23本のエピソード

తెలుగు భాష. తెలుగు సాహిత్యం.

#మనతెలుగుమనమాతృభాష

Vennela - వెన్నె‪ల‬ చంద్రశేఖర్ కొండుభొట్ల

    • アート

తెలుగు భాష. తెలుగు సాహిత్యం.

#మనతెలుగుమనమాతృభాష

    మే..మే...మేకపిల్ల_అమరావతికథలు

    మే..మే...మేకపిల్ల_అమరావతికథలు

    సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "మే మే మేకపిల్ల."

    ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఇరవైమూడవ కథ.



    ముత్తాలమ్మ జాతర ఊరిలో. జనం గుమికూడారు. సిద్దయ్య తన పదేళ్ళ కొడుకు పోలయ్యని కూడాతీసుకుని వొచ్చాడు, మునుపు అమ్మోరు దయతో పోలయ్య జబ్బునయం చేసినందుక్కానూ; మేకని బలి ఇచ్చి మొక్కు తీర్చుకోవటానికి. బలయ్యే ఆ మేక తను రోజూ ఆడుకునే మేకపిల్లని తెలిసి, పోలయ్యకి ఒకటే దిగులు.

    అమ్మోరికి బలివ్వటమంటే మామూలా? కోళ్ళూ, మేకలూ ఏం చాల్తాయనీ! గణాచారి అమ్మోరిని ఒంటిమీదికి తెచ్చుకుని, ఎనుముని బలిచ్చి తీరాల్సిందేనన్నాడు. కల్లు బానలడిగాడు. ఈయకుంటే ఊరినే మింగేస్తానన్నాడు. భయపడ్డ ఊరి జనం అలాగె తెప్పిస్తామన్నారు. దున్నపోతుని చూసాక కల్లు కడుపులోకి చేరాక, గణాచారి శాంతపడ్డాడు. ముత్తాలమ్మ మెత్తపడిందన్నాడు.

    ఈ హడావిడిలో పోలయ్య మెల్లగా వెళ్ళి, బలికోసం కట్టేసున్న మేకలన్నిటినీ వదిలేసాడు. వాటిల్లో ఉన్న తన మేకపిల్ల కూడా మే మే అనరుచుకుటూ పరిగెత్తిపోతే, ఆ పసిగుండె సంతోషంతో చెంగున ఎగిరింది!



    ఒక తరం నాటి జీవన సరళి, దేవుడి పేరిట మూఢ నమ్మకాలు, కల్మషం, కాఠిన్యం ఎరుగని చిన్నవాళ్ళ  హృదయాలు... సత్యంగారి కలం వీటన్నిటినీ సజీవంగా మన ముందు నిలబెడుతుందీ కథలో.

    రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.

    దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.

    • 5分
    అవతలొడ్డుపొంగింది_అమరావతికథలు

    అవతలొడ్డుపొంగింది_అమరావతికథలు

    సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "అవతలొడ్డు పొంగింది."

    ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఇరవైరెండవ కథ.



    ఓ రాత్రివేళ పిల్లలు వెన్నెట్లో ఆడుకుంటుంటే, కృష్ణ అవతలొడ్డునుండీ ఎవరివో కేకలు. రక్షించండో అని...

    మన కథానాయకులందరూ కలిసి పాలేర్రంగడిని తోడు తీసుకు, రేవులో పడవ తోసుకు బయల్దేరారు, ఆపదలో ఉన్న ఆ పరదేశిని కాపాడాలని. గడెయ్యాలన్న కిట్టిగాడి అత్యుత్సాహం కాస్తా గడని నీళ్ళలో కొట్టుకు పోయేట్టు చేసింది. అవతలొడ్డుకైతే చేరారు సరే, మళ్ళీ ఇవతలొడ్డుకు రావటమెలా?! ఆకలి, ఇంటిమీద బెంగ, భయం.. వెరసి, ఏడుపులు! ఎట్టకేలకు ఎలాగో గడ కోసం కబురెళ్ళింది. ఈలోగా ఈవల్నుండీ ఒక నలుగురు పెద్దాళ్ళు అన్నం కట్టుకుని తెప్పలమీద ఈదుకుంటూ అటు చేరుకున్నారు. ఆ తెచ్చిందంతా పిల్లలు తలాకాస్తా తిన్నారు. ఆకలి తీరిన కడుపులు. దిగులు లేకుండా వెంట నలుగురు పెద్దాళ్ళు. ఇంకెందుకూ భయం! మళ్ళీ ఆటలు, కేరింతలు. 

    పిల్లలు, వాళ్ళంతే. పిల్లలు కదూ మరీ..



    రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.

    దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.



    ధన్యవాదాలు,

    కొండుభొట్ల. చంద్రశేఖర్

    Twitter ID: @Chandu1302

    • 5分
    లేగదూడ చదువు_అమరావతి కథలు

    లేగదూడ చదువు_అమరావతి కథలు

    సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "లేగదూడ చదువు."

    ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఇరవైఒకటవ కథ.



