TALRadio Telugu

Touch A Life Foundation

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

  1. "ఆంధ్రా ప్యారిస్ మా ఊరే!" - Sreeram Patibandla | Part -2 | Maa Ooru - 70

    14 HR AGO

    "ఆంధ్రా ప్యారిస్ మా ఊరే!" - Sreeram Patibandla | Part -2 | Maa Ooru - 70

    ఆంధ్రా ప్యారీస్ మా ఊరే… అంటూ శ్రీరామ్ పాటిబండ్ల గారు వారి ఊరి విశేషాలను మొదటి ఎపిసోడ్‌లో మనతో పంచుకున్నారు కదా.. ఈ రెండో ఎపిసోడ్‌లో తన అమెరికా జీవితం గురించి, అక్కడ సెటిల్ అయిన విషయాల గురించి ఎన్నో ఆసక్తికరమైన కబుర్లను మనతో పంచుకున్నారు! ఒక సాధారణ పల్లెటూరి వ్యక్తి, అమెరికాలో అజూర్ హార్డ్‌వేర్ క్వాలిటీ ఇంజనీర్‌గా ఎలా సెటిల్ అయ్యారు? అక్కడ ఎదురైన సవాళ్లు ఏంటి? మన మూలాలను మర్చిపోకుండా, చుట్టూ ఉన్న వారికి కూడా తెలుగు వారి సంస్కృతిని ఎలా పరిచయం చేస్తున్నారు? ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయకమైన విషయాలతో పాటు, ఆయన ప్రొఫెషనల్ లైఫ్ విశేషాలను కూడా ఈ ఎపిసోడ్‌లో మనతో పంచుకున్నారు. మరింకెందుకు ఆలస్యం? వినేయండి ఆ ముచ్చట్లను! In the first episode, Sriram Patibandla shared stories about his hometown, saying “Andhra Paris is my village.” In this second episode, he talks about his life in the United States and how he settled there, sharing many interesting experiences. How did a simple village boy become an Azure Hardware Quality Engineer in the US? What challenges did he face? And how is he keeping his roots alive while also introducing Telugu culture to people around him? Along with these inspiring stories, he also shares insights from his professional life. So why wait? Listen to this engaging conversation now! Guest: Sriram Patibandla Host: Usha #TALRadioTelugu #SriramPatibandla #TeluguNRI #LifeInUSA #IndianInAmerica #SuccessStory #VillageToUSA #InspiringJourney #TeluguPodcast #NRILife #AzureEngineer #TechCareer #InterviewSeries #Inspiration #SoftwareEngineer #USLife #TeluguInterview #ProfessionalJourney  #TALRadio #TouchALifeFoundation

    24 min
  2. గిరిజనుల కలలకి రెక్కలందిస్తున్న Butterfly Charitable Trust | Special Interview

