Ki re View

Kiran Kumar

విషయ జ్ఞానం

  1. 04/12/2025

    Injustice anywhere is a threat to Justice everywhere

    I have a Dream .. ఇది అబ్దుల్ కలాం గారి ప్రసంగాల స్పూర్తి తో ఇచ్చిన డిక్లరేషన్ కాదు. నేను ఏదో సాధించాలి తపన తో అన్న మాటకూడా కాదు. ఒక అద్బుతమైన, స్ఫూర్తిదాయకమైన ప్రసంగం నకు నాంది అయిన మాటలు. నేనుకిరణ్ కుమార్.  మీ హోస్ట్.. కి. రి వ్యూపాడ్ కాస్ట్ కి స్వాగతం. మిత్రులారా.. I have a Dream .. ఆ మాటలు. మార్టిన్లూథర్ కింగ్ జూనియర్ 1963 ఆగస్ట్ 28,  న  నల్ల జాతీయుల పౌర హక్కుల  ఉద్యమం లో భాగంగా వాషింగ్టన్ DC లో ఇచ్చిన చారిత్రాత్మక ప్రసంగం లో మాటలు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటేనిన్ననే అనుకోకుండా జాలీ LLB 2 అనే సినిమా చూశాను.  Injustice anywhere is a threat to justice everywhere అనే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కొటేషన్ తో సినిమా ముగిసింది.  ఆ చిన్న వాక్యం లో నిజంగా ఎంత అర్థం వుందోఅనిపించింది.  మార్టిన్ లూథర్ కింగ్జూనియర్ యొక్క  ఈ మాటలు సమాజంలో ఎంతప్రాముఖ్యత కలిగివున్నాయో నేను చర్చించబోతున్నాను.  సాధారణంగా న్యాయం జరగకపోవడం లేదా అన్యాయం జరగడం చాలారూపాలలో జరగవచ్చు. ఆర్థికపరమైన అన్యాయాలు, గుర్తింపు కోసం అన్యాయాలు బాధ్యతలు, విధులు,లేదా మన అధికార పరిధి నిర్వర్తన పరమైన విషయాలలో అన్యాయాలు, ఇలాంటివి సమాజం లో అంటేఇండ్లలో , కార్యాలయాల్లో , పని ప్రదేశాలలో  రాజకీయ సంస్థలలో జరుగుతూవుంటాయి.   కళ్లముందు అన్యాయం జరుగుతుంటే చాలా మంది దాని గురించి మాట్లాడానికి, చర్చించటానికిభయపడుతూ వుంటారు. దానికి కారణం వారి వ్యక్తిగత, ఉద్యోగ , సామాజిక పరమైన ఇబ్బందులకుగురి అవుతాము అన్న భావన కావచ్చు. లేదా కొన్ని సందర్భాలలో మనమే ఆ అన్యాయం చేయడం లోభాగం అవుతాము. అలాంటి మౌనం రేపు అతి పెద్ద భూతమై మన ముందే నిలబడుతుంది. సమాజంలోఎవరికో జరిగిన అన్యాయం వైరస్ లా అన్నీ వైపులకు వ్యాప్తి చెంది మనల్ని ప్రభావితం చేస్తుంది.  అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మనదికాదు అనేభావన కలిగితే, సమాజంలో నైతిక విలువలు తగ్గిపోతాయి.నన్ను ప్రభావితంచేయకపోతే, అది నా సమస్య కాదు అనే ధోరణి సమాజాన్ని మరింతఅనైతికంగా మారుస్తుంది.  పాఠశాలలోవిద్యార్ధులు కొంతమంది డ్రగ్స్ కి అలవాటు అయ్యారని తెలిస్తే మనకి ఎందుకులే స్కూల్హెడ్మాస్టర్ చూసుకుంటారు.. ఆ తల్లిదండ్రులు చూసుకుంటారు మనకి అనవసరంగా ఎవరితోఎందుకు గొడవలు అని మౌనంగా వుంటే తరువాతి రోజు అదే ప్రమాదం మన పిల్లలకి జరగదని ఏంగ్యారంటీ వుంటుంది.  సమాజం లోని వ్యక్తులేకాదు కొన్నిసార్లు ప్రభుత్వాలు కూడా అన్యాయం పట్ల మౌనంగా వుండి  అన్యాయానికి మద్దతు ఇవ్వడం మనకి కనపడుతుంది.మీరు గమనించే వుంటారు. కొన్ని సినిమాలకు ప్రభుత్వాలు టికెట్ రేట్స్ పెంచుకోవటానికిఅనుమతి ఇస్తున్నాయి. అది ఒక అలవాటుగా మారిపోయింది. సినిమా బడ్జెట్ పెరిగింది అనిఎక్కువ రేట్స్ కి టికెట్స్ అమ్మకోవడానికి అనుమతి ఎప్పుడో ఇచ్చి వుంటారు.. అదిపూర్తిగా అన్యాయం.  దాన్ని ఎవరు కూడాఖండించకపోవడం, పట్టించుకొకపోవడం జరిగే సరికి ప్రతి సినిమాకి, ప్రతి థియేటర్ లోనూఅదే అన్యాయం కొనసాగుతుంది. ఒక చోట జరిగిన injustice వలనప్రతి చోట జస్టిస్ ప్రమాదం లో పడింది కదా.. సమాజం లో వివిధ స్థాయిలలో అన్యాయానికి గురి అయ్యే వారి పట్ల బాధ్యత గా కనీసస్థాయి లో మోరల్ సపోర్ట్ కూడా వ్యక్తపరచకుండా, వారు గతంలో చేసిన సహాయాన్ని కూడామర్చిపోయి స్వార్ధం కోసం ఆ అన్యాయాన్ని సమర్థించే ప్రయత్నం చేసే వారు మన కళ్లముందు కనపడుతూ వుంటారు.  దానికి కారణాలుకూడా ఇంతకుముందే చెప్పుకున్నాము కదా..  ప్రస్తుత రాజకీయాల్లో  కూడా  ఇలాంటి అన్యాయానికి గురి అయ్యి మౌనంగా వుంటున్ననాయకులు ఇప్పుడు మనకి కనపడుతున్నారు.  ఇకపోతేసాంకేతికత పెరగడం వలన ఇప్పుడు చాలామంది చైతన్యవంతం అయ్యి ఎక్కడైనా అన్యాయం జరిగితేదానిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం చేస్తున్నారు. ఇది చాలా మేరకు సంతోషించదగ్గపరిణామమే కానీ, సమాజం లో ఉన్నత స్థాయి లో వున్న వారు చేసే అన్యాయాలు సోషల్ మీడియా వేదికగామనం  ప్రశ్నించిన సరే వారికి  వున్న స్పెషల్ ప్రివిలేజ్ మూలంగా ఆ అన్యాయం న్యాయంగామారే అవకాశాలు చాలా తక్కువ. అంతే కాకుండా సోషల్ మీడియా లో ప్రశ్నించిన వారికి జరిగేఅన్యాయాలు మళ్ళీ ఇంకో టాపిక్.  మన వంతు బాధ్యతగా మనం చేయాల్సింది ఏమిటంటే మన పనుల వలన ఎవరైనా అన్యాయానికి గురి కాకుండా చూడటం, మనకిఅన్యాయం జరుగుతుంటే ప్రశ్నించడం నేర్చుకోవాలి. న్యాయంగా మనకి చెందని దాని గురించి మనంఆశించకూడదు. న్యాయంగా మనకి చెందే దానిని వదులుకోకూడదు. కనీసం ఇలా చేద్దాం.. ఈ పాడ్కాస్ట్ లో కొన్ని అంశాల పట్ల సూచనలు చేసిన ఆత్మీయ సోదరి శ్రీమతి దుర్గా శైలజ గారికికృతజ్ఞతలు తెలియచేసుకుంటూ.. మీ హోస్ట్ కిరణ్ కుమార్.. సైనింగ్ ఆఫ్.. బై.

