610 episodes

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world

మన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories Mana Telugu Kathalu

  • Fiction

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world

మన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

  అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధం | Annachellella Premanubandham | Telugu short story | Neeraja Hari | Manatelugukathalu.com

  అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధం | Annachellella Premanubandham | Telugu short story | Neeraja Hari | Manatelugukathalu.com

  (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

  అన్నాచెల్లెళ్ల  ప్రేమానుబంధం

  రచన: నీరజ హరి ప్రభల 

  (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

  "రమ్యా!  రెడీనా?  నా ఆఫీసుకి    టైమవుతోంది. త్వరగా  తెములు. నిన్ను  కాలేజీకి  డ్రాప్   చేయడంకాదుగానీ, నీ మూలాన   నాకు  ఆఫీసుకి  ఆలశ్యం అవుతోంది."  పెద్దగా  అరిచాడు  విజయ్  తన  చెల్లెలు  రమ్యని.

  "వస్తున్నా  అన్నయ్యా! " అంటూ  వచ్చి  అతని  స్కూటర్  మీద  కూర్చుని  తల్లితండ్రులకు  'బై'  చెప్పి  వెళ్లింది  రమ్య.

  వాళ్లు  వెళ్లినవైపే  చూస్తూ  ఉండి  లోపలికి  వెళ్లారు  రామయ్య, సుశీల. లెక్చరర్ గా  పనిచేసి  రిటైర్  అయిన  రామయ్య  భార్య  సుశీల, కూతురు  రమ్య,  కొడుకు  విజయ్ లతో  స్వంత  ఇంట్లో  ప్రశాంతజీవితం  గడుపుతున్నారు.

  డిగ్రీ  పూర్తి చేసిన  విజయ్  బాంకులో  ఉద్యోగం  చేస్తున్నాడు.  రమ్య  ఇంటర్   చదువుతోంది.  ప్రతిరోజూ  చెల్లెలిని  కాలేజీవద్ద   దింపి  తను  ఆఫీసుకి  వెళతాడు  విజయ్.

  విజయ్  అంటే  రమ్యకు  చాలా  ప్రేమ. విజయ్ కు  కూడా  అంతే. ప్రతి సం… తన అన్నకు  రాఖీ  కట్టి  అతని  ఆశీర్వాదము  తీసుకోందే   రమ్య  మనసు  ఊరుకోదు.  ఆ అన్నా చెల్లెళ్లను  చూస్తే  చూడముచ్చటగా ఉంది  అనుకుంటారు  అందరూ.

  వాళ్లిద్దరి  ఐకమత్యాన్ని  చూసి  చాలా  సంతోషిస్తూ  ఉంటారు   రామయ్యదంపతులు. రోజులు గడుస్తున్నాయి.  ఇంటర్  మంచిమార్కులతో  పాసయి  ఇంజనీరింగ్ లో  చేరింది  రమ్య . రోజూ  సాయంత్రం   ఆఇంట్లో అందరూ  ఒకచోట  చేరి హాయిగా  నవ్వుతూ,  తుళ్లుతూ  సంతోషంగా  కబుర్లు చెపుతూ  గడుపుతారు.

  Read the full story on www.manatelugukathalu.com

  ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

  మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

  దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

  https://www.youtube.com/channel/UCP4x

  • 10 min
  మలిప్రేమ | Maliprema | Telugu Short Story | Lakshmi Sarma B | manatelugukathalu.com

  మలిప్రేమ | Maliprema | Telugu Short Story | Lakshmi Sarma B | manatelugukathalu.com

  (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

  మలిప్రేమ

  B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

  “చూడండి సుభద్రగారు… మీరు చెప్పేది నాకొక్క ముక్క కూడా అర్ధం కావడంలేదు, కాస్త అర్ధం అయ్యేలా చెప్పండి,” అన్నాడు జడ్జి ప్రసాదరావు.