    16 HR AGO

    గిరిజనుల కలలకి రెక్కలందిస్తున్న Butterfly Charitable Trust | Special Interview

    "ఒక రెండేళ్ల గిరిజన పాప మొదటి సారి లైట్ ని చూసినప్పుడు తన కళ్ళలో చూసిన సంతోషం నా జీవితానికి చాలు అనిపించింది" పూలవాగు కొమ్మ అనే గిరిజన గ్రామంలో మొదటిసారిగా సోలార్ విద్యుత్ ని అందించినపుడు కలిగిన ఈ అనుభవాన్ని చెప్తూ "Butterfly charitable trust " ఫౌండర్ నీలేష్ గారు చెప్పిన మాటలివి.. కనీస విద్యుత్ సౌకర్యం లేని మారుమూల గిరిజన గ్రామాలను గుర్తించి, సోలార్ పవర్ గ్రిడ్ల ద్వారా వెలుగులు నింపుతోంది ఈ సంస్థ. ఇప్పటివరకు వందలాది గ్రామాల్లో సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయడమే కాకుండా, కరెంట్ లేక చదువుకోలేకపోతున్న ఎంతో మంది పిల్లల జీవితాలకు ఆసరాగా నిలుస్తుంది. మారుమూల ప్రాంతాల్లో సొంతంగా స్కూళ్లను ఏర్పాటు చేసి, పాఠాలు చెప్తూ.. మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా ఉచిత వైద్య సేవలను ప్రజల వద్దకే చేరుస్తూ.. నిస్వార్థంగా సమాజ సేవ చేస్తూ, వేలాది గిరిజన కుటుంబాల లైఫ్ స్టైల్ ను బాగు చేస్తోంది. మరి ఇంకా ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? ఎంత మంది గిరిజన కుటుంబాలకు వీరు ఆసరాగా నిలుస్తున్నారు? ఇలాంటి ఎన్నో విషయాలను ఆ ట్రస్ట్ ఫౌండర్ నీలేష్ గారు ఈ ఇంటర్వ్యూలో మనతో పంచుకున్నారు… వినండి తప్పకుండా! మిస్ అవ్వకండి! “When a two-year-old tribal child saw electric light for the first time, the happiness in her eyes felt like everything to me.” These are the words of Neelesh, founder of Butterfly Charitable Trust, describing his experience when they first brought solar power to a remote tribal village called Poolavagu Komma. The organization identifies tribal villages that have no access to electricity and brings light into their lives through solar power grids. So far, they have installed solar systems in hundreds of villages. They are also supporting children who struggle to study without electricity. Beyond this, they set up schools in remote areas, provide education, and run mobile medical units to deliver free healthcare services directly to people. Through their selfless efforts, they are improving the lifestyle of thousands of tribal families. What more is this organization doing? How many families are they supporting?Listen to this interview with founder Neelesh to know more… Don’t miss it! Guest: Neelesh Host: Kalyani #TALRadioTelugu #ButterflyCharitableTrust #SolarForVillages #RuralDevelopment #TribalDevelopment #SolarEnergy #SustainableLiving #NGOIndia #SocialImpact #InspiringStories #TALRadio #TouchALifeFoundation

    28 min
  3. ఐనూ దారి కనిపెట్టింది | Super Girls Series - 3

    3 DAYS AGO

    ఐనూ దారి కనిపెట్టింది | Super Girls Series - 3

    పిల్లల కోసం రేడియో కథలు! బారీసుకు గ్రామానికి కొత్త రోడ్డు వచ్చిందని ఆ ఊరి ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ, ఒకరోజు ఆ ఊరికి వచ్చిన వరదల వల్ల ప్రజలంతా చాలా భయపడ్డారు.. ఐనూ మాత్రం ఆ వరదల నుండి ప్రజలందరినీ కాపాడాలని ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంది… తర్వాత ఏం జరిగిందో, ఐనూ అసలు ఆ ఊరిని ఎలా కాపాడిందో మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా! అయితే ఇంకెందుకు ఆలస్యం? కథ మొత్తం వినండి! Katha.org తో కలిసి TALRadio అందిస్తున్న “SuperGirls Series” లో మూడో కథ ఇది! ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నిమిషాలకు… తిరిగి సాయంత్రం 7:30 నిమిషాలకు… మన TALRadioలో…! మీరూ వినండి… మీ పిల్లలకూ వినిపించండి! Radio Stories for Kids! The people of Barisu village were very happy when a new road was built in their village. But one day, heavy floods hit the village, and everyone became very scared. At that time, Ainu starts thinking of different ways to save the people from the floods… What happens next? How does Ainu save the village? Curious to know? Then don’t wait—listen to the full story! This is the third story from the “SuperGirls Series” presented by TALRadio in collaboration with Katha.org.Tune in every Friday at 7:30 AM and again at 7:30 PM on TALRadio! Listen to yourself… and share it with your kids too! #TALRadioTelugu #KidsStories #RadioStories #StoryTime #SuperGirlsSeries #TALRadio #KathaOrg #ChildrenStories #MoralStories #KidsLearning #StoryForKids #AudioStories #Parenting #KidsEntertainment #Storytelling #FamilyTime #TALRadio #TouchALifeFoundation

