The New City Church Podcast - Telugu

New City Church

Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive all the latest updates!

  1. 6d ago

    Total Transformation - పరిపూర్ణ రూపాంతరం

    మీ ఆలోచనా విధానాన్ని ఏది తీర్చిదిద్దుతోంది? దేవుని వాక్యమా లేదా లోక స్వరమా? ఈ పరివర్తనను కలిగించే వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు నిజమైన పరివర్తన మనస్సు మారుటతో ప్రారంభమవుతుందని వెల్లడిస్తున్నారు. రోమీయులకు 12:1–2 మరియు ఇతర లేఖనాల ఆధారంగా, మన ఆలోచనలు మన ఊహలను, నమ్మకాలను, నిర్ణయాలను, క్రియలను, అలవాట్లను, చివరకు మన జీవన విధానాన్ని ఎలా తీర్చిదిద్దుతాయో ఆయన వివరిస్తున్నారు. మీ ఆలోచనలకు మీరు బాధ్యత వహించుకొనుటకు, దేవుని వాక్యంతో మీ మనస్సును రూపాంతరపరచుకొనుటకు, మీ ఆలోచనా విధానాన్ని ఆయన సత్యానికి అనుగుణంగా మార్చుకొనుటకు ఈ సందేశం మిమ్మల్ని సవాలు చేస్తుంది. మీ మనస్సును రూపాంతరపరచుకొని, మీరు ముందుకు సాగి, దేవుడు మీకై ఉంచిన శ్రేష్ఠమైన దానంతటినీ స్వాధీనపరచుకొనుటకు దేవుని వాక్యం మీ జీవితాన్ని మార్చివేయనివ్వండి.

  2. Sep 24

    Faith that Speaks - విశ్వాసం మాట్లాడును

    మీరు వినేది మీ నమ్మకాన్ని రూపొందిస్తుంది. మీరు నమ్మేది చివరికి మీరు ఏమి మాట్లాడతారు, ఎలా జీవిస్తారు అనేదాన్ని నిర్ణయిస్తుంది. ఈ విశ్వాసాన్ని బలపరిచే వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు సువార్తను వినడం ద్వారా విశ్వాసం ఎలా అభివృద్ధి చెందుతుందో, అలాగే, విశ్వాస మూలముగా నీతిమంతులైన వారు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కాకుండా, దేవుని వాక్యంతో ఏకీభవిస్తూ ఎలా మాట్లాడుతారో తెలియజేస్తున్నారు. దేవుని వాక్యం మీ హృదయంలోనే కాకుండా మీ నోటిలో కూడా బలంగా నాటబడి ఉండాల్సిన అవసరం ఎందుకు ఉందో, దేవుడు వాగ్దానం చేసిన వాటిని ముందుకు సాగి స్వాధీనం చేసుకునేలా విశ్వాసం మిమ్మల్ని ఎలా సిద్ధం చేస్తుందో నేర్చుకోండి. ఈ సందేశాన్ని విని, దేవుని వాక్యానికి అనుగుణంగా మీ విశ్వాసం మాట్లాడేలా నేర్చుకోండి!

  3. Sep 22

    Walking In The Light - వాక్యపు వెలుగు

    మీరు జీవిస్తున్న క్రైస్తవ జీవితంతో మీరు విసుగు చెందియున్నారా? దేవునికి సంబంధించిన కార్యాలలో నమ్మకంగా పాల్గొంటూ, క్రమంగా సంఘానికి హాజరవుతూ, స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఇవ్వడంలో మరియు సంఘ పరిచర్యలో సేవ చేస్తూ ఉన్నప్పటికీ, ఇవన్నీ చివరికి ప్రయోజనం లేకుండా పోతున్నాయేమో అని మీరు అనుకోవడం ప్రారంభించారా? బైబిలు ఆధారాలను చూపిస్తూ, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, మోసం మనలో ఈ నిరాశకు ఎలా కారణమవుతుందో వివరిస్తున్నారు. మనం విన్న దేవుని వాక్యాన్ని వెంటనే ఆచరణలో పెట్టినప్పుడు, దేవుడు మన కోసం ఉద్దేశించిన మంచి జీవితాన్ని అనుభవించగలమని ఆయన చూపిస్తున్నారు. మీకు తెలిసి కూడా ఇంకా ఆచరణలో పెట్టని ఆ ఒక్క విషయం ఏమిటి? ఈ రోజే పరిశుద్ధాత్మ సహాయం కోరండి. మీరు పొందిన వెలుగును స్వీకరించి, దేవుడు మీకు చూపించిన దానిపై చర్య తీసుకోండి. అప్పుడు ముందుకు సాగుతూ, దేవుడు మీ కోసం సిద్ధం చేసిన సమస్తంలోకి ప్రవేశిస్తారు.