  2. 11/21/2023

    పోలింగ్ సమయం లో ప్రిసైడింగ్ ఆఫీసర్ విధులు - బాధ్యతలు

    మీ అందరికీ తెలుసు .. ప్రస్తుతం మన రాష్ట్ర అసెంబ్లీ కి నవంబర్ 30 న ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగటానికి ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది ఎంతో శ్రమిస్తారు . ఎన్నికల విధులలో జిల్లా కలెక్టర్ మొదలుకొని కింది స్థాయి ఉద్యోగి వరకు అనేక బాధ్యతలు విరామం లేకుండా నిర్వరిస్తూ వుంటారు. ముఖ్యంగా పోలింగ్ స్టేషన్ లో విధులు నిర్వర్తించే సిబ్బంది లో ముఖ్య పాత్ర ప్రిసైడింగ్ ఆఫీసర్ ది. పోలింగ్ సమయం లో వివిధ సందర్బాలలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎలా వ్యవహరించాలో మనం ఈ రోజు తెలుసుకుందాం. ఈ విషయాలు ఈ రోజు మనకి తెలుపటానికి మనతో పాటు డాక్టర్ వి. నరసింహ కుమార్ గారు వున్నారు. వీరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల , భద్రాచలం నందు ప్రిన్సిపాల్ గా పదవి విరమణ చేసి వున్నారు. గతం లో జరిగిన ప్రతీ  ఎన్నికలలో వీరు వివిధ ఎన్నికల విధులకు సంబంధించి మాస్టర్ ట్రైనర్ గా వున్నారు. అద్భుతమైన విశ్లేషణ , వివరణ వీరి స్వంతం.

About

విషయ జ్ఞానం