    11 min
  4. సమస్య ఏదైనా "చేయూత" అందిస్తాం - Ravi Kumar | Special Interview

    4 DAYS AGO

    సమస్య ఏదైనా "చేయూత" అందిస్తాం - Ravi Kumar | Special Interview

    ఆకలి, పేదరికం, ఒంటరితనం, అవిద్య.. ఇలా సమస్య ఏదైనా సరే, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడి 'నేనున్నాను' అని ధైర్యం చెప్తోంది… చేయూత స్వచ్చంధ సంస్థ! అనాథ పిల్లల ముఖాల్లో వెలుగులు నింపుతూ, యువతను నిరాశ నిస్పృహల నుండి బయటపడేసి వారిలో ధైర్యం, నైతిక విలువలను పెంచుతోంది ఈ సంస్థ. మనుషుల మధ్య సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో, ఎదుటివారికి చేయూతనివ్వడం వెనుక ఉన్న ఆ తృప్తి ఏంటి? సామాజిక సేవలో యువత పాత్ర ఎలా ఉండాలి? ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయక విషయాలను చేయూత ఫౌండర్ రవి కుమార్ గారు ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో మనతో పంచుకున్నారు. మనుషుల్లోని మంచితనాన్ని, మానవత్వాన్ని తట్టిలేపే ఈ ఇంటర్వ్యూని ప్రతి ఒక్కరూ తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి! Hunger, poverty, loneliness, illiteracy—no matter the struggle, Cheyutha is standing strong beside those in need, saying “We are here for you.” By bringing smiles to the faces of orphaned children and helping youth overcome despair, the organization is nurturing confidence and strong moral values. In a time when human connections are fading, what is the true joy behind helping others? What role should youth play in social service? In this special interview, Cheyutha founder Ravi Kumar shares many such inspiring insights. Don’t miss this powerful conversation that awakens humanity and goodness within us all. Guest: Ravi Kumar Host: Kalani #TALRadioTelugu #Cheyutha #SocialService #HumanityFirst #StudentSupport #SocialImpact #ChangeMakers #MotivationTelugu #LifeSkills #PositiveVibes

    31 min
  5. స్ట్రీట్ నుండి స్పాట్ లైట్ వరకు... డ్యాన్స్ తో మారిన తలరాతలు!

    5 DAYS AGO

    స్ట్రీట్ నుండి స్పాట్ లైట్ వరకు... డ్యాన్స్ తో మారిన తలరాతలు!

    డ్యాన్స్‌తో పేదరికాన్ని జయించొచ్చని మీకు తెలుసా? స్లమ్ ఏరియాల్లో ఉండే పిల్లలచే డ్యాన్స్ స్టెప్స్ వేయిస్తూ వారి భవిష్యత్తును మారుస్తున్నారు వినయ్ శర్మ! 2016లో ఢిల్లీలో ఆయన మొదలుపెట్టిన “Dance Out of Poverty” కేవలం ఒక డ్యాన్స్ క్లాస్ గా మాత్రమే కాకుండా, వేలాది మంది పిల్లల ఆత్మవిశ్వాసానికి ఒక కేరాఫ్ అడ్రస్ గా మారింది. చదువుతో పాటు ఆర్ట్ (Art) కూడా మనిషిని ఎలా ప్రభావితం చేస్తుంది? డ్యాన్స్ అనేది ఒక పేద పిల్లాడి లైఫ్ స్టైల్‌ని, మైండ్‌సెట్‌ని ఎలా రీసెట్ చేస్తుంది? వంటి విషయాలతో పాటు.. భయం నుంచి ధైర్యం వైపు, స్లమ్స్ నుంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ వరకు సాగిన ఈ అమేజింగ్ జర్నీ గురించి మనం తప్పకుండా తెలుకోవాలి! అందుకే ఈ పాడ్కాస్ట్! పేదరికం అనేది టాలెంట్‌కి అడ్డుకాదని, సరైన స్కిల్ ఉంటే ఎవరైనా సూపర్ స్టార్స్ అవ్వొచ్చని నిరూపిస్తున్న ఈ రియల్ స్టోరీని అస్సలు మిస్ అవ్వకండి! ఇప్పుడే వినేయండి! Did you know that dance can help overcome poverty? Vinay Sharma is transforming the future of children living in slum areas by teaching them dance! What he started in 2016 as “Dance Out of Poverty” is not just a dance class anymore—it has become a beacon of confidence for thousands of children. How does art, along with education, shape a person’s life? How can dance reset the lifestyle and mindset of an underprivileged child? From fear to confidence, from slums to stage performances—this is an inspiring journey you don’t want to miss. This podcast dives into a real story that proves poverty is not a barrier to talent. With the right skills, anyone can become a star. Don’t miss it—listen now! Host: Geetha #TALRadioTelugu #WorldDanceDay #danceoutofpoverty #vinaysharma #danceforchange #artforsocialimpact #underprivilegedchildren #slumkidstalent #danceinspiration #skilldevelopment #confidencebuilding #inspiringstories #reallifetransformation #danceeducation #socialimpactindia #TALRadio #TouchALifeFoundation