  “అదేంటయ్యా … ఇంతవిడమరిచి చెప్పినా నీకు అర్ధంకావడంలేదా? సరే విను మళ్ళి చెబుతాను, మా

  ఆయన ఉన్నాడుకదా ! ఆయనకు నాకు విడాకులు కావాలి, ఆయనను భరించడం నావల్ల కావడంలేదు.

  రోజూ కీచులాటలే, మాకు ఎంత తొందరగా విడాకులిప్పిస్తే అంత ప్రశాంతంగా ఉందామనుకుంటున్నాం”

  ఎదురుగా ఉన్న భర్తవైపు కోపంగా చూస్తూ చెప్పింది.

  ఒక్కసారిగా కోర్టు హాలంతా నవ్వులతో ధ్వనించింది. జడ్జి కూడా కడుపుపట్టుకుని మరీ నవ్వుతున్నాడు. సుభద్రమ్మకు , ఆనందరావుకు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్ధంకాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

  “సైలెన్స్” అంటూ జడ్జిగారు టేబుల్ పైన టకటకమని శబ్ధంచేసారు.

  “సుభద్రగారు … మీ ఇద్దరిని చూస్తుంటే ఆరుపదులు దాటినవాళ్ళలా ఉన్నారు. తెల్లగా పండిపోయిన తల, ముడతలుపడిన శరీరం.. బాధ్యతలన్నీ తీరిపోయి ఒకరిమీద ఒకరు ఆధారపడే వయసులో, ఈ విడాకుల గోలేంటో మాకు

  తోచడంలేదు, మీ ఆరోగ్యం బాగానే ఉందికదా? లేకా ఏమైనా చిత్త చాంచల్యంలాంటిదేమైనా వచ్చిందా?,”

  అడిగాడు జడ్జి ప్రసాదరావు.

  “జడ్జిసారు … మేము మంచిగానే ఉన్నాము, మా ఇద్దరికి పెన్షన్లు వస్తాయి. ఒకరిమీద ఒకరం ఆధారపడవలసిన అవసరంలేదు. మాకు మేముగా విడివిడిగా ఉండాలని అనుకున్నాము. అంతేకదా సుభద్రా” భార్యవైపు చూస్తూ అన్నాడు ఆనందరావు.

  “ఆ … అవునవును అంతే,” అంది ఆవిడ తలూపుతూ.

  “విడాకులంటే ఏదో తమలపాకులు.. మామిడాకులు అనుకుంటున్నారా ఏంటి మీరు?” అడిగాడొక

  లాయరు నవ్వుతూ.

  “నీకెందుకయ్యా మా విషయం… మాకా మాత్రం తెలియదనుకున్నావా? మామిడాకులకు తమలపా

  • 9 min
  వీరి మధ్యన ఎపిసోడ్ 10 | Veeri Madhyana Episode 10 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

  వీరి మధ్యన ఎపిసోడ్ 10 | Veeri Madhyana Episode 10 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

  (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

  వీరి మధ్యన... ఎపిసోడ్ 10

  రచన: బివిడి ప్రసాదరావు 

  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

  బివిడి ప్రసాదరావు గారి  ధారావాహిక 'వీరి మధ్యన..' పదవ భాగం

  గత ఎపిసోడ్ లో…

  సాహసి, తన ట్రాన్స్ఫర్ గురించి మేనేజర్ చంద్రికతో మాట్లాడుతుంది.

  ఆమె హెడ్డాఫీస్ వాళ్ళతో మాట్లాడి, సాహసిని సికింద్రాబాద్ బ్రాంచ్ లో వెంటనే చేరమంటుంది.

  ఇక వీరి మధ్యన..  పదవ  భాగం చదవండి...

  అప్పుడే, "అదేంటో చెప్పండి బావగారు." అన్నాడు మోహనరావు, భార్య వంక, కూతురు వంక చూస్తూ.

  "అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ తీసుకున్న ప్లాట్ లో ఉంటారట. మనం పెట్టే ముహూర్తం వరకు ఎట్టి ఇబ్బంది పరిచే పనులు చేపట్టరట. ఆషాఢం తర్వాత, మన పెద్దలు కలిసి వచ్చి, జరపవలసినవి జరపండి అంటున్నాడు." చెప్పడం ఆపాడు గోపాలస్వామి.

