The New City Church Podcast - Telugu

New City Church

Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive all the latest updates!

  1. Oct 19

    The Transforming Power of The Gospel - సువార్తలోని శక్తి

    మీరు ఒక శుభవార్త వినాలనుకుంటున్నారా? మన జీవితాల్లో సంపూర్ణ మార్పుకు పునాది సువార్తను అర్థం చేసుకోవడమేనని పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు పరిపూర్ణ రూపాంతరం అనే సిరీస్లో కొనసాగుతూ వివరిస్తున్నారు. సువార్త అంటే శుభవార్త. అది సరళమైనది, సంక్లిష్టత లేనిది, ఇది నిజంగా నిజం అనడానికి మరీ మంచిదిగా అనిపించేంత అద్భుతమైనది. మన తరఫున సమస్తమును నెరవేర్చడానికి దేవుడు మన స్థాయికి దిగి వచ్చాడనే సత్యాన్ని ఈ సువార్త మనకు తెలియజేస్తుంది. యేసు ఎట్టివాడైయున్నాడో మనము కూడ ఈ లోకములో అట్టివారమైయున్నాము! కాబట్టి, దేవుని శక్తియై ఉన్న సువార్తతో ఆయన నడిచినట్లే మీరు కూడా ఈ జీవితములో ధైర్యంగా నడవండి!

  2. Oct 13

    Peace of Mind - తుఫానుల మధ్యలో సమాధానం

    మీకు ఒక అందమైన ఇల్లు, అనేక వాహనాలు, విజయవంతమైన వ్యాపారం ఉండి, బయటికి మీ జీవితం అంతా బాగానే కనిపిస్తున్నప్పటికీ, మీకు మాత్రం మనశ్శాంతి లేకుండా ఉందా? ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, మీరు మరింత శ్రేష్ఠమైన వాటి కోసం సృష్టించబడ్డారని తెలియజేస్తూ, తుఫానుల వంటి పరిస్థితుల మధ్యలో కూడా నిలిచి ఉండే, అద్భుతమైన, మానవ అవగాహనకు అందని సమాధానానికి మూలమైన దేవుని వైపు మన దృష్టిని మళ్లిస్తారు. దేవుడు ఉచితంగా అనుగ్రహించిన సమాధానాన్ని స్వీకరించి, దానిని మన జీవితాల్లో అనుభవించడానికి మన మనస్సును నూతనపరచుకోవడం ఎంత ముఖ్యమో ఆయన వివరిస్తారు. అలా చేసినప్పుడు, తీవ్రమైన ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో కూడా మనం ఆనందించగలుగుతాం. మీరు దేవుని వాగ్దానాలపై మనస్సు నిలిపేవారిగా మారి, బాధితుల మనస్తత్వాన్ని శాశ్వతంగా తిరస్కరించి, దేవుని సమాధానం మీ హృదయానికీ, మీ మనస్సుకీ కాపలాగా ఉంచుకొందురు గాక. ఆమేన్!

  3. Sep 28

    Total Transformation - పరిపూర్ణ రూపాంతరం

    మీ ఆలోచనా విధానాన్ని ఏది తీర్చిదిద్దుతోంది? దేవుని వాక్యమా లేదా లోక స్వరమా? ఈ పరివర్తనను కలిగించే వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు నిజమైన పరివర్తన మనస్సు మారుటతో ప్రారంభమవుతుందని వెల్లడిస్తున్నారు. రోమీయులకు 12:1–2 మరియు ఇతర లేఖనాల ఆధారంగా, మన ఆలోచనలు మన ఊహలను, నమ్మకాలను, నిర్ణయాలను, క్రియలను, అలవాట్లను, చివరకు మన జీవన విధానాన్ని ఎలా తీర్చిదిద్దుతాయో ఆయన వివరిస్తున్నారు. మీ ఆలోచనలకు మీరు బాధ్యత వహించుకొనుటకు, దేవుని వాక్యంతో మీ మనస్సును రూపాంతరపరచుకొనుటకు, మీ ఆలోచనా విధానాన్ని ఆయన సత్యానికి అనుగుణంగా మార్చుకొనుటకు ఈ సందేశం మిమ్మల్ని సవాలు చేస్తుంది. మీ మనస్సును రూపాంతరపరచుకొని, మీరు ముందుకు సాగి, దేవుడు మీకై ఉంచిన శ్రేష్ఠమైన దానంతటినీ స్వాధీనపరచుకొనుటకు దేవుని వాక్యం మీ జీవితాన్ని మార్చివేయనివ్వండి.

  4. Sep 24

    Faith that Speaks - విశ్వాసం మాట్లాడును

    మీరు వినేది మీ నమ్మకాన్ని రూపొందిస్తుంది. మీరు నమ్మేది చివరికి మీరు ఏమి మాట్లాడతారు, ఎలా జీవిస్తారు అనేదాన్ని నిర్ణయిస్తుంది. ఈ విశ్వాసాన్ని బలపరిచే వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు సువార్తను వినడం ద్వారా విశ్వాసం ఎలా అభివృద్ధి చెందుతుందో, అలాగే, విశ్వాస మూలముగా నీతిమంతులైన వారు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కాకుండా, దేవుని వాక్యంతో ఏకీభవిస్తూ ఎలా మాట్లాడుతారో తెలియజేస్తున్నారు. దేవుని వాక్యం మీ హృదయంలోనే కాకుండా మీ నోటిలో కూడా బలంగా నాటబడి ఉండాల్సిన అవసరం ఎందుకు ఉందో, దేవుడు వాగ్దానం చేసిన వాటిని ముందుకు సాగి స్వాధీనం చేసుకునేలా విశ్వాసం మిమ్మల్ని ఎలా సిద్ధం చేస్తుందో నేర్చుకోండి. ఈ సందేశాన్ని విని, దేవుని వాక్యానికి అనుగుణంగా మీ విశ్వాసం మాట్లాడేలా నేర్చుకోండి!

  5. Sep 22

    Walking In The Light - వాక్యపు వెలుగు

    మీరు జీవిస్తున్న క్రైస్తవ జీవితంతో మీరు విసుగు చెందియున్నారా? దేవునికి సంబంధించిన కార్యాలలో నమ్మకంగా పాల్గొంటూ, క్రమంగా సంఘానికి హాజరవుతూ, స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఇవ్వడంలో మరియు సంఘ పరిచర్యలో సేవ చేస్తూ ఉన్నప్పటికీ, ఇవన్నీ చివరికి ప్రయోజనం లేకుండా పోతున్నాయేమో అని మీరు అనుకోవడం ప్రారంభించారా? బైబిలు ఆధారాలను చూపిస్తూ, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, మోసం మనలో ఈ నిరాశకు ఎలా కారణమవుతుందో వివరిస్తున్నారు. మనం విన్న దేవుని వాక్యాన్ని వెంటనే ఆచరణలో పెట్టినప్పుడు, దేవుడు మన కోసం ఉద్దేశించిన మంచి జీవితాన్ని అనుభవించగలమని ఆయన చూపిస్తున్నారు. మీకు తెలిసి కూడా ఇంకా ఆచరణలో పెట్టని ఆ ఒక్క విషయం ఏమిటి? ఈ రోజే పరిశుద్ధాత్మ సహాయం కోరండి. మీరు పొందిన వెలుగును స్వీకరించి, దేవుడు మీకు చూపించిన దానిపై చర్య తీసుకోండి. అప్పుడు ముందుకు సాగుతూ, దేవుడు మీ కోసం సిద్ధం చేసిన సమస్తంలోకి ప్రవేశిస్తారు.

  6. Sep 8

    Righteousness Revealed - నీవు దేవుని నీతివై ఉన్నావు

    మళ్లీ మళ్లీ అదే పాపంలో పడిపోతూ, ఇక ఎప్పటికీ దాని నుండి విడుదల ఉండదేమో అన్నట్లుగా అనిపిస్తుందా? మీరు ఎదురుచూస్తున్న విడుదల, మీరు ఇప్పటికే క్రీస్తులో ఎవరైయున్నారో అర్థం చేసుకోవడం నుంచే ప్రారంభమైతే ఎలా ఉంటుంది? ఈ సందేశంలో పాస్టర్ బెన్ కొమానపల్లి జూనియర్ గారు నీతి గురించిన సత్యాన్ని బయలుపరుస్తూ, దేవుని వాక్యంలోని సత్యం మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉండే పాపపు చక్రాల నుండి మిమ్మల్ని పూర్తిగా, ఒక్కసారిగా విడుదల చేయగలదనే విషయాన్ని బోధిస్తున్నారు.  మీ మంచి పనుల వలన కాదు కానీ క్రీస్తు చేసిన పరిపూర్ణ కార్యం వలననే మీరు దేవుని దృష్టిలో నీతిమంతులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేయబడ్డారనే జీవితాన్ని మార్చే సత్యాన్ని తెలుసుకోండి. గొప్ప విడుదలలు మీ జీవితంలో నిజమైన అనుభవాలుగా మారును గాక. మీరు నీతిలో నడుస్తూ, యేసుతో కలిసి మరియు యేసు వలె పరిపాలిస్తూ, రాజ్యమేలుతూ, దేవుని ఉద్దేశాలలో ముందుకు సాగుతూ, ఆయన మీ కొరకు కలిగియున్న సమస్తాన్ని స్వాధీనం చేసుకునే జీవితం మీలో సులభమైన వాస్తవంగా మారును గాక!

About

Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive all the latest updates!

You Might Also Like