TALRadio Telugu

Touch A Life Foundation

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

  1. 1d ago

    పేదరికం నుండి పేద విద్యార్థులకు తోడుగా... | Maheshwaram Lakesh | CHARCHA With Real Leader - 13

    ఒకప్పుడు రోజూవారి కూలీ కోసం పనిచేసిన ఓ విద్యార్థి... ఇప్పుడు వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారు! పేదరికం, కుటుంబ కష్టాలు, చదువుకోడానికి చేసిన పోరాటం... ఇలాంటి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగిన మహేశ్వరం లకేష్ గారు, ఇప్పుడు Manu's HHOC ఆర్గనైజేషన్ ద్వారా ఎంతో మందికి తోడుగా నిలుస్తున్నారు. తన చిన్ననాటి అనుభవాలు తనలోని సేవా గుణాన్ని ఎలా పెంచాయి? చదువు జీవితాన్ని ఎలా మార్చగలదు? అనాథ పిల్లలు, వృద్ధులు, విద్యార్థులు, అత్యవసర సహాయం అవసరమైన వారికి ఎలా తోడుగా నిలుస్తున్నారు? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు. ఒక వ్యక్తికి లభించిన అవకాశం... వేలాది మందికి ఆశగా ఎలా మారిందో తెలుసుకోవడానికి ఈ పాడ్కాస్ట్ ను తప్పక వినండి. South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో... Manu's HHOC ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు లకేష్ మహేశ్వరం గారి స్ఫూర్తిదాయక సేవా ప్రయాణం... వారి మాటల్లోనే మీకోసం! A student who once worked as a daily wage laborer to support his education... is now transforming the lives of thousands! Despite facing poverty, family hardships, and constant struggles to continue his studies, Maheshwaram Lokesh never gave up on his dreams. Today, through the Manu's HHOC Organization, he is making a meaningful difference in the lives of many people. How did his childhood experiences shape his passion for service? How can education change a person's life? How is he supporting orphaned children, elderly people, students, and those in urgent need of help? He shares these inspiring experiences and many more in this podcast. Don't miss this powerful conversation to learn how one opportunity in a person's life can grow into a source of hope for thousands. As part of the "Charcha With Real Leaders" series presented by TALRadio in association with South India’s CSR Summit... Listen to the inspiring service journey of Maheshwaram Lokesh, Founder of Manu's HHOC Organization, in his own words. Guest: Maheshwaram Lokesh Host: Vinil Reddy #TALRadio #CharchaWithRealLeaders #LakeshMaheswaram #ManusHHOC #SocialService #NGO #NGOIndia #CommunityService #HelpingHands #InspiringJourney #RealLeaders #SupportTheNeedy #OrphanCare

    పేదరికం నుండి పేద విద్యార్థులకు తోడుగా... | Maheshwaram Lakesh | CHARCHA With Real Leader - 13
  2. 2d ago

    తల్లిదండ్రులు - పిల్లలు... మధ్య దూరం ఎందుకు? | Shazia Parveen | Health Talk

    ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట ఎందుకు వినడం లేదు? కుటుంబాల మధ్య దూరాలు ఎందుకు పెరుగుతున్నాయి? Generation Gap నిజంగానే సమస్యా... లేక ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడమే కారణమా? ప్రముఖ Psychologist, Global Trainer, Researcher షాజియా పర్వీన్ గారు ఈ అంశాలపై ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ఎంత ముఖ్యమో చెప్తూ… సమస్యల గురించి బాధపడటం కంటే వాటికి పరిష్కారాలు వెతకాలని, పిల్లలకు కేవలం లక్ష్యాలు మాత్రమే కాదు... మంచి Mentors, సరైన వాతావరణం కూడా అవసరమని చెప్పారు. కుటుంబ బంధాలు, పేరెంటింగ్, యువత భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే ఈ podcast ను తప్పక వినండి. మిస్ అవ్వకండి! Why are children today not listening to their parents?Why are distances growing within families?Is the generation gap really the problem, or is it simply a lack of understanding between one another? Renowned Psychologist, Global Trainer, and Researcher Shazia Parveen shares valuable insights on these important issues. She explains the importance of proper guidance for children and emphasizes that instead of worrying about problems, we should focus on finding solutions. She also highlights that children need not only goals but also good mentors and a supportive environment to thrive. This thought-provoking podcast explores family relationships, parenting, and the future of today’s youth. Don’t miss it! Guest: Shazia Parveen Host: Adarsh Kumar #TALRadio #SpecialInterview #ShaziaParveen #FamilyRelationships #Parenting #GenerationGap #YouthDevelopment #FamilyBonding #MentalHealth #TouchALifeFoundation