  "అలానా." అనగలిగాడు మోహనరావు.

  "పైగా మీ అమ్మాయి, మా అబ్బాయ్ ఎప్పుడో ఇలానే ఆలోచించుకున్నారట. మనం సహకరించమని చెప్పలేదట." అన్నాడు గోపాలస్వామి.

  "అలానా." మళ్లీ అన్నాడు మోహనరావు.

  "మనం సమ్మతించగలిగితే, ఈ సమస్య తీరుతుందని మా అబ్బాయ్ అంటున్నాడు. మీరు ఏమంటారు." అడిగాడు గోపాలస్వామి.

  మోహనరావు భార్యను చూస్తున్నాడు.

  తల్లిదండ్రులను సాహసి చూస్తుంది.

  "అప్పటికీ చెప్పాను. నలుగురూ ఏమనుకుంటారో అని కూడా అన్నాను. అందుకు మా అబ్బాయ్, మన నలుగురం పెద్దలం, అంటే మేమిద్దరం, మీరిద్దరు ఏమనుకుంటామో చెప్పమని నన్ను సూటిగా ప్రశ్నించేశాడు. మా ఇద్దరం కాదనలేక పోతున్నాం. మరి మీరు ఏమంటారో చెప్పగలరు." చెప్పాడు గోపాలస్వామి.

  ఆ మాటలు విన్న శైలజ, భర్తని చూస్తూ, 'సరే' అన్నట్టు తలూపింది.

  "సరే బావగారు. మేమూ కాదనలేం." అనేశాడు మోహనరావు.

  "పిల్లల మాట విందాం బావగారు. వాళ్లని నమ్ముదాం." అన్నాడు గోపాలస్వామి.

  "తప్పక." అనేశాడు మోహనరావు కూతురునే చూస్తూ.

  తర్వాత, ఆ ఫోన్ ల సంభాషణ క

  • 13 min
  అరుంధతి | Arundhathi | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

  అరుంధతి | Arundhathi | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

  (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

  అరుంధతి

  రచన: సిహెచ్. సీ. ఎస్. శర్మ 

  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

  "నాన్నగారూ!... పరమేశ్వర మామయ్య, విశ్వం వాళ్ళు ఎలా వున్నారు?..." అడిగాడు శ్రీనివాస్.

  శ్రీనివాస్ తండ్రి నారాయణమూర్తి. తల్లి సావిత్రి. యీ దంపతుల ప్రథమ సంతానం శ్రీనివాస్. ఐదేళ్ళు అమెరికాలో వుండి స్వదేశానికి వచ్చి చెన్నై లో యల్&టి కంపెనీలో జి.యం గా పని చేస్తున్నారు. పది రోజుల శలవు మీద తల్లిదండ్రులను చూడాలని, భార్య రేవతి, ఐదేళ్ళ కొడుకు రఘురామ్, రెండేళ్ళ కూతురు స్వాతితో ఆంధ్రాలోని సొంత వూరికి వచ్చాడు.

  అతనికి ఒక చెల్లెలు, పేరు కుసుమ, ఆమె వివాహం, ఇతని వివాహానికి ముందు మూడేళ్ళ క్రితం జరిగింది. ఆమె భర్త విజయవాడలో ఆంధ్రా బ్యాక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వీరికి ఒక పాప... శశి, ఒక బాబు కార్తీక్. వయస్సు ఎనిమిది, ఏడు... కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు.

  మహాశివరాత్రి నాడు అంటే ... మాఘమాసపు కృష్ణ పక్షంలో వచ్చే మహాశివరాత్రి నాడు, వీరి కుటుంబం ఆవూరి శివాలయంలో, నమక చమక రుద్రాభిషేకం... రాత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిపించడం ఆనవాయితీ, ఆకారణంగా చెల్లెలు కుమమ... భర్త, పిల్లలతో అమ్మ గారింటికి వచ్చింది.

