనకు  తెలుసు . శతాబ్దాలుగా వాడుకలో ఉన్నదే .  పుట్టగానే అనాథలుగా మారి సంరక్షణ కేంద్రంలో ఉన్న పసికందులు, వివిధ కారణాల వల్ల తల్లికి దూరంగా ఉంచే బిడ్డల ఆకలి తీర్చుతోంది ‘ధాత్రి’ మిల్క్ బ్యాంక్. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ 10 మంది వరకూ బాలింతలు చిన్నారుల ఆకలి తీర్చేందుకు ముందుకు వస్తున్నారుగతం లో వాడుకులో ఉన్నా కూడా తల్లి పాల దానం లేదా ఇతర పిల్లలకు  అదనంగా ఉన్న పాలను ఇవ్వటం  కాలక్రమేణా కనుమరుగు  అవుతూ వచ్చింది . తల్లి పాలకు ఇతర వాణిజ్య మిల్క్ substitute కాదు . ఆరోగ్యపరంగా కూడా బెస్ట్ మదర్ మిల్క్ .ఎక్కువగా మిల్క్ వచ్చే తల్లులు  తమ శిశువు తాగాక మిగిలింది ఏమిచెయ్యాలి ? ఏదైనా కారణంగా శిశువు ను కోల్పోయిన తల్లుల lactation pain ఎలా తీరుతుంది ? మిల్క్ డొనేషన్ ఎవరు ? ఎలా చెయ్యాలి ? ఎలా వాటిని స్టోర్ చేసి పంపాలి ? డోనర్ ఆరోగ్యానికి  ఇబ్బందా ?  రెసిపెంట్ అంటే ఆ పాలు తాగే బేబీ కి ఆరోగ్యం సరిగ్గా ఉంటుందా ?  ఎవర్ని సలహా అడగాలి ? డబ్బా పాలు సరిపడవా ?తల్లి పాలే ఎందుకు ఇవ్వాలి ? అందుకు డబ్బు ఇవ్వాళా ? అనేక ప్రశ్నలు ,అనుమానాలుకు సమాధానం ఇస్తూ తల్లి పాల అవసరాన్ని , తల్లి పాల దానం గొప్పతనాన్ని  చెబుతూ తెలుగు రాష్ట్రాలలో ఏర్పాటు చేసి పిల్లల ప్రాణాలు ఆరోగ్యం కాపాడుతున్న ధాత్రి mothers milk bank గురించిన వివరాలు  ఇవ్వాల్టి సమాచారం సమీక్ష లో ధాత్రి founder director Dr . సంతోష్ కుమార్ క్రాలేటి గారి ఇంటర్వ్యూ లో తెలుసుకుందాము. See sunoindia.in/privacy-policy for privacy information.

    1시간 1분
  7. ఎలక్ట్రిసిటీ  ఏమండ్మెంట్ బిల్  ఎందు కోసం? (Electricity ammendment bill)

    2022. 08. 19.

    ఎలక్ట్రిసిటీ ఏమండ్మెంట్ బిల్ ఎందు కోసం? (Electricity ammendment bill)

    దేశం 75 yrs of independence ని వేడుకగా జరుపుకుంది . ఇప్పటికి దేశం లో అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయి లో మౌలిక వసతులు అందుబాటులోకి రాలేదు . వాటిలో విద్యుత్ సరఫరా ఒకటి . విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాలు లేవనే  వాదనలో ఎంత నిజం ఉందొ  ఫ్యూ వీక్స్  బ్యాక్  రాష్ట్రపతి  గౌరవనీయులు ముర్ము గారి స్వగ్రామానికి  కల్పించిన కనక్షన్ ఉదాహరణ .విద్యుత్ వాడకం లేని జీవితాన్ని ,రంగాలను  ఊహించటం  కష్టమే . పవర్ కట్స్  మూలంగా అనుభవమే అయినా  ఎలక్ట్రిసిటీ  దేశ ఆర్ధిక ప్రగతికి , ప్రజల నిత్యా అవసరాలకు  అవసరం . పవర్  కట్స్ ,పవర్ హాలిడేస్  ఆర్ధిక రంగం పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో  తెలుసు . అలంటి ఎలక్ట్రిసిటీ  కి సంబంధించి  ఉత్పత్తి ,పంపిణి , వినియోగం పై తీసుకు వస్తున్న  విద్యుత్సవరణ బిల్లు  పై దేశ  వ్యాప్తంగా చర్చలు ,వ్యతిరేకత  ఎదుర్కొంటున్నది.ఈ చట్ట సవరణ ఎందుకు ? ఎవరి కోసం ?  ఎవరికీ లాభం ? నష్టం ?  అనే దానిపై  ప్రజల్లో ఉన్న అనేక అనుమానాలు ,అయోమయం కు సమాధానం  తెలుసుకునే ప్రయత్నం  ఇవాళ్టి సమాచారం సమీక్ష  ఎపిసోడ్ లో    హోస్ట్  D . చాముండేశ్వరి తో  విద్యుత్ రంగ నిపుణులు P. రత్నాకర్ రావు  గారి ఇంటర్వ్యూ See sunoindia.in/privacy-policy for privacy information.

    1시간 8분

평가 및 리뷰

4.7
최고 5점
3개의 평가

소개

ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఉంటుంది. మీ సలహాలు, తెలుగులొ మీరు వినాలి అనుకునె విషయాలు గురించిన వివరాలు మాకు తెలపాలి అనుకుంటె, hello@sunoindia.in (mailto:hello@sunoindia.in) కి email పెట్టండి. (Samacharam Sameeksha will bring to you news and views of all the latest developments from Telangana and Andhra Pradesh. The podcast will also analyse news coverage and bring in seldom heard perspectives and will help you cut through the noise. Priority will be given to issues from the two Telugu states. Write into us at hello@sunoindia.in with your suggestions and feedback.)

Suno India의 콘텐츠 더 보기

무삭제판 에피소드를 청취하려면 로그인하십시오.

이 프로그램의 최신 정보 받기

프로그램을 팔로우하고, 에피소드를 저장하고, 최신 소식을 받아보려면 로그인하거나 가입하십시오.

국가 또는 지역 선택

아프리카, 중동 및 인도

아시아 태평양

유럽

라틴 아메리카 및 카리브해

미국 및 캐나다