    తల్లిదండ్రులు - పిల్లలు... మధ్య దూరం ఎందుకు? | Shazia Parveen | Health Talk
  3. 3d ago

    సేవతోనే జీవితానికి సార్థకత | CHARCHA With Real Leader | Namratha Datta

    కెరీర్‌ గ్రోత్‌తో పాటు మానసిక ప్రశాంతతను కూడా పొందాలంటే ఏం చెయ్యాలి? 28 ఏళ్లకు పైగా కార్పొరేట్ రంగంలో పనిచేసిన నమ్రతా దత్తా గారు, ఉద్యోగ జీవితంలో వచ్చిన ఒత్తిడి, టెన్షన్ మధ్య ధ్యాన్ ఫౌండేషన్ ద్వారా యోగా, ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేశారు. ఆ ప్రయాణం తన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, తన ఆలోచనలు మరియు జీవన విధానాన్ని ఎలా ప్రభావితం చేసింది అనే విషయాలను ఈ పాడ్కాస్ట్‌లో మనతో పంచుకున్నారు. యోగ అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది మన మనసును, శరీరాన్ని, ఆలోచనల మధ్య సమతుల్యతను తీసుకువచ్చే జీవన విధానమని ఆమె వివరించారు. అలాగే ధ్యాన్ ఫౌండేషన్ చేపడుతున్న జంతు సంరక్షణ, విద్య, పర్యావరణ పరిరక్షణ, ఆహార పంపిణీ వంటి ఎన్నో సేవా కార్యక్రమాల గురించి కూడా ఆసక్తికర విషయాలను మనతో పంచుకున్నారు. South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో... ధ్యాన్ ఫౌండేషన్ వాలంటీర్, కార్పొరేట్ లీడర్ నమ్రతా దత్తా గారి స్ఫూర్తిదాయక ప్రయాణం... వారి మాటల్లోనే మీకోసం! How can we achieve mental peace along with career growth? With over 28 years of experience in the corporate world, Namratha Datta shares how she turned to yoga, spirituality, and selfless service through Dhyan Foundation while navigating the pressures and stress of professional life. In this podcast, she talks about the transformation this journey brought to her life, mindset, and overall approach to living. She explains that yoga is much more than physical exercise—it is a way of life that helps bring balance to the mind, body, and thoughts. She also shares insights into the impactful work of Dhyan Foundation, including animal welfare, education, environmental conservation, food distribution, and various humanitarian initiatives. As part of "Charcha With Real Leaders," presented by TALRadio in association with South India’s CSR Summit... Listen to the inspiring journey of Namratha Datta, Corporate Leader and Volunteer at Dhyan Foundation, in her own words. Guest: Namratha DattaHost: Vinil Reddy #TALRadio #CharchaWithRealLeaders #NamrathaDatta #DhyanFoundation #Yoga #Spirituality #Leadership #CorporateLeadership #SanatanaKriya #Mindfulness #PersonalGrowth #CSR #SouthIndiaCSRSummit #TeluguPodcast #InspiringLeaders #TALRadioTelugu

    సేవతోనే జీవితానికి సార్థకత | CHARCHA With Real Leader | Namratha Datta
  4. 5d ago