  డెబ్బై ఐదేళ్ళ పరమేశ్వర శాస్త్రి, నారాయణ మూర్తి బావగారు... అన్నీ కార్యక్రమాలనూ జరిపిస్తారు. సిద్ధాంతి "వారికేం తక్కువ ఆ పార్వతీపరమేశ్వరుల కటాక్షంతో మీరు హాయిగా వున్నారు. పెద్దవాడు సోము డాక్టరాయె. చిన్న వాడు విశ్వం మామయ్య దగ్గర అన్నీ నేర్చుకొని శాస్తుర్లు అయినాడు. మంచి వాక్ శుద్ధి వున్నవాడు. యీ చుట్టుప్రక్కల గ్రామవాసులు అందరూ వచ్చి, ముహూర్తాలు, శంకుస్థాపనలు, వివాహాలు వీరిచేత జరిపించుకొంటారు. వీరి మాట అంటే అందరికీ గురి... మంచి నమ్మకం.

  మన సనాతన ధర్మాన్ని నమ్మి... దానికి సంబందించిన విద్వత్తు

  • 12 min
  పిచ్చుకమ్మ పిచ్చుక బంగారు పిచ్చుక | Pichukamma Picchuka Bangaru Pichhuka | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

  పిచ్చుకమ్మ పిచ్చుక బంగారు పిచ్చుక | Pichukamma Picchuka Bangaru Pichhuka | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

  (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

  పిచ్చుకమ్మ పిచ్చుక బంగారు పిచ్చుక

  రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

  (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

  వాతావరణ కాలుష్యం వల్ల, ముఖ్యంగా సెల్ల్ టవర్ల వల్ల పక్షి జాతి అంతరించి పోతోంది.

  ముఖ్యంగా పిచ్చుకలు మచ్చుకి కూడా కనిపించడం లేదు.

  మామూలు హాస్య కథలోనే పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసారు నల్లబాటి రాఘవేంద్ర రావు గారు.

  ఇక కథలోకి వెడదాం.

  ఆ చెట్టు మీద సరస సల్లాపాలాడుకుంటూ అందమైన పిచ్చుక జంట..

  ''ఒసేయ్ నా రాచవన్నెల బంగారు పిచ్చుక..

  నన్ను ముక్కుతో పొడవకే. నువ్వు నన్ను లైన్ లో పెడితే నా వల్ల నీకు పిల్లలు పుడతారు.. అనుకోకు. ఎందుకంటే ఈ మానవజాతి వల్ల కలిగిన వాతావరణ కాలుష్యంతో మన జాతిలో ప్రత్యుత్పత్తి సామర్థ్యం ఎప్పుడో తగ్గిపోయిందే. పోనీ మన ఇద్దరికీ ఎలాగోలా పిల్లలు పుట్టారే అనుకో.. ఈ భూ ప్రపంచపు కాలుష్యంలో మన పిల్లకాయలు బ్రతికి బట్ట కట్టలేరు'' అంది మగ పిచ్చుక.

  ''అవును మావా.. అసలు నువ్వు నేను బ్రతికి బట్ట కడతామంటావా? మన జాతి పూర్తిగా నశించి పోతున్నప్పటికి ఈ మానవులు పట్టించు కోవడం లేదు ఎందుకనో?'' నిట్టూరుస్తూ అంది ఆడ పిచ్చుక.

  ''ఓస్.. జంతువులు పక్షులు నశిస్తే మనకేం.. అనుకుంటున్నారేమో వీళ్లు. ఈ మనిషి గొప్ప వాడు కావడం కోసం అటవీ ప్రాంతాన్ని హరిoచేస్తున్నాడు. దాంతో వర్షాలు పడటం లేదు. మొక్కలు కూడా మొలవడం లేదు. ఇక ఇలాగే కొనసాగితే కేవలం మన జాతి మాత్రమే కాకుండా అప్పుడు శాఖాహార మాంసాహార జంతువులు కూడా నశిస్తాయి.

