నేను రాసుకున్న కథల పుస్తకాల్లో నుండి ఒక్కో కథని చదివి podcast లో పెడితే ఎలా ఉంటుంది అని అలోచించి ఒక ప్రయత్నం మొదలు పెట్టాను. జ్ఞాపకాల గొలుసు పుస్తకం నుండి మొదటి ఎపిసోడ్ : మా ఇంటెనకాల చిక్కుడు చెట్టు కథ ను చదివి యూట్యూబ్ లో పొందుపరిచాను. వీలున్నప్పుడల్లా మిగతా కథల్ని కూడా రికార్డు చేసి పెట్టాలని అనుకుంటున్నాను. ఇప్పుడంత చదువురుల నుండి, ప్రేక్షకుల నుండి తిరిగి శ్రోతలుగా చాలావరకు మారుతున్నారని గమనించాను. తమ అభిరుచి మేరకు ఎవరికి నచ్చిన పుస్తకాన్ని వారు చదివి వీలైతే రికార్డ్ చేసి యూట్యూబ్లో అందరూ వినేలాగా అందుబాటులోకి పెడుతున్నారు. మంచి మంచి కథలు పుస్తకాలు ఇప్పుడు యూట్యూబ్లో బోలెడు ఉన్నాయి. ఒక విధంగా ఇది కూడా మంచి ప్రయత్నం. నన్ను అడిగితే పాతతరం కథ రచయితలు అందరూ కూడాను వారి వారి రచనలన్నిటిని ఆడియో రూపంలో ఇలా యూట్యూబ్లో భద్రపరచగలిగితే గనక మందు తరాల వారికి చాలా ఉపయోగకరంగాను మరియు యూట్యూబ్ spotify లాంటి లైబ్రరీలో ఒక రికార్డు గాను ఉంటాయి అని భావిస్తున్నాను. కార్ లో డ్రైవ్ చేసుకుంటునో, బైక్ మీద డ్రైవ్ చేసుకుంటు, లేదా బస్సులో కిటికీ వారుగా కూర్చుని, చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అలా ఈ చదివిన కథలు వినడం కూడా మంచి ఉపశమనమే. ఒక విధంగా ఇదంతా మనకు అలవాటే ఎందుకంటే చిన్నప్పుడు మనమంతా రేడియోలోనే విని విని అలా ఊహ లోకంలో విహరించే వాళ్ళం. ఆ ప్రయత్నంలోనే భాగంగా మరికొన్ని కథల్ని రానున్న కాలంలో ఎపిసోడ్ ల వారిగా రికార్డ్ చేసి మీతో పంచుకుంటాను.
المعلومات
- البرنامج
- تاريخ النشر٢٢ محرم ١٤٤٦ هـ في ٧:٣٠ ص UTC
- مدة الحلقة١٩ من الدقائق
- التقييمملائم