    "ఆమె" కు అండగా సయోధ్య హోమ్ | CHARCHA With Real Leader - 12

    "ఇక నా జీవితం ఇంతే" అని అనుకున్న ఎంతోమంది మహిళలకు... "ఇంకా జీవితం ఉంది" అనే నమ్మకాన్ని అందిస్తోంది ‘సయోధ్య హోమ్’…! గృహహింస, కుటుంబ సమస్యలు, అవమానాలు.. ఇలాంటి ఎన్నో కష్టాలతో జీవితంపై నమ్మకం కోల్పోతున్న మహిళలకు అండగా నిలుస్తూ... మళ్లీ ధైర్యంగా జీవించేలా చేస్తోంది… 2010 నుంచి ఎంతో మంది మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ… ఈ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఎదుర్కొనే తీరు.. ఇలాంటి ఎన్నో విషయాలను ఈ సంస్థ ఫౌండర్ మృదుల గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు. ప్రతి మహిళ గౌరవంగా జీవించే హక్కుల గురించి ఆమె చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో... Sayodhya Home for Women వ్యవస్థాపకురాలు మృదుల గారి స్ఫూర్తిదాయక సేవా ప్రయాణం... వారి మాటల్లోనే మీకోసం! For many women who felt, "This is the end of my life," Sayodhya Home has given a new hope... "There is still life ahead." Standing beside women facing domestic violence, family conflicts, emotional abuse, and difficult life situations, Sayodhya Home has been helping them rebuild their confidence and move forward with dignity. Since 2010, the organization has provided shelter and support to numerous women. In this podcast, Founder Ms. Mridula shares her journey, the experiences she has encountered, the challenges women face today, and the ways they can overcome them. Her thoughts on every woman's right to live with dignity and self-respect are truly thought-provoking. As part of "Charcha With Real Leaders", presented by TALRadio in association with South India’s CSR Summit, listen to the inspiring service journey of Ms. Mridula, Founder of Sayodhya Home for Women, in her own words. Guest: Mrudula Vemulapati Host: Vinil Reddy #TALRadio #CharchaWithRealLeaders #MrudulaVemulapati #SayodhyaHome #WomenEmpowerment #WomenRights #RealLeaders #WomenSupport #DomesticViolenceAwareness #WomenShelter #SocialImpact #SocialChange #WomenLeadership #InspiringWomen #WomenWithCourage #HopeAndHealing #TALRadioTelugu #TouchALifeFoundation

    "ఆమె" కు అండగా సయోధ్య హోమ్ | CHARCHA With Real Leader - 12
  5. 6d ago

    ఒక్క అడుగు... మీ ఆర్ధిక స్థితిని మార్చేస్తుంది! | Smart Money Mindset Telugu - 1

    సంపాదన అంటే కేవలం డబ్బు చేతికి రావడం మాత్రమే కాదు... "నేను కూడా చేయగలను" అనే ధైర్యం రావడం, మన అవసరాలకు ఎవరిపైనా ఆధారపడకుండా ఉండగలగడం…! ఈరోజుల్లో చాలామంది మహిళలు, గృహిణులు, కుటుంబ బాధ్యతలు చూసుకునేవారు తమ సమయాన్ని, శ్రమను అందరి కోసం కేటాయిస్తుంటారు. కానీ తమ సొంత ఆదాయం గురించి ఆలోచించినప్పుడు మాత్రం ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియక ఆగిపోతారు. మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈ Smart Money Mindset - Telugu పాడ్కాస్ట్ మీ కోసమే! డబ్బును ఎలా ఖర్చు చేయాలి? ఎలా సేవ్ చేసుకోవాలి? ఆర్థికంగా ఎలా ముందుకు వెళ్లాలి? ఇలాంటి ఎన్నో విషయాలపై ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవి లత గారు ఎన్నో ఉపయోగకరమైన సూచనలు అందించారు. అలాగే, తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే కొన్ని మంచి బిజినెస్ ఐడియాస్ ను కూడా మనతో పంచుకున్నారు. బహుశా మీరు వెతుకుతున్న ఆ అవకాశం ఈ పాడ్కాస్ట్ లోనే దొరకొచ్చు… మిస్ అవ్వకుండా వినండి మరి! Earning is not just about having money in your hands... it's about gaining the confidence to say, “I can do this too,” and being able to meet your own needs without depending on others. Today, many women, homemakers, and caregivers dedicate most of their time and effort to their families. But when it comes to earning their own income, they often don’t know where or how to begin. Have you ever felt the same way? Then this Smart Money Mindset - Telugu podcast is for you! In this episode, renowned financial advisor Madhavi Latha shares practical insights on managing money, spending wisely, building savings, and becoming financially independent. She also discusses several business ideas that can be started with a small investment. Who knows? The opportunity you’ve been looking for might be hidden in this conversation. Don’t miss this inspiring and informative podcast! Host: Madhavi Latha Source: https://www.youtube.com/@Smartmoneymindsettelugu #TALRadioTelugu #SmartMoneyMindsetTelugu #MadhaviLatha #FinancialAdvisor #WomenEmpowerment #FinancialFreedom #FinancialLiteracy #MoneyManagement #SavingsTips #PersonalFinance #WomenInBusiness #BusinessIdeas #SmallBusinessIdeas #FinancialPlanning #WomenEntrepreneurs #Entrepreneurship #IncomeGeneration #TALRadio #TouchALifeFoundation

    ఒక్క అడుగు... మీ ఆర్ధిక స్థితిని మార్చేస్తుంది! | Smart Money Mindset Telugu - 1
  6. 6d ago

    సమాజ సేవతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది! | స్ఫూర్తి కిరణాలు | Arun Daniel | Youngistaan Foundation

    యువతలో సేవాభావం పెరిగితే… సమాజంలో ఎంతో మార్పు తీసుకురావచ్చని నమ్మిన వ్యక్తి... అరుణ్ డేనియల్ గారు! ఆ ఆలోచనతోనే Youngistaan Foundationను ప్రారంభించి, వేలాది మంది యువతను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు. విద్య, మహిళా సాధికారత, ఆకలి నివారణ, పర్యావరణ పరిరక్షణ, విపత్తుల సహాయక చర్యలు వంటి అనేక రంగాల్లో ఆయన టీం సేవలందిస్తోంది. అసలు ఈ సేవా ప్రయాణం ఎలా మొదలైంది? Youngistaan అనే పేరు వెనుక ఉన్న కథ ఏమిటి? యువతలో మార్పు తీసుకురావాలంటే ఏం చేయాలి? సమాజ సేవలో ఆయన నేర్చుకున్న పాఠాలు ఏమిటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వారం "స్ఫూర్తి కిరణాలు" పాడ్కాస్ట్ లో అరుణ్ డేనియల్ గారు మనతో పంచుకున్నారు. తప్పకుండా వినండి! Arun Daniel is a firm believer that when young people embrace the spirit of service, they can create meaningful and lasting change in society. Driven by this vision, he founded Youngistaan Foundation, an organization that has inspired and engaged thousands of youth in social impact initiatives. Through its work in education, women’s empowerment, hunger relief, environmental conservation, and disaster response, the foundation has been making a difference in the lives of many communities. How did this journey of service begin? What is the story behind the name Youngistaan? What does it take to inspire young people to become changemakers? And what are some of the most valuable lessons Arun Daniel has learned through his years of social service? In this week’s episode of "Sphoorthi Kiranalu" Podcast, Arun Daniel shares his inspiring journey, experiences, and insights on youth leadership, volunteerism, and creating social impact. Tune in and don't miss this inspiring conversation! Guest: Arun Daniel Host: Adarsh Kumar #TALRadioTelugu #ArunDaniel #YoungistaanFoundation #SphoorthiKiranalu #YouthLeadership #YouthForChange #SocialImpact #Volunteerism #CommunityService #SocialWork #YouthEmpowerment #WomenEmpowerment #DisasterRelief #Changemakers #TALRadio #TouchALifeFoundation

    సమాజ సేవతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది! | స్ఫూర్తి కిరణాలు | Arun Daniel | Youngistaan Foundation
  7. 6d ago

    మనసుని తాకే రోజూవారీ కథలు... దీప్తి ముచ్చట్లు | మన రచయితలు | Season - 2 | Episode - 5