  అప్పుడేమవుతుందో తెలుసా.. జీవావరణ చక్రం దెబ్బతిని మానవాళి మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది.. అది తెలుసు కోలేక పోతున్నారు ఈ మానవ మొనగాళ్లు.'' అంది మగ పిచ్చుక.

  ''మీ పురాణం కట్టి పెట్టవో మామ. నీ పిచ్చుక పురాణం ఎవడు వింటాడు. సరే నేన

  • 18 min
  మన సంప్రదాయం | Mana Sampradayam | Telugu Short Story | Mukkamala Janakiram | manatelugukathalu.com

  మన సంప్రదాయం | Mana Sampradayam | Telugu Short Story | Mukkamala Janakiram | manatelugukathalu.com

  (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

  మన సంప్రదాయం

  రచన: ముక్కామల జానకిరామ్

  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

  చైత్ర 4 వ తరగతి చదువుతుంది. నాన్నంటే అమితమైన ప్రేమ.నాన్న ఏ పని చెప్పినా చిటికెలో చేసేది.అది చూసి వాళ్ళ అమ్మ కూడా సంతోషపడేది. సాయంత్రం పనికి వెళ్ళిన నాన్న ఇంటికి రాగానే కూతురుతోనే గడిపేవాడు.

  కానీ ఒక విషయంలో మాత్రం నాన్న మీద కోపంగా ఉండేది చైత్రకు. నాన్న అంటే కొంచెం భయం కూడా ఉండడంతో నాన్నతో విషయం చెప్పకపోయేది.

  నాన్న పనికి వెళ్ళినప్పుడు 'నేనే కుర్చీలో కూర్చుంటాను నువ్వు నాన్నతో చెప్పు' అని అమ్మతో గొడవపడేది చైత్ర.

  'నాన్న వయసులో పెద్దవాడు కదా తల్లీ ! కింద కూర్చొని భోజనం చేయాలంటే నాన్నకు కష్టంగా ఉంటుంది' అని అమ్మ చైత్రకు సర్దిచెప్పేది.

  'నాన్న వింటే బాధ పడతారు ఇంకా ఎప్పుడూ అలా అనకు తల్లీ?' అని అమ్మ ఎంత సర్ది చెప్పినా చైత్ర మనసులో నేనే కుర్చీ మీద కూర్చొని తినాలని అనుకునేది.

  చైత్ర వాళ్ళ తాతయ్య, చైత్రను చూడడానికి పండ్లు తీసుకొని వచ్చాడు. పనికి వెళ్లిన నాన్న సాయంత్రం ఇంటికి రాగానే తన తండ్రి బాగోగులు అడిగి తెలుసుకున్నాడు. రాత్రి భోజన సమయంలో చైత్రతో పాటు నాన్న కూడా కిందనే కూర్చొని భోజనం చేయడంతో చైత్ర ఆశ్చర్య పడింది.

  'ఎప్పుడూ కుర్చీ పై కూర్చొని తినే నాన్న ఈ రోజు కింద కూర్చున్నాడు' అని మనసులో అనుకుంది. తాతయ్య వారం రోజులు ఉండి వెళ్ళాడు. ఆ వారం రోజులూ నాన్న కింద కూర్చొనే భోజనం చేశాడు.

  'అమ్మా! అమ్మా! నాన్న కింద కూర్చొనే భోజనం చేశాడు ఏంటి' అని అడిగింది.

  'అమ్మా చైత్రా! మన ఇంటిలో భోజనం చేయడానికి ఒకటే కుర్చీ ఉన్నది. అది నీకు తెలుసు కదా!. తాతయ్య వయసులో నాన్న కన్నా పెద్దవారు. కింద కూర్చోలేరు. పెద్దలను గౌరవించడం మన సంప్రదాయం. మనకన్నా వయసులో పెద్దవారిని మనం గౌరవించాలి. అందుకే నాన్నగ

  • 3 min

Top Podcasts In Fiction

Wondery
QCODE
Striking Distance Studios
Charles Dickens
The McElroys
Night Vale Presents