  4. Sep 8

    Righteousness Revealed - నీవు దేవుని నీతివై ఉన్నావు

    మళ్లీ మళ్లీ అదే పాపంలో పడిపోతూ, ఇక ఎప్పటికీ దాని నుండి విడుదల ఉండదేమో అన్నట్లుగా అనిపిస్తుందా? మీరు ఎదురుచూస్తున్న విడుదల, మీరు ఇప్పటికే క్రీస్తులో ఎవరైయున్నారో అర్థం చేసుకోవడం నుంచే ప్రారంభమైతే ఎలా ఉంటుంది? ఈ సందేశంలో పాస్టర్ బెన్ కొమానపల్లి జూనియర్ గారు నీతి గురించిన సత్యాన్ని బయలుపరుస్తూ, దేవుని వాక్యంలోని సత్యం మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉండే పాపపు చక్రాల నుండి మిమ్మల్ని పూర్తిగా, ఒక్కసారిగా విడుదల చేయగలదనే విషయాన్ని బోధిస్తున్నారు.  మీ మంచి పనుల వలన కాదు కానీ క్రీస్తు చేసిన పరిపూర్ణ కార్యం వలననే మీరు దేవుని దృష్టిలో నీతిమంతులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేయబడ్డారనే జీవితాన్ని మార్చే సత్యాన్ని తెలుసుకోండి. గొప్ప విడుదలలు మీ జీవితంలో నిజమైన అనుభవాలుగా మారును గాక. మీరు నీతిలో నడుస్తూ, యేసుతో కలిసి మరియు యేసు వలె పరిపాలిస్తూ, రాజ్యమేలుతూ, దేవుని ఉద్దేశాలలో ముందుకు సాగుతూ, ఆయన మీ కొరకు కలిగియున్న సమస్తాన్ని స్వాధీనం చేసుకునే జీవితం మీలో సులభమైన వాస్తవంగా మారును గాక!

  5. Sep 1

    How to Receive Your Harvest - నీ పంటను ఎలా పొందుకోవాలి

    ప్రతి పంట ఒక విత్తనంతో ప్రారంభమవుతుంది. మీరు నాటే విత్తనం ఎటువంటిదో, చివరకు మీరు కోయబోయే పంట కూడా అలాంటిదే అయి ఉంటుంది. ఈ విలువైన బోధనలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు పంటకు సంబంధించిన మూడు ముఖ్యమైన సూత్రాలను వివరిస్తున్నారు: మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు, మీరు విత్తిన దాని కంటే ఎక్కువగా కోస్తారు, మరియు మీరు విత్తిన తర్వాతనే కోస్తారు. విత్తనం, విత్తేవాడు, నేల అనే ఉదాహరణల ద్వారా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో విత్తడం మరియు దాని ఫలసంపదను అడ్డుకునే ప్రతి విషయం నుంచి దానిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఆయన తెలియజేస్తున్నారు. మీరు ఏమి వింటున్నారు, ఏమి నమ్ముతున్నారు, మరియు మీ హృదయంలో ఏది వేరూనుకునేందుకు అనుమతిస్తున్నారు అనే విషయాల్లో ఉద్దేశపూర్వకంగా ఉండటానికి ఈ సందేశం మీకు సహాయపడుతుంది. అలాగే, మీరు విత్తే విధానంలో పరిశుద్ధాత్మ నడిపింపుపై ఆధారపడటం నేర్పిస్తుంది. విశ్వాసంతో విత్తండి, విత్తనాన్ని కాపాడండి, మీ పంట కోసం సిద్ధపడండి.

  6. Aug 17

    Made To Look Like Christ - నీలో ఉన్నవాడు (Pastor Arpitha Komanapalli)

    అదే సమస్యతో మీరు పదేపదే పోరాడుతూ ఉన్నారా? మీరు ఎవరిని పోలి ఉన్నారో తెలుసుకోవడం ద్వారా ఆ పోరాటాన్ని ఆపగలరని మీకు తెలుసా? నూతన సృష్టి వాస్తవాల శ్రేణిలో భాగంగా, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు, తన ప్రతి బిడ్డ ఎలా యేసును పోలి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, సరైన ఆలోచన సరైన జీవనానికి ఎలా పునాది అవుతుందో, మీ మాటలు మీ జీవితాన్ని ఎలా మలుస్తాయో, అలాగే మీలో నివసిస్తున్న గొప్పవాడైన క్రీస్తును పోలి నడవడానికి మీరు తీసుకోవాల్సిన ఆచరణాత్మక మెట్లను ఈ సందేశంలో బోధించుట కొనసాగిస్తున్నారు. ఈ సందేశాన్ని వింటూ, దేవుడు మీ కోసం సిద్ధం చేసిన ప్రతి దానిలోనికి ముందుకు సాగి, దానిని స్వాధీపరచుకోవడానికి ఆయన సహాయాన్ని స్వీకరిస్తూండగా, మీలో ఉన్న గొప్పవాడైన క్రీస్తును ఈ లోకం మీలో చూచును గాక!

  7. Aug 10

    Made New - నూతన సృష్టి (Pastor Arpitha Komanapalli)

    దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో, అంటే నూతన సృష్టిగా, మిమ్మల్ని మీరు చూసుకోవడం ప్రారంభించినప్పుడు మీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఈ పరివర్తనాత్మక బోధనలో, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు క్రీస్తులో విశ్వాసికి ఉన్న నూతన గుర్తింపు యొక్క వాస్తవాన్ని వివరిస్తున్నారు. నూతన నిబంధనలోని సత్యం ద్వారా, దేవునిచే సృష్టించబడినవారిగా, ఆత్మ ద్వారా జన్మించినవారిగా ఉండటం అంటే ఏమిటో, అలాగే నూతన సృష్టిగా దేవుని స్వభావాన్నే కలిగియుండడం అంటే ఏమిటో తెలుసుకోండి. తరతరాలుగా దాచబడిన, కానీ ఇప్పుడు క్రీస్తులో ప్రత్యక్షపరచబడిన ఆ మర్మాన్ని ఈ సందేశం వెల్లడిస్తుంది. అలాగే, మీరు నూతన సృష్టి అనే వాస్తవాన్ని నిరంతరం గుర్తుచేసుకుంటూ మీ మనస్సును నూతనపరచుకోవడం, మీరు ప్రార్థించే విధానాన్ని, జీవించే విధానాన్ని, దేవునితో నడిచే విధానాన్ని ఎలా మారుస్తుందో వివరిస్తుంది. ఈ సందేశాన్ని విని, క్రీస్తులో మీరు ఎవరైయున్నారో అన్న స్పృహలో నూతనపరచబడబడండి.

About

Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive all the latest updates!