TALRadio Telugu

Touch A Life Foundation

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

  1. ప్రకృతి పరిరక్షణ కోసం "విశ్వ" సంకల్పం | స్ఫూర్తి కిరణాలు

    3h ago

    ప్రకృతి పరిరక్షణ కోసం "విశ్వ" సంకల్పం | స్ఫూర్తి కిరణాలు

    చెత్తను చూస్తే సమస్య కనిపిస్తుంది... వేరు చేస్తేనే పరిష్కారం తెలుస్తుంది! అంటూ... పర్యావరణ పరిరక్షణ కోసం క్లీన్-అప్ డ్రైవ్స్, జీరో-వేస్ట్ కార్యక్రమాలు, ఎకో-ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ ను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న VISVA Sustainable Foundation వ్యవస్థాపకులు వినయ్ గారు ఈ వారం మన 'స్ఫూర్తి కిరణాలు' పాడ్కాస్ట్ లో! అసలు చెత్తను వేరు చేయడం ఎందుకు అంత ముఖ్యం? చిన్న చిన్న అలవాట్లు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు ఏంటి? మనమే మన ఇంటి నుండి మార్పును ఎలా ప్రారంభించవచ్చు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు... మిస్ అవ్వకండి... తప్పకుండా వినండి! “When you look at waste, you see a problem...When you segregate it, you discover the solution!” This week on our Sphoorthi Kiranalu Podcast, we feature Mr. Vinay, founder of VISVA Sustainable Foundation, who has been actively promoting environmental conservation through clean-up drives, zero-waste initiatives, and eco-friendly lifestyles. Why is waste segregation so important? How do small everyday habits impact the environment? What are some practical alternatives to plastic? And how can each of us begin creating change right from our own homes? Mr. Vinay shares his insights, experiences, and practical ideas on these and many other interesting topics. Don’t miss this inspiring conversation...Be sure to tune in! Guest: Vinay Host: Adarsh #TALRadio #SpurthiKiranalu #Vinay #VISVASustainableFoundation #WasteSegregation #Sustainability #EcoFriendly #SaveEnvironment #GoGreen #SustainableLiving

    21 min
  2. ఎంత బాగా చదివితే.. అంత లోతుగా రాయగలరు! | మన రచయితలు | Season -2 | Episode - 4

    3h ago

    ఎంత బాగా చదివితే.. అంత లోతుగా రాయగలరు! | మన రచయితలు | Season -2 | Episode - 4

    న్యూజిలాండ్‌లో తొలి తెలుగు పుస్తకం… అక్కడి తెలుగు సాహిత్యానికి సరికొత్త గుర్తింపు… సతీష్ కుమార్ గొల్లపూడి గారు! విదేశాల్లో ఉంటూనే తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన రచయిత ఆయన. కవిత్వాన్ని తన భావాలకు వేదికగా చేసుకుని, సాహితీ వర్షిత, న్యూజిలాండ్ నానీలు, జీవితం గీసిన చిత్రాలు, ప్రవాస ప్రతిబింబాలు వంటి రచనలతో పాఠకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. న్యూజిలాండ్‌ నుంచి తొలి తెలుగు పుస్తకాన్ని ప్రచురించిన రచయితగా, అక్కడి తెలుగు రచయితల్లో అత్యధిక పుస్తకాలు రచించిన వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రవాస జీవితం ఆయన కలానికి ఏమిచ్చింది? నానీల వైపు ఆయన అడుగులు ఎలా పడ్డాయి? విదేశాల్లో ఉంటూ తెలుగు కోసం రాయాలనే తపన ఎలా పెరిగింది? ఒక రచయితగా ఆయన ప్రయాణంలో ఎదురైన అనుభవాలు ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వారం మన రచయితలు పాడ్కాస్ట్ లో స్వయంగా ఆయనే మనతో పంచుకున్నారు… తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి! The First Telugu Book in New Zealand…A New Milestone for Telugu Literature There…Mr. Satish Kumar Gollapudi! A writer who has carved a unique place for himself in Telugu literature while living abroad, Satish Kumar Gollapudi has used poetry as a powerful medium to express his thoughts and experiences. Through works such as Sahiti Varshita, New Zealand Naanilu, Jeevitam Geesina Chitralu, and Pravasa Pratibimbalu, he has earned a special place in the hearts of readers. He is recognized as the author who published the first Telugu book from New Zealand and as one of the most prolific Telugu writers in the country. What has expatriate life contributed to his writing? How did he become interested in the art of Naanilu? What inspired his passion for writing in Telugu while living overseas? What experiences and challenges has he encountered throughout his journey as a writer? In this week’s Mana Rachayitalu Podcast, Satish Kumar Gollapudi shares his inspiring story and insights firsthand. Be sure to listen…Don’t miss it! Guest: Satish Kumar Gollapudi Host: Renu Sree #TALRadioTelugu #ManaRachayithalu #SatheeshKumarGollapudi #NewZealandTelugu #TeluguLiterature #PravasaRachayitha #Naneelu #Poetry #TeluguLanguage

    33 min
  3. స్ట్రీట్ ఆర్ట్: బాలల రక్షణ కోసం ఒక కాన్వాస్ | CHARCHA With Real Leader - 9