    మధురవాణి... విదేశాల్లో ఉంటున్న తెలుగు రచయితలకు ఒక వేదిక... ఆ వేదిక వెనుక ఉన్న రచయిత్రి... దీప్తి పెండ్యాల గారు! ఐటీ రంగంలో పనిచేస్తూనే రచనా రంగంలో తన ఆసక్తిని కొనసాగిస్తూ, మనోవైరి, బతుకుతోవలు, నడిచే దారుల్లో, ముసుగు వంటి రచనలతో ఎంతో మంది పాఠకులను ఆలోచింపజేస్తున్నారు. ప్రవాస జీవితాన్ని, వ్యక్తిగత అనుభవాలను, తన చుట్టూ ఉన్న మనుషుల కథలను రచనలుగా మలుచుకుంటూ 'దీప్తి ముచ్చట్లు' పేరుతో ఆమె సాగించిన సాహిత్య ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. అదే సమయంలో "మధురవాణి" అనే ఆన్లైన్ మ్యాగజైన్ ద్వారా తెలుగు రచయితలకు, పాఠకులకు ఒక వేదికను అందిస్తూ సాహిత్య సేవ చేస్తున్నారు. మరి... చిన్నప్పటి నుంచి చదువుపై, సాహిత్యంపై ఆమెకు ఆసక్తి ఎలా పెరిగింది? అమెరికా ప్రయాణం ఎలా మొదలైంది? మధురవాణి పత్రికను ఎలా ప్రారంభించింది? ఉద్యోగం, కుటుంబ బాధ్యతల మధ్య రచనకు సమయం ఎలా కేటాయిస్తున్నారు? ప్రవాస జీవితంలో ఎదురైన అనుభవాలు ఆమె రచనల్లో ఎలా ప్రతిబింబించాయి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వారం "మన రచయితలు" పాడ్కాస్ట్ లో దీప్తి పెండ్యాల గారు మనతో పంచుకున్నారు. తప్పకుండా వినండి... మిస్ అవ్వకండి! Madhuravani...A platform for Telugu writers living across the world...And the woman behind that platformDeepthi Pendyala! While working in the IT industry, Deepthi has continued to nurture her passion for literature and writing. Through works such as Manovairi, Batukuthovalu, Nadiche Daarullo, and Musugu, she has inspired readers to reflect on life, relationships, and society. Drawing from her experiences as an immigrant, her personal journey, and the stories of people around her, she has built a unique literary path through her writings and her popular series, "Deepthi Muchatlu." At the same time, she has been serving the Telugu literary community through "Madhuravani," an online magazine that provides a platform for Telugu writers and readers across the globe. How did her love for reading and literature begin in childhood? How did her journey to the United States start? What inspired her to launch Madhuravani? How does she balance writing with her professional career and family responsibilities? And how have her experiences as a Telugu woman living abroad influenced her writing? In this week’s episode of "Mana Rachayitalu" Podcast, Deepthi Pendyala shares her inspiring journey, literary experiences, and thoughts on writing, culture, and life. Tune in and don't miss this insightful conversation!  Guest: Deepthi Pendyala Host: Renu Sree #TALRadioTelugu #DeepthiPendyala #Madhuravani #ManaRachayitalu #TeluguWriter #TeluguLiterature #TeluguBooks #TeluguMagazine #MadhuravaniMagazine #WriterInterview #TeluguStories #TeluguCulture #LiteraryTalks #DeepthiMuchatlu #PodcastInterview #TALRadio #TouchALifeFoundation

    మనసుని తాకే రోజూవారీ కథలు... దీప్తి ముచ్చట్లు | మన రచయితలు | Season - 2 | Episode - 5
  8. Jul 15

    మంగు మచ్చలను మాయం చేసే ఆయుర్వేద సలహాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 105

    ముఖంపై నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గడం లేదా? ఎన్ని క్రీములు వాడినా, ఎన్ని ట్రీట్‌మెంట్లు చేయించుకున్నా కొందరిలో ఈ సమస్య మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ముఖంపై వచ్చే పిగ్మెంటేషన్ వల్ల అందంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. అసలు పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది? ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, ఎండలో ఎక్కువగా తిరగడం, ఆహారపు అలవాట్లు దీనిపై ఎంత ప్రభావం చూపుతాయి? పిగ్మెంటేషన్‌ను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి అసలు ఆయుర్వేదం ఏం చెబుతుంది? ఇంట్లోనే పాటించగల చిట్కాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వారం ఆయుర్వేదం ఆరోగ్యం పాడ్కాస్ట్ లో సమాధానాలు అందించారు... ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ అనుపమ ఉప్పులూరి గారు! తప్పకుండా వినండి... మిస్ అవ్వకండి! Are dark spots and pigmentation on your face not fading away? For many people, pigmentation keeps coming back even after trying numerous creams and treatments. These dark patches not only affect appearance but can also impact self-confidence. What actually causes pigmentation? How much do stress, hormonal changes, sun exposure, and dietary habits contribute to the problem? What precautions can help reduce pigmentation? What does Ayurveda say about treating it? Are there any simple remedies that can be followed at home? In this week’s Ayurvedam Arogya Podcast, renowned Ayurvedic physician Dr. Anupama Uppuluri answers these questions and shares valuable insights on understanding and managing pigmentation naturally. Tune in and don’t miss it! Host: Renu Sree Guest: Dr. Anupama Uppuluri Dr. Anupama Contact Details: Mobile / WhatsApp: 9100052961 #AyurvedamArogyam #Pigmentation #Melasma #SkinCare #Ayurveda #NaturalSkinCare #TeluguHealthPodcast #TALRadioTelugu

    మంగు మచ్చలను మాయం చేసే ఆయుర్వేద సలహాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 105

About

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.