Mak Talks

Manikanta Kamatam Gurukulam Acharya

Happy Morning Friends, I am Manikanta Kamatam Gurukulam Acharya, Learning & Volunteering Coach, Positive Psychologist, International Trainer, Psychotherapist, Life Coach and Counsellor. More about me at www.bit.ly/Manikantakamatam

  1. 06/04/2025

    Yogandhra 2025 Song by Manikanta Kamatam Gurukulam Acharya

    Yogandra 2025 Song by Manikanta Kamatam Gurukulam Acharya వందే........మా........ తరమ్! ||5|| చలే చలే చల్! చలే చలే చల్!! చలే చలే చల్!!! భారత్ వాసి! లగే లగే రహ్! లగే లగే రహ్!! లగే లగే రహ్!!! దేశ్ కొ అపనీ! ||చలే|| ఇస్ ఆజాదీ దేశ్ కి అపనీ! ఇస్ జీవన్ కి సపనోంసే హమ్!! ఆజాదీకి అమృతోత్సవ్ హై! అయుష్మాన్ కి భారత్ బల్ హై!! ||చలే|| పతంజలికి యోగసూత్ర్ సే! మహర్షి జన్ కి సిద్ది యోగ్ సే!! కృష్ణమాచార్య మాడ్రన్ యోగా! కృష్ణ పట్టాభి అష్టాంగ యోగా!! ||చలే|| సద్గురు ఇచ్చిన ఇషా యోగా! పరమహంసుని క్రియా యోగా!! కర్మయోగమే భక్తి యోగమై! జ్ణాన యోగమే రాజయోగమై!! ||చలే|| ఓం......యోగాంద్రాయనమ: సర్వ ఆరోగ్యాంద్రాయనమ: ఆనందమయాంద్రాయనమ: సర్వసురక్షితాంద్రాయనమ: I love Yoga. We love Yoga. We do yoga. We live yoga. Our Lifestyle is Yoga. జై బోలో భారత్ మాతా కీ జై! జై జై బోలో భారత్ మాతా కీ జై!! జై జయ జయ జయ జయ జై బోలో భారత్ మాతా కీ జై హింద్!!!

    5 min
  2. 09/23/2024

    జోగిని - Skit

    జోగిని - Skitఉపోద్ఘాతం - క్రీ.శ. 10వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో దేవాలయాల్లో, దైవ సన్నిధిలో నాట్యనివేదనకై నియమింపబడిన దేవుని దాసులే దక్షిణ భారత దేశంలో దేవదాసిలై, తెలుగు రాష్ర్టాలలో జోగినిలై, కేరళలో మాతంగిలై, అభం శుభం ఎరుగని అయిదేళ్ల వయసులో జీవితాన్ని దైవసన్నిధిలో, దైవం ముసుగులో ఎన్నో అరాచకాలకు బలైపోయాయి పసిప్రాయాలు. ఇది కేవలం భారత దేశంలోనే కాదు మన పొరుగు దేశాలైన శ్రీలంక, బాంగ్లాదేశ్, పాకిస్థాన్ లోనూ, మలేషియా, థాయిలాండ్ లోనూ, ఇండోనేషియా లో దేవీ-దేవీ అని, కాంబోడియా లో అప్సరసలని, నేపాల్ లో దేవికి లేని, చైనా మరియు రోమ్ లో ఆలయ వేశ్యలని, ఆఫ్రికా లో ట్రొపీజెన్నాస్ అని, జపాన్ లో గెయిషా లని, కొరియా లొ కిసాంగ్ అని, గ్రీస్ లో హిరోడల్సని పిలువబడే ఈ దురాచారాలు ఎన్నో ఏళ్లుగా ఎందరో పసిపాపలు, మరెందరో యువతులు, ఇంకెందరో మహిళలు తరతరాలుగా తమ మానప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికీ కోల్పోతున్నారు. అటువంటి ఓ చిన్నారి చిన్ని కథే మా యీ జోగిని. ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదు. చరిత్ర పుటల్లో నుంచి పుట్టుకొచ్చిన బాధల వ్యధలే మా యీ గాథ. ఇది ఎవరి మనస్సునైనా నొప్పించినట్లున్ననూ, ఎవరి జీవితానికైనా దగ్గరగా ఉన్నట్లున్ననూ సాదరాభిమానంతో మన్నించి మా యీ చిన్న ప్రయత్నానికి ప్రోత్సాహాన్నిస్తారని ఆశిస్తూ......నాటక సమయం - అయిదు నిమిషాలు పాత్రలు - అమ్మ, అయ్య, చిన్ని, మల్లి, విజయ్, స్వామిస్టేజి - ఎడమ వైపు చిన్ని ఇల్లు, అయ్య బుట్టలు అల్లడం, అమ్మ ఇంటి పని చేయడం, చిన్ని జామకాయలు కోయడం. మధ్యలో గుడి, గుడి లో సామి పూజలు చేయడం, బయట కాళ్లు లేని మల్లిగాడు డోలు వాయించడం. కుడివైపు గ్రామం పొలిమేరల్లో డాక్టర్ విజయ్ రావడం డాక్టర్ విజయ్ - నేనిప్పుడే ఊర్లోకొస్తున్నానమ్మా. దారి తెలియట్లేదు. ఎవరయ్యా నువ్వు? కళ్లు కనిపించట్లేదా? ఇలా మీద పడుతున్నావు? మల్లి - మన్నించండి సారు, నాకు నిజంగానే కళ్లు కనిపించట్లేదు. డాక్టర్ విజయ్ - అరేయ్ మల్లి, ఏమైందిరా? నేను నీ చిన్ననాటి స్నేహితుడు విజయ్ ని. పట్నం లో బాగా చదివి పెద్ద డాక్టర్ అయ్యాను. ఇదో మన ఊరికే వచ్చాను. అసలు నీకళ్లకేమైంది రా? మల్లి - ఏం సెప్పమంటావు, యిజయా. ఒక్కసారి నువ్వే చూడు. సామి - ఓం భీం బుష్ “3” అమ్మ - సిన్నీ......ఓ.....సిన్నీ.......యాడబోయి సచ్చినావే ? కూడు తిందువురా? అయ్య - ఎందుకే దాన్నెలా తిడతావు? యాడో ఆడుకుంటాంటదిలే. ఆకలైతే అదే వస్తది. చిన్ని - పో అమ్మా. నేను జాంకాయలు కోసుకుంటాండా. అమ్మ - జాంకాయలా? పాడా? వచ్చానంటే యీపు యిమానమైపోతుంది. (అని కర్ర తీసుకుంటుంది) అయ్య - ఎందుకే దాన్ని గదురుకుంటావు. పోనీయే! అమ్మ - నువ్వూరుకోవయ్యా. నీకేం తెల్వదు. ఒసేయ్ ! యాడ బడి సచ్చినావే? వస్తాండా ఉండు. చిన్ని - ఈ జాంకాయలు మల్లి మామకిద్దాం. పాపం, ఏమన్నా తిన్నాడో లేదో. మల్లి మామా? మల్లి మామా? మల్లి - సిన్నీ. నా బంగారు తల్లీ. ఏమైందమ్మా. పొద్దుగూకాక, ఇప్పుడొచ్చావేంది. అమ్మ అయ్య బెంగ పెట్టుకుంటారు కదే, ఇంటికెళ్లమ్మా. చిన్ని - నేనెళ్తాలే మామా! ఇగో ఈ జాంకాయలు తిను. ఏమన్నా తిన్నావో లేదో. ఇందా తిను. మల్లి - యాడ పుట్టానో తెలీదు. యెవరికి పుట్టానో కూడా తెలీదు. ఈ అనాథను , అవిటోడ్ని, రోజూ తిన్నానా లేదా అసలున్నానా లేదా అని ఆలోచించే మాయమ్మవి నువ్వే సిన్నీ. చిన్ని - నేనున్నంతవరకు నువ్వు అనాథవేంది మామా? నేను నిన్ను సూసుకుంటా. అదో అమ్మ అరుస్తోంది. ఇంటికేళ్తామరి. (దార్లో సామి దొంగతనం చూసి భయపడి ఇంటికెళ్ళి పడిపోతుంది) అయ్య - సిన్నీ....సిన్నీ...... ఏమైందమ్మా? ఏం జరిగిందే? చిన్ని - అమ్మ....అయ్య.....అమ్మ......అయ్య....... అమ్మ - అయ్యయ్యో నా బిడ్డకి ఏమో అయిందే. అయ్యో. నీకెన్నిసార్లు సెప్తినే బయట తిరుగద్దని. యిని సస్తివా? యిప్పుడు నేనేం సేసేదిరా దేవుడా దేవుడా? అయ్య - అసలే బిడ్డ ఏందో సూసి బయపడతాంటే, యింకా బయపెడతావేందే? అమ్మ - నువ్వూరుకోవయ్యా, నీకేం తెల్వదు. ఆ సాములోరే ఏదో ఒకటి సేస్తారు. పదా గుడికి పోదాం. అయ్య - సామి! సామి! నా బిడ్డ చీకట్లో ఏందో సూసి భయపడినాది. మాట రావట్లేదు సామి. సామి - ఓం భీం బుష్. నీ బిడ్డకి దెయ్యం పట్టిందిరా! దీనికి ఒక్కటే విరుగుడు. అయ్య - దెయ్యమేంది సామి! అమ్మ - నువ్వూరుకోవయ్యా, నీకేం తెల్వదు. మీరు సెప్పండి సామి. మేమేం సెయ్యాలి. సామి - నీ బిడ్డని బాగు సేస్తాను. కానీ....... అయ్య - కానీ ఏంది సామి? అమ్మ - నువ్వూరుకోవయ్యా, నీకేం తెల్వదు. మీరు సెప్పండి సామి. మేమేం సెయ్యాలి. సామి - ఓం భీం బుష్. నీ బిడ్డని బాగు సేశాక, నీ బిడ్డని జోగిని సెయ్యాల. అయ్య - జోగిని అంటే ఏంది సామి? అమ్మ - నువ్వూరుకోవయ్యా, నీకేం తెల్వదు. మీరు సెప్పండి సామి. మేమేం సెయ్యాలి. సామి - జోగిని అంటే దేవదాసి రా. దేవుని భార్య. ఇక్కడే ఉండా

    10 min

About

Happy Morning Friends, I am Manikanta Kamatam Gurukulam Acharya, Learning & Volunteering Coach, Positive Psychologist, International Trainer, Psychotherapist, Life Coach and Counsellor. More about me at www.bit.ly/Manikantakamatam