    2d ago

    స్ట్రీట్ ఆర్ట్: బాలల రక్షణ కోసం ఒక కాన్వాస్ | CHARCHA With Real Leader - 9

    కొన్ని పెయింటింగ్స్... చూడగానే నచ్చుతాయి. మరికొన్ని పెయింటింగ్స్... చూసిన తర్వాత మనల్ని మార్చేస్తాయి! అలాంటి ఆలోచింపజేసే స్ట్రీట్ ఆర్ట్‌తో పిల్లల భిక్షాటన, బాలల అక్రమ రవాణా వంటి సమస్యలపై సమాజంలో అవగాహన కల్పిస్తూ... కళను సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన సాధనంగా మార్చారు… స్వాతి & విజయ్ గార్లు! పిల్లలు భిక్షాటన చేస్తున్న దాని వెనక ఉన్న అసలు నిజాలు ఏంటి? మనం చేసే చిన్న చిన్న తప్పులు ఎలా పెద్ద సమస్యలకు కారణమవుతున్నాయి? కళ ద్వారా సమాజంలో ఎలా అవగాహన తీసుకురావచ్చు? సాధారణ పౌరులుగా మనం చేయగల బాధ్యత ఏంటి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు. సమాజంలో మార్పు రావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన పాడ్కాస్ట్ ఇది! South India's CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో... స్ట్రీట్ ఆర్టిస్టులు స్వాతి & విజయ్ స్ఫూర్తిదాయక ప్రయాణం... వారి మాటల్లోనే మీకోసం! Some paintings catch your eye at first glance...Some paintings leave a lasting impact and change the way you think! Through thought-provoking street art, Swathi & Vijay have been creating awareness about critical social issues such as child begging and child trafficking, transforming art into a powerful tool for social change. What are the hidden realities behind children begging on the streets? How do some of our everyday actions unintentionally contribute to larger social problems? How can art inspire awareness and drive meaningful change in society? And what role can each of us play as responsible citizens? In this podcast, they share their insights, experiences, and perspectives on these important questions and many more. This is a conversation that everyone who wishes to see positive change in society should listen to. As part of "Charcha With Real Leaders", presented by TALRadio in association with South India's CSR Summit... Listen to the inspiring journey of street artists Swathi & Vijay, in their own words. Guest: Swathi & Vijay Host: Vinil Reddy #TALRadioTelugu #CharchaWithRealLeaders #SwathiAndVijay #StreetArt #SocialImpact #ChildRights #ChildTraffickingAwareness #EndChildBegging #ArtForChange #SocialAwareness #CSR #InspiringStories #TALRadio #TouchALifeFoundation

    22 min
  4. పిల్లల మాటలు ఆలస్యం.. నిజాలు అపోహలు! | Dr. Vishnupriya | Health Talk

    3d ago

    పిల్లల మాటలు ఆలస్యం.. నిజాలు అపోహలు! | Dr. Vishnupriya | Health Talk

    పిల్లలు మాట్లాడటంలో ఆలస్యం చేస్తున్నారా?అది కేవలం Speech Delayనా... లేక Autismకి సంకేతమా? చాలా మంది తల్లిదండ్రులను అయోమయంలో పడేసే ఈ ప్రశ్నలకు మంచి సమాధానాలు ఈ పాడ్కాస్ట్ మీకోసం. Speech Delay, Autism మధ్య తేడా ఏమిటి? పిల్లలను ఎప్పుడు డాక్టర్‌కు చూపించాలి? మొబైల్, టీవీ ఎక్కువగా చూడటం వల్ల మాటలు ఆలస్యమవుతాయా? Speech Therapy గురించి ఉన్న అపోహలు ఏమిటి? ADHD, Tongue Tie వంటి ఎన్నో అంశాలపై విలువైన సమాచారం అందించారు… ప్రముఖ Audiologist & Speech Language Pathologist Dr. Vishnupriya గారు! ప్రతి తల్లిదండ్రి తప్పకుండా వినాల్సిన ఈ పాడ్కాస్ట్ ను మిస్ అవ్వకండి! Are your child’s speech milestones delayed?Is it just a Speech Delay, or could it be a sign of Autism? This podcast answers some of the most common questions that leave parents confused. What is the difference between Speech Delay and Autism? When should you consult a doctor? Can excessive mobile phone or TV screen time delay speech? What are the common myths about Speech Therapy? Learn valuable insights on these topics, along with ADHD, Tongue Tie, and more from renowned Audiologist & Speech-Language Pathologist Dr. Vishnupriya. A must-listen podcast for every parent. Don’t miss it! Guest: Dr. Vishnupriya Host: Adarsh #TALRadioTelugu #SpeechDelay #AutismAwareness #SpeechTherapy #ChildDevelopment #ParentingTips #ChildHealth #ADHD #TongueTie #EarlyIntervention #KidsHealth #HealthTalk #TALRadio #TouchALifeFoundation

    18 min
  5. పని కోసం ప్రయత్నించు.. పస్తులుంటే ఇక్కడ సంప్రదించు | RICE ATM | CHARCHA With Real Leaders - 8

    6d ago

    పని కోసం ప్రయత్నించు.. పస్తులుంటే ఇక్కడ సంప్రదించు | RICE ATM | CHARCHA With Real Leaders - 8

    వీరి ATM... డబ్బు ఇవ్వదు… కానీ, కడుపు నిండా అన్నం పెడుతుంది! కరోనా సమయంలో వేలాది కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్న వేళ... ఎంతమందికైనా, ఎప్పుడైనా, ఎంతైనా ఆహారం అందించేలా "Rice ATM" అనే వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు… రామదాస్ పట్టి గారు! ఈ Rice ATM ద్వారా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడంతో పాటు... ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం, అవసరమైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడం… ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు! ఆయనకు వచ్చిన ఒక చిన్న ఆలోచన కొన్ని వేల మంది జీవితాలకు ఎలా భరