TALRadio Telugu

Touch A Life Foundation

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

  1. 2d ago

    24 గంటల ఈ ఛాలెంజ్‌తో.. మీ జీవితమే మారిపోవచ్చు! | Smart Money Mindset - 11

    జీవితంలో మార్పు రావాలని కోరుకుంటాం.. కానీ ఆ మార్పు కోసం మన అలవాట్లను, ఆలోచనలను మార్చుకోవడం మాత్రం మర్చిపోతుంటాం. మనం ఎలా ఉంటె.. మన జీవితం కూడా అలాగే మారుతుంది! అందుకే.. ఈ వారం Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు 24-Hour Reset Strategy గురించి మనతో పంచుకున్నారు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా కేవలం ఒక 24 గంటలు ఆలోచించి, ప్రవర్తించి చూడండి.. ఆ చిన్న ప్రయత్నమే మీలోని మార్పుకు ప్రారంభం కావచ్చు.. అంటున్నారు. మరి ఈ 24 గంటల్లో ఏం చేయాలి? మీ Identityని ఎలా మార్చుకోవాలి? పాత అలవాట్లను ఎలా దాటుకొని ముందుకు వెళ్ళాలి? తెలుసుకోవడానికి ఈ పాడ్‌కాస్ట్‌ను తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి! Just 24 hours.. one new identity, one new beginning! We all want to change our lives.. but real change starts when we change ourselves. In this Smart Money Mindset - Telugu podcast, Financial Educator & Money Mindset Coach Madhavi Latha shares the 24-Hour Reset Strategy, a simple way to start behaving like the person you want to become. What should you do during these 24 hours? How can you break old habits and build a new identity? Tune in to find out! Host: Madhavi Latha Source: https://www.youtube.com/@Smartmoneymindsettelugu #TALRadioTelugu #SmartMoneyMindset #MoneyMindset #24HourChallenge #PersonalGrowth #SelfImprovement #Mindset #Discipline #GrowthMindset #TouchALifeFoundation

    24 గంటల ఈ ఛాలెంజ్‌తో.. మీ జీవితమే మారిపోవచ్చు! | Smart Money Mindset - 11
  2. 3d ago

    అనుభూతులే ఆమె అక్షరాలు | పి. ఇంద్రాణి | మన రచయితలు S2 - 4

    10 ఏళ్ల వయసులోనే కవితలు రాయడం మొదలుపెట్టారు.. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తూనే.. 7 పుస్తకాలు రాశారు! చిన్నప్పుడు ఇంట్లో సాహిత్య వాతావరణంలో పెరిగిన ఇంద్రాణి పాలపర్తి గారు.. కేవలం 10 ఏళ్ల వయసులోనే తన రచనా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత చదువు, ఉద్యోగం, అమెరికా జీవితం.. ఇలా ఎన్ని బాధ్యతలు తనపై పడ్డా తెలుగు సాహిత్యంపై తనకు ఉన్న ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు. ఇప్పటివరకు 7 పుస్తకాలు రచించారు. ‘వానకు తడిసిన పువ్వు’ తో ప్రారంభమైన ఆమె సాహిత్య ప్రయాణంలో.. ప్రకృతి, మనిషి అనుభూతులు, తన చుట్టూ కనిపించే జీవితాన్ని కవిత్వంగా మలుస్తూ ముందుకు సాగుతున్నారు. చిన్నప్పుడు రాసిన తొలి కవిత నుంచి.. అమెరికా చలిలో రాసిన ‘శీతకాలపు రాత్రి’ వరకు.. ఆమె చుట్టూ కనిపించే జీవితమే ఆమె రచనలకు ప్రేరణగా మారింది. మరి ఒక Healthcare Economistగా పనిచేస్తూనే.. రచయితగా తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? చిన్నప్పుడే కవిత్వం వైపు ఆమెను నడిపించిన కుటుంబ వాతావరణం ఎలా ఉంది? ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య సాహిత్యానికి సమయం ఎలా కేటాయిస్తున్నారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వారం ‘మన రచయితలు’ కార్యక్రమంలో మనతో పంచుకున్నారు.. ఇంద్రాణి పాలపర్తి గారు! Indrani Palaparthi began writing poetry at the age of 10, inspired by the literary environment she grew up in. Today, while working as a Healthcare Economist in the USA, she has authored seven books, continuing her passion for Telugu literature alongside her professional and personal responsibilities. From her debut book Vaanaku Tadisina Puvvu to poems inspired by nature, human emotions, and everyday life—including Sheetakaalapu Raatri—her surroundings have remained a constant source of inspiration. In this episode of Mana Rachayithalu, Indrani shares her literary journey, her family’s influence, and how she balances her career and life in America with her passion for writing. Host : Renusree Guest : Indrani.P #TALRadioTelugu #ManaRachayithalu #TeluguLiterature #TeluguWriters #PoetryJourney #WomenWriters #TouchALife #TALRadio

    అనుభూతులే ఆమె అక్షరాలు | పి. ఇంద్రాణి | మన రచయితలు S2 - 4
  3. 3d ago

    చిన్నారుల కోసం రంగుల ప్రపంచం - Art2Heart Foundation | స్ఫూర్తి కిరణాలు

    హాస్పిటల్ అంటే.. ఇంజక్షన్స్, మందులు, ట్రీట్మెంట్ ఇవే గుర్తొస్తాయి…! కానీ.. చుట్టూ రంగు రంగుల గోడలు, ప్రకృతి దృశ్యాలు, అందమైన బొమ్మలు.. ఉంటే? ముఖ్యంగా.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారులకు ఇలాంటి వాతావరణం ఎంతో ఉపయోగపడుతుంది. Art2Hearts Foundation చేస్తున్న ప్రయత్నం కూడా ఇదే. పిల్లల కోసం పనిచేసే ఆసుపత్రులతో కలిసి.. వారి అవసరాలకు, అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా ఆర్ట్‌వర్క్స్‌ను సేకరించి, Pediatric Wardsలో ఏర్పాటు చేస్తోంది. ఎంతో మంది ఆర్టిస్టులు donate చేసిన వారి ఆర్ట్ ఫామ్స్ ను.. ఇంటి గోడలకే పరిమితం చేయకుండా, ఆసుపత్రిలో ఉన్న చిన్నారులకు ఒక సరికొత్త వాతావరణాన్ని పరిచయం చేస్తున్నాయి. Art2Hearts Foundation డైరెక్టర్ పార్లే అనూష గారు.. ఆసుపత్రులతో కలిసి ఎలా పనిచేస్తున్నారు? ఆర్టిస్టుల నుంచి వారి ఆర్ట్‌వర్క్స్‌ను ఎలా సేకరిస్తున్నారు? ఒక ఆర్ట్‌వర్క్ చిన్నారులపై ఎలాంటి ప్రభావం చూపగలదు? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు. ఆర్ట్ ద్వారా హాస్పిటల్ వాతావరణంలో మార్పు తీసుకురావాలనే ఈ అందమైన ప్రయత్నం గురించి తెలుసుకోవడానికి.. ఈ వారం ‘స్ఫూర్తి కిరణాలు’ కార్యక్రమాన్ని తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి! Art2Hearts Foundation is transforming hospital environments for children by bringing art, colour, and creativity into pediatric wards. In collaboration with children’s hospitals, the foundation collects artworks donated by artists and installs them based on the needs and surroundings of each hospital. In this podcast, Art2Hearts Foundation Director Parle Anusha shares how the organization works with hospitals and artists, and how art can create a more positive and comforting environment for children undergoing treatment. Host : Adarsh Kumar Guest : Anusha , Director For India , Art2heart Foundation. Website :https://art2hearts.org/ #TALRadioTelugu #Art2Hearts #ChildrensHealthcare #HealingThroughArt #PediatricCare #ArtForChange #TouchALifeFoundation #TALRadio

    చిన్నారుల కోసం రంగుల ప్రపంచం - Art2Heart Foundation | స్ఫూర్తి కిరణాలు
  4. 5d ago

    గిరిజనుల కోసం అన్నం , అక్షరం , ఆరోగ్యం | అంతరంగాలు - 07

    గిరిజన ప్రాంతాల అభివృద్ధే ఈయన లక్ష్యం! విశాఖపట్నంలోని King George Hospital చుట్టూ పెరిగిన రామ్ కుమార్ గారు.. చిన్నప్పుడే గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను, వారి కుటుంబాలను, జీవన విధానాన్ని దగ్గరగా చూశారు. ఆ గిరిజనులకు తమ తల్లిదండ్రులు చేస్తున్న సహాయం ఆయనపై ఎంతో ప్రభావం చూపింది. ఆ స్ఫూర్తితో ఉద్యోగం చేస్తూనే 2016లో Robin Hood Armyలో వాలంటీర్‌గా చేరి.. అవసరమైన వారికి ఆహారం అందిస్తూ సహాయం చేశారు. కానీ, ఇంకా గిరిజన ప్రాంతాల ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను దగ్గరగా చూశారు. దీంతో.. అక్కడే నిరంతరం పనిచేయాలని నిర్ణయించుకుని, 2021లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి Samaritans for the Nation అనే సంస్థను ప్రారంభించి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో కూడా ఆరోగ్యం, విద్య, ప్రాథమిక అవసరాల కోసం పనిచేస్తున్నారు. మరి అసలు.. చిన్నప్పుడు వారి తల్లి దండ్రుల నుండి వచ్చిన స్ఫూర్తి.. ఎలా తన సేవా ప్రయాణంగా మారింది? గిరిజన ప్రాంతాల్లో ఇంకా ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? తెలుసుకోవడానికి ఈ వారం ‘అంతరంగాలు’ podcast ను తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి! Ram Kumar grew up around King George Hospital in Visakhapatnam and was deeply influenced by his parents’ efforts to help tribal communities. Inspired by their service, he began volunteering with the Robin Hood Army in 2016 while continuing his career. After witnessing the challenges faced by tribal communities more closely, he decided to dedicate himself to long-term service. In 2021, he founded Samaritans for the Nation along with his family and friends. The organization now works across tribal regions in Andhra Pradesh, Telangana, and other states, focusing on healthcare, education, and basic needs. This episode of “Antharangalu” explores how childhood experiences shaped Ram Kumar’s journey of service and the impactful work he continues to do for tribal communities. Guest: Smt. Chandrakala Host: Dr. Gurajada Shobha Perindevi #TALRadioTelugu #Antharangalu #TribalDevelopment #SocialService #CommunityService #SamaritansForTheNation #InspiringJourney #TouchALife #TALRadio

    గిరిజనుల కోసం అన్నం , అక్షరం , ఆరోగ్యం | అంతరంగాలు - 07
  5. Sep 24

    అప్పులు తీర్చడానికి సులభమైన మార్గాలు ఇవే! | Smart Money Mindset - Telugu - 10

    లోన్ తీసుకోవడం చాలా సులభం.. కానీ దాని నుంచి బయటపడటానికే సరైన ప్లాన్ ఉండాలి! మనలో చాలామంది ఏదో ఒక అవసరం కోసం లోన్ తీసుకుంటాం. కానీ ఒక్కోసారి పరిస్థితులు మారినప్పుడు.. ఉద్యోగం పోవడం, ఆదాయం తగ్గడం, ఎక్కువ EMIలు ఉండటం, క్రెడిట్ కార్డ్ బిల్లులు పెరగడం వంటి కారణాలతో లోన్ భారం పెరిగిపోతుంది. అప్పుడు ఏ లోన్ ముందు తీర్చాలి? ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి? EMIలను ఎలా మేనేజ్ చేయాలి? అనే విషయాల్లో చాలామందికి అవగాహన ఉండదు. అందుకే… ఈ Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో ప్రముఖ Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు.. లోన్ భారం నుంచి బయటపడేందుకు ఉపయోగపడే ఎన్నో practical tips‌ను వివరించారు. కొత్త లోన్లు తీసుకోకుండా ఉండటం, మన Assets, Liabilities, Income, EMIలను ఒకచోట రాసుకుని పూర్తి క్లారిటీతో ఉండటం, ఎక్కువ వడ్డీ ఉన్న లోన్లను ముందుగా తీర్చడం, EMIల కోసం ప్రత్యేకంగా ఒక అకౌంట్ ను ఏర్పాటు చేసుకోవడం, ఎక్కువ లోన్లను ఒకే లోన్‌గా మార్చుకునే ముందు వడ్డీని పరిశీలించడం వంటి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకోవచ్చు. లోన్ భారం ఎంత ఉన్నా.. సరైన ప్లాన్‌తో ఒక్కో అడుగు ముందుకు వేస్తే దాని నుంచి బయటపడే మార్గం కచ్చితంగా దొరుకుతుంది. మరి అసలు లోన్స్ ను ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఏ లోన్‌ను ముందుగా తీర్చాలి? ఖర్చులు, EMIలు, ఆదాయాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? తెలుసుకోవడానికి ఈ పాడ్‌కాస్ట్‌ను తప్పకుండా వినండి.. మిస్ అవ్వకండి! Taking a loan may be easy.. but getting out of it requires a proper plan! Many of us take loans for one reason or another. But when situations change.. losing a job, a drop in income, multiple EMIs, or increasing credit card bills can make the loan burden much harder to manage. At such times, many people may not know which loan to repay first, how to cut down expenses, or how to manage their EMIs effectively. That’s why, in this Smart Money Mindset - Telugu podcast, renowned Financial Educator & Money Mindset Coach Madhavi Latha shares several practical tips to help manage loans and gradually reduce the financial burden. From avoiding new loans, keeping a clear record of your Assets, Liabilities, Income and EMIs, prioritising high-interest loans, and maintaining a separate account for EMIs to carefully evaluating the interest rate before consolidating multiple loans into one.. this podcast covers several useful ways to manage loans better. No matter how much the loan burden is.. with the right plan and by taking one step at a time, there is always a way forward. So, how can you manage your loans? Which loan should you repay first? How can you balance your expenses, EMIs and income? Tune in to this podcast to learn more.. Don’t miss it! Host: Madhavi Latha Source: Smart Money Mindset - Telugu #TALRadioTelugu #SmartMoneyMindset #MoneyManagement #DebtManagement #LoanManagement #FinancialEducation #PersonalFinance #FinancialWellness #MoneyMindset #EMI #FinancialPlanning #DebtFree #MoneyTips #TouchALifeFoundation

    అప్పులు తీర్చడానికి సులభమైన మార్గాలు ఇవే! | Smart Money Mindset - Telugu - 10
  6. Sep 22

    మాతృదేవోభవ - ఓ తల్లి నిజ జీవిత కథ! | Chandrakala | అంతరంగాలు - 6

    ‘మాతృదేవోభవ’ సినిమాను గుర్తు చేసే ఓ తల్లి కథ ఇది…! తన పిల్లల్లో కొందరికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వారి కోసం చంద్రకళ గారు ఎన్నో కష్టాలు పడ్డారు. పిల్లలను చూసుకుంటూ.. వారి ఆరోగ్యం కోసం కూడా ఎంతో శ్రమించారు. ఈ కష్టాల మధ్యే.. తన పిల్లలకు ఎదురైన పరిస్థితి మరో కుటుంబానికి రాకూడదని అనుకున్నారు. అలా తనకు చేతనైన సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అమ్మ పడిన కష్టాలను దగ్గరగా చూసిన ఆమె కుమారుడు రవికుమార్ గారిపైనా ఆ ప్రభావం పడింది. అమ్మను చూసి.. తానూ సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. ముఖ్యంగా Muscular Dystrophyతో జీవిస్తున్నవారికి, వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడంతో పాటు.. రక్తదానం, అవయవదానం, యోగా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. Muscular Dystrophy గురించి మరింత మందికి అవగాహన కల్పిస్తూ.. ఈ సమస్యతో జీవిస్తున్న కుటుంబాలకు అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తున్నారు. ఓ తల్లి తన పిల్లల కోసం మొదలుపెట్టిన పోరాటం.. ఆ తర్వాత మరెంతో మందికి ఎలా అండగా మారింది? చంద్రకళ గారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? రవికుమార్ గారి సేవా ప్రయాణం ఎలా మొదలైంది? తెలుసుకోవడానికి ఈ వారం ‘అంతరంగాలు’ పాడ్కాస్ట్ ను తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి! This is the story of a mother that reminds us of the movie Maatrudevobhava…! Some of Chandrakala garu’s children faced health challenges, and she went through many struggles to take care of them and support their well-being. Amidst all these difficulties, she decided that no other family should have to go through what hers did. That’s when she began helping others in whatever way she could. Watching his mother’s struggles closely also had a deep impact on her son, Ravikumar garu. Inspired by her, he too chose to dedicate himself to service. Today, he is especially supporting people living with Muscular Dystrophy and their families. Along with helping those in need, he conducts initiatives such as blood donation, organ donation awareness, and yoga programs. He is also working to create greater awareness about Muscular Dystrophy and ensure that families living with the condition receive the support they need. How did a mother’s fight for her children become a source of support for so many others? What challenges did Chandrakala garu face? And how did Ravikumar garu begin his journey of service? Tune in to this week’s ‘Antharangalu’ podcast to know their inspiring story. Don’t miss it! Guest: Smt. Chandrakala Host: Dr. Gurajada Shobha Perindevi #TALRadio #Antharangalu #Chandrakala #RaviKumar #MuscularDystrophy #SocialService #CommunityService #RareDiseaseAwareness #BloodDonation #OrganDonation #InspiringStories #Motherhood #TouchALifeFoundation

    మాతృదేవోభవ - ఓ తల్లి నిజ జీవిత కథ! | Chandrakala | అంతరంగాలు - 6
  7. Sep 21

    సెలవులు రాగానే ఊరికి వెళ్ళడం చాలా బాగుండేది! | Mr. Shakeel Basha | మా ఊరు - 82

    ఎన్ని సంవత్సరాలు గడిచినా… మన ఊరికి వెళ్లినప్పుడు కలిగే ఆ ఆనందం మాత్రం అస్సలు మారదు! చిన్నప్పుడు నాన్నతో కలిసి ఊరికి వెళ్లిన రోజులు, బస్సులు మారుతూ ప్రయాణం చేసిన సందర్భాలు, కొన్ని కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లిన జ్ఞాపకాలు… ఇప్పటికీ మన మనసులో అలాగే ఉంటాయి అంటూ… తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.. శకీల్ బాషా గారు! ఊరికి వెళ్లాలంటే అప్పట్లో బస్సులు మారి, కొంత దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చినా.. ఆ ప్రయాణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారట. ఊరికి చేరుకున్నాక పెద్దవాళ్లు, అత్తలు, బంధువులను కలవడం, పొలాల్లోకి వెళ్లి పల్లీలు కాల్చుకుని తినడం, స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణం, తాజా పాలు, ప్రకృతితో కలిసి గడిపిన ఆ రోజులు… తన చిన్ననాటి జ్ఞాపకాల్లో ప్రత్యేకమైనవని ఆయన గుర్తుచేసుకున్నారు. తన తండ్రి ప్రొఫెసర్‌గా ఎదిగిన ప్రయాణం, కుటుంబంలో చదువుకు ఇచ్చిన ప్రాధాన్యత, అన్నాచెల్లెళ్లతో కలిసి పెరిగిన రోజులు, చిన్నప్పటి నుంచే చూసిన కుటుంబ విలువలు తనపై చూపిన ప్రభావం గురించి కూడా శకీల్ బాషా గారు మనతో మనతో పంచుకున్నారు. ప్రస్తుతం Boeingలో Senior Technical Leadగా పనిచేస్తున్న ఆయన ప్రయాణం వెనుక ఉన్న కుటుంబ నేపథ్యం, చిన్ననాటి అనుభవాలు, తన ఊరితో ఉన్న అనుబంధం గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ పాడ్కాస్ట్ వినండి! మిస్ అవ్వకండి మరి…! No matter how many years pass… the joy of going back to our hometown never really changes! The memories of travelling to his hometown with his father as a child, changing buses along the way, and even walking several kilometres… are still close to his heart. This week on the ‘Maa Ooru’ podcast, Mr. Shakeel Basha takes us through these beautiful childhood memories. Back then, even though reaching his hometown meant changing buses and walking some distance, he would eagerly look forward to the journey. Meeting elders, aunts and relatives after reaching the village, going to the fields and roasting peanuts, enjoying the fresh air and greenery, drinking fresh milk, and spending time close to nature… these are some of the most special memories from his childhood. He also shared stories about his father’s journey as a professor, the importance his family placed on education, growing up with his siblings, and how the family values he experienced from a young age shaped him. Currently working as a Senior Technical Lead at Boeing, Mr. Shakeel Basha takes us through the family background, childhood experiences and deep connection to his hometown that have been part of his journey. Want to know more about his inspiring journey and childhood memories? Make sure to listen to this episode of ‘Maa Ooru’! Don’t miss it…! Guest: Mr. Shakeel Basha Host: Usha #TALRadioTelugu #MaaOoru #ShakilBashaPogaku #Kurnool #Anantapur #ChildhoodMemories #VillageMemories #FamilyValues #CareerJourney #LifeJourney #TALRadio #TouchALifeFoundation

    సెలవులు రాగానే ఊరికి వెళ్ళడం చాలా బాగుండేది! | Mr. Shakeel Basha | మా ఊరు - 82
  8. Sep 17

    మీరు కూడా ధనవంతులు కావచ్చు! | Smart Money Mindset Telugu - 9

    డబ్బు సంపాదించడానికి.. మనం ఎంత కష్టపడుతున్నామన్నది కాదు..మనం ఎలా ఆలోచిస్తున్నామన్నదే చాలా ముఖ్యం! మనలో చాలామందికి ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. చాలా డబ్బు సంపాదించాలి, జీవితంలో ముందుకు వెళ్లాలి, మనకు నచ్చిన పనిని చేయాలి అని అనుకుంటుంటాం. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మన ఆలోచనలు, మనపై మనకున్న నమ్మకం, మన నిర్ణయాలు, మనం చేసే పనులు ఎంత ముఖ్యమో చాలాసార్లు ఆలోచించం. ఇదే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘Think and Grow Rich’ పుస్తకంలోని 13 Principles ద్వారా ఈ Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో ప్రముఖ Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు వివరించారు. మనకు ఏం కావాలో స్పష్టంగా ఎలా నిర్ణయించుకోవాలి, దాన్ని చేరుకోవడానికి ఏం చేయాలో ఎలా ప్లాన్ చేసుకోవాలి, మనపై మనకు నమ్మకం ఎలా పెంచుకోవాలి, మనతో మనం మాట్లాడుకునే విధానం మన ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుంది, మనకు ఉన్న Knowledge‌ను ఎలా ఉపయోగించుకోవాలి, ఆలోచనలను కార్యరూపంలోకి ఎలా తీసుకురావాలి, సరైన నిర్ణయాలు తీసుకోవడం, మధ్య మధ్యలో సమస్యలు వచ్చినా ప్రయత్నాన్ని కొనసాగించడం, మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన ఎదుగుదలపై చూపించే ప్రభావం.. ఇలా మన రోజువారీ జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకోవచ్చు. మన ఆలోచనా విధానం నుంచి మనం తీసుకునే నిర్ణయాల వరకు.. మన జీవితంలో తీసుకునే చిన్నచిన్న నిర్ణయాలు కూడా ఎలా ప్రభావం చూపగలవో తెలుసుకోవడానికి ఈ పాడ్‌కాస్ట్‌ను తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి! How much does the way we think influence the way we move forward in life? Most of us have goals. We want to earn better, grow in life, do meaningful work, or achieve something we have always wanted. But we often overlook how much our mindset, self-belief, decisions, and actions influence the journey towards those goals. In this Smart Money Mindset - Telugu podcast, renowned Financial Educator & Money Mindset Coach Madhavi Latha explores the 13 principles discussed in the popular book ‘Think and Grow Rich.’ From setting clear goals and planning the way forward to developing self-belief, understanding the impact of self-talk, building specialized knowledge, turning ideas into action, making decisions, staying persistent through challenges, and surrounding ourselves with people who contribute to our growth.. this episode covers several practical ideas that can be applied to everyday life. Want to understand how your thoughts, decisions, and actions can influence the way you move forward? Tune in to this episode for some interesting and useful insights. Don’t miss it! Host: Madhavi LathaSource:⁠ https://www.youtube.com/@Smartmoneymindsettelugu⁠ #TALRadioTelugu #SmartMoneyMindset #MoneyMindset #ThinkAndGrowRich #FinancialEducation #PersonalGrowth #Mindset #GoalSetting #SelfDevelopment #SuccessMindset #WealthCreation #FinancialWellness #MoneyManagement #TouchALifeFoundation

    మీరు కూడా ధనవంతులు కావచ్చు! | Smart Money Mindset Telugu - 9

About

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.