    నాలుగేళ్ళు నిండని చిట్టి, అన్న అక్క బడికిపోతుంటే తనూ వెళుతుంది వాళ్ళతో రోజూ. దాన్ని ఇంకా బళ్ళో వెయ్యలా. అయితేనేం? దానికీ ఒక బడిసంచీ, దాన్నిండా బోల్డంత సామాను. బడికి పొయ్యే దారిలో ఆటలూ, బడిదగ్గర, గుడిదగ్గర గంగన్న తాతతో ముచ్చట్లు... దానికీ అన్నీ కావల్సిందే!

    బళ్ళో అందరూ పాఠాలు చదూకుంటుంటే, చిట్టి కూడా పలక మీద దానికి తోచిన గీతలు గీస్తుంది. బీళ్ళకి మేతకు పోయే ఆవులు బజారు మీదుగా పోతుంటే వాటిని చూస్తుంటుంది. మరి రోజూ చిట్టి ఆడుకునే లేగదూడో? అది కూడా రోజూ బడిముందు ఆగుతుంది చిట్టికోసం. లేగదూడని చూడగానే చిట్టీ పరిగెత్తుతుంది దాన్ని కలిసి కబుర్లు చెప్పుకొవటం కోసం! తను పలక మీద గీసిన పిచ్చి గీతలు చుపిస్తూ, అవే 'అ ఆ'లంటుది, అవే ఒంట్లంటూ లేగదూడకి చూపిస్తుంది. సాయంత్రం తొందరగా ఇంటికొచ్చేయమంటుంది. ఆ లేగదూడ చిట్టి ఒళ్ళూ మొహం నాకుతుంది, స్నేహంగా.

    ఇది మరే చిట్టి కథో కాదు. అచ్చంగా మన బాల్యం. మీరూ, నేను, వాడూ, అదీ మనందరం చిన్నతనంలో ఎంత సంతోషంగా ఆడుతూ పాడుతూ ఎదిగామో... ఆ తీపిగురుతుల మిఠాయి పొట్లం! సత్యంగారు ప్రేమతో మనకందించారు, ఆ తీయదనం ఎప్పటికీ మనతో, మనలో ఉండిపోనిమ్మని.   

    ఆ చిట్టిపాపాయి కంటే, ఆ లేగదూడకంటే ఎంతో చదువుకుని ఏదేదో సాధించామనుకునే మనం, మరి ఆ పసితనం సంతోషాలు దాచుకున్నామా? ఆ ఆత్మీయతలను నిలుపుకున్నామా? ఆ స్నేహాలను మిగుల్చుకున్నామా? ఇప్పటి మనలో ఇంకా కూడా అప్పటి మనం నిలిచి ఉన్నామా?   అలాగ ఉండగలగటమే మనమని ఒక్క ముగింపు వాక్యంతో హెచ్చరిస్తారు, సత్యంగారు. ఆ హెచ్చరిక కోసమైనా వారికి ప్రతిరోజూ శతకోటి నమస్కారాలు చేయాలి మనం!



    రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివ

    • 5分
    పచ్చగడ్డి భగ్గుమంది_అమరావతి కథలు

    పచ్చగడ్డి భగ్గుమంది_అమరావతి కథలు

    సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "పచ్చగడ్డి భగ్గుమంది."

    ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఇరవైయవ కథ.
     

    లచ్మి పొలంగట్లకాడ గడ్డి కోసుకుని ఊర్లో పీర్ల పంజా కాడ అమ్ముకునేది. ఆ వొచ్చే రుపాయి సంపాదనతోనే తనూ, అయ్యా తినటం. మళ్ళీ అందులో సగం అయ్య తాగుడు కోసం. వయసులో ఉన్న లచ్మి అందరితో ఎంత కలుపుగోలుగా ఉండేదో, ఎవడన్నా ఎకసెక్కాలాడితే, అంత గట్టిగానూ సమాధానమిచ్చేది. 

    లచ్మికి రాములు మావంటే మనసు. రాములు కూడా బతుకు నీకే దారపోసాననేవాడు. కానీ పెళ్ళిమాత్రం, సీతాలుతో చేసుకున్నాడు. అందుకేనేమో, ముసలాడితో మూడో మనువు కుదిరిన లచ్మి దగ్గర మూడో మనిషి ద్వారా గడ్డిమోపు కొనిపించి, పెళ్ళికి కట్నంగా రెండు రూపాయలిప్పించాడు. పెళ్ళాం సీతాలు ద్వారా, జాకిట్టు గుడ్డ ఇప్పించాడు. కానీ, తను మాత్రం మొహం చాటేసాడు.

    మాట తప్పిన రాములు కథేమో కానీ, మోసపొయిన లచ్మి మాత్రం, పెళ్ళయిన ఆర్నెల్లకే మొగుడు పోయి మళ్ళీ అయ్య పంచన చేరింది. మొహాన బొట్టూ, చిరునవ్వూ తుడిచేసుకుని, మళ్ళీ అదే పీర్ల పంజాలో గడ్డి అమ్ముకుంటోంది. 



    రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.

    దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.



    ధన్యవాదాలు,

    కొండుభొట్ల. చంద్రశేఖర్

    Twitter ID: @Chandu1302

    • 5分
    ఎవరుపాడినాఆఏడక్షరాలే_అమరావతికథలు

    ఎవరుపాడినాఆఏడక్షరాలే_అమరావతికథలు

    సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "ఎవరు పాడినా ఆ ఏడక్షరాలే."

    ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పంతొమ్మిదవ కథ.



    పెద్దొరగారూ, వారి పూర్వీకులూ కూడా దేవాలయంలో కార్యక్రమాలకి అవసరమౌతుందని, మేళగాళ్ళని ఆదరించి మడిమాన్యాలిచ్చి మరీ పోషించారు. 

    పరమేశూ పానకాలూ పండగ ఊరేగింపునాడు సన్నాయి మేళం వాయించమంటే, విద్యకి మారుగా బల ప్రదర్శన చేసారు. ఇక ఇలా కాదని, పెద్దొరగారు వీరాస్వామిని ఎంపిక చేసి తంజావూరు పంపించారు, సంగీతం నేర్చుకొరమ్మని. ఐదేళ్ళ గడువు, పదివేల ఖర్చు తిరిగేక, తిరిగొచ్చిన వీరస్వామిని శివరాత్రి నాడు కచ్చేరీ చెయ్యమంటే, పక్కనున్న జోడు వాద్యగాడు మూడొ కీర్తన అందుకున్నా, తను మాత్రం పీ, పీ.. అని సన్నాయిపీక సవరింపుల దగ్గరే ఉన్నాడు. 

    అవిద్యా పరులకి అక్షయ పాత్రలు దానాలు చేస్తే ఏం జరుగుతుందనేది, అక్షరమక్షరానికీ నవ్విస్తూ చెప్పారీ కథలో. 



    రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.

    దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.



    ధన్యవాదాలు,

    కొండుభొట్ల. చంద్రశేఖర్

    Twitter ID: @Chandu1302

    • 5分
    ఆఖరివేంకటాద్రినాయుడు_అమరావతికథలు

    ఆఖరివేంకటాద్రినాయుడు_అమరావతికథలు

    సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "ఆఖరి వేంకటాద్రి నాయుడు." 

    ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పద్ధెనిమిదవ కథ.

    వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడుగారు గొప్ప ప్రభువే. బహు దొడ్డవారే. తరవాతకాలంలో మరి రాజులూ, జమీలూ అన్నీ పోయినా... పెద్దొరగారని పదిమందీ అభిమానం, గౌరవంతో పిలుచుకున్న వారి ముని ముని మనవడు, బాలా చంద్రశేఖర్ వరప్రసాద్‌గారు వారికి అన్నిటా సమతూగే!

    పెద్దొరగారు స్నానమాడితే పెద్ద గంగాళం నిండుగా వేన్నీళ్ళు. రెండుబిందెల్తో ఇద్దరు నౌకర్లు సిద్ధం; అటొక చెయ్యీ ఇటొక చెయ్యీ కడిగి తుడవటానికి. కచ్చేరీకొస్తే అర్జీదారుల ముఖం చూడరు, గుమస్తాలతోటే విషయం చెప్పించడం! అలా డాబుగా దర్పంగా గంభీరంగా ఉండేవారెప్పుడూ. 

    మరయితే వారెప్పుడూ నీలాగా, నాలాగా సరదాగా నవ్వుతూ, సంతోషంగా ఉండేవారు కాదా? అదెలా?! 

    అదంతే. నవ్వే ఎరుగరా అంటే, పెద్దొరగారూ నవ్వారు. ఒకసారి వారి మనవడు చేసిన అల్లరికీ, మరోసారి, ఎత్తాత వెంకటాద్రి నాయుడుగారి విగ్రహాన్ని ముట్టుకుని చూసీ.

    మరింకొక సందర్భంలో కూడా, అంత ఆనందమూ కనిపించేది వారిలో. అర్చకులు అమరేశ్వరుడి ప్రసాదం పెద్దొరగారి కోసం వట్టుకొచ్చినప్పుడు. అది, ఆ ప్రసాదం, నేతి చిట్టిగారెలైతే!!



    రాజరికపు ఠీవిని, జమీందార్ల దర్పాన్నీ మన కళ్ళముందుంచి, ఎంత జమీందారులయినా, బయటకి గాంభీర్యం చూపినా, నేతి చిట్టిగారెలవంటి జిహ్వ చాపల్యనికి, తమ కళ్ళముందు తమ ఇంటి పసివారు తిరుగాడుతుంటే కలిగే సంతోషానికి అతీతులు కారని, బాంధవ్య వ్యామోహాలలో మనుషులంతా ఒక్కటేననీ చూపే మరొక మణిహారం, ఈ కథ.



    రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాష

    • 5分

アートのトップPodcast

土井善晴とクリス智子が料理を哲学するポッドキャスト
J-WAVE
広瀬すずの「よはくじかん」
TOKYO FM
これって教養ですか?
shueisha vox
味な副音声 ~voice of food~
SPINEAR
真夜中の読書会〜おしゃべりな図書室〜
バタやん(KODANSHA)
好書好日 本好きの昼休み
朝日新聞ポッドキャスト