    6 min
  6. "మన బిడ్డ బాగుండాలంటే సమాజంలో ఉన్న ప్రతి బిడ్డ బాగుండాలి" - Chandana Maripalli

    6 DAYS AGO

    "మన బిడ్డ బాగుండాలంటే సమాజంలో ఉన్న ప్రతి బిడ్డ బాగుండాలి" - Chandana Maripalli

    మన పిల్లలు సంతోషంగా ఉండాలంటే… మన చుట్టూ ఉన్న అందరు పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి అంటూ.. బాలల హక్కుల కోసం, తన జీవితాన్నే అంకితం చేశారు చందన మరిపల్లి గారు! ఒక పిల్లాడి రక్షణ వెనుక ఉండే సామాజిక బాధ్యతను ఎన్నో విధాలుగా వీరు సమాజంలోకి తీసుకెళ్తున్నారు.  అసలు పిల్లల రక్షణ పరంగా సమాజంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడిప్పుడు వస్తున్న కొత్త సమస్యలేంటి? వాటికి పరిష్కారాలేంటి? ఇలాంటి ఎన్నో విషయాలతో పాటు.. జువైనల్ జస్టిస్ కమిటీ మెంబర్‌గా ఆమె చూసిన ఎన్నో సంఘటనలను గురించి ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు! మరి మీరు కూడా మీ పిల్లల రక్షణ గురించి, వారి హక్కుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోడానికి ఆమె మాటల్లోనే వినండి! అస్సలు మిస్ అవ్వకండి! If our children are to be truly happy, then every child around us must also be happy — with this powerful belief, Chandana Maripalli has dedicated her life to protecting children's rights. She has been actively creating awareness in society about the shared responsibility behind every child’s safety and well-being. What are the major challenges society faces today when it comes to child protection? What new issues are emerging in recent times? And most importantly, what are the possible solutions? Along with these important topics, she also shares many real-life experiences from her role as a member of the Juvenile Justice Committee in this podcast. So, if you want to better understand your children’s safety, their rights, and how you can play a role in protecting them — listen to her words directly. Don’t miss it! Guest: Chandana Maripalli Host: Rama Iragavarapu #TALRadioTelugu #ChildRights #ChildProtection #SafeChildhood #ParentingTips #JuvenileJustice #SocialResponsibility #ChildSafety #ParentingAwareness #ChildWelfare #KidsSafety #SocialAwareness #ChildrenWellbeing #ParentingGuidance #AwarenessTalk #KidsFuture #TALRadio #TouchALifeFoundation

    46 min
  7. "ఆంధ్రా ప్యారిస్ మా ఊరే" - Sriram Patibandla | మా ఊరు - 69

    27 APR

    "ఆంధ్రా ప్యారిస్ మా ఊరే" - Sriram Patibandla | మా ఊరు - 69

    మనం ఎన్ని దేశాలు తిరిగినా, ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా.. మన ఊరి మట్టి వాసన ఇచ్చే సంతృప్తి మరెక్కడా దొరకదు కదా! సియాటెల్ లో ఉంటున్న శ్రీరామ్ పాటిబండ్ల గారు, తన సొంత ఊరు తెనాలిని ' ప్యారిస్'గా పిలుస్తారని ఎంతో గర్వంగా చెప్తూ, అలా ఎందుకు పిలుస్తారో కారణాలు కూడా మనతో పంచుకున్నారు. ఇంకా, వాళ్ళ ఊరి సంస్కృతి గురించి, చిన్ననాటి జ్ఞాపకాల గురించి, తన మూలాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఒక సాధారణ పల్లెటూరి వ్యక్తి అమెరికాలోని అజూర్ హార్డ్‌వేర్ క్వాలిటీ ఇంజనీర్‌గా ఎదిగిన తీరు, ఆ ప్రయాణంలో అతనికి తన ఊరు నేర్పిన పాఠాలు మనందరికీ ఇన్స్పిరేషన్! మరింకెందుకు ఆలస్యం ఈ ఎమోషనల్ జర్నీని అస్సలు మిస్ అవ్వకండి… తప్పకుండా వినండి! No matter how many countries we travel to or how high we rise in our careers, nothing matches the satisfaction of the smell of our hometown soil, right? Sriram Patibandla, who is currently living in Seattle, proudly says that his hometown Tenali is called the ‘Andhra Paris.’ He also shares the reasons behind this name. Along with that, he talks about his village culture, his childhood memories, and his strong connection to his roots. His journey from a simple village background to becoming an Azure Hardware Quality Engineer in the USA is truly inspiring. The values and lessons he learned from his hometown played a big role in shaping his success. So why wait? Don’t miss this emotional journey… do give it a listen! Guest: Sriram Patibandla Host: Usha #TALRadioTelugu #MaaOoru #Tenali #AndhraParis #TeluguPride #HometownLove #RootsAndIdentity #VillageMemories #EmotionalJourney

    26 min
  8. మఖీలాల్ అనే ఒక ఈగ కథ! | Super Girls Series - 2

    24 APR

    మఖీలాల్ అనే ఒక ఈగ కథ! | Super Girls Series - 2

    పిల్లల కోసం రేడియో కథలు! అనగనగా… మక్కీపురి అనే ఒక ఊరు! ఆ ఊర్లో మక్కీలాల్ అనే ఈగను దైవంగా పూజించేవారు. కానీ.. ఆ ఊర్లోకి వచ్చిన ఒక యువ డాక్టర్ కు మాత్రం ఈ పద్ధతి నచ్చక ఆ ఈగలన్నింటినీ తరిమేయాలని అనుకున్నాడు! అప్పుడు, ఆ ఊరి ప్రజలు మాత్రం వాటి శాపానికి గురౌతామేమో అని చాలా భయపడ్డారు…! తర్వాత ఏం జరిగిందో తెలుసా? తెలుసుకోడానికి TALRadio వినండి! Katha.org తో కలిసి TALRadio అందిస్తున్న “SuperGirls Series” లో రెండో కథ ఇది! ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నిమిషాలకు… తిరిగి సాయంత్రం 7:30 నిమిషాలకు… మన TALRadioలో…!మీరూ వినండి… మీ పిల్లలకూ వినిపించండి! Radio stories for kids! Once upon a time, there was a village called Makkipuri. The people there worshipped a fly named Makkilal as their god. But when a young doctor came to the village, he didn’t like this practice and decided to drive all the flies away. The villagers, however, were very scared, thinking they might face a curse if they did that…! What happened next?To find out, listen to TALRadio! This is the second story from the “SuperGirls Series” presented by TALRadio in collaboration with Katha.org.Every Friday at 7:30 AM and again at 7:30 PM on TALRadio. Listen and share it with your kids too! #TeluguStories #RadioStories #StoryForKids #MoralStories #TeluguKids #StoryTime

    9 min

Ratings & Reviews

About

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

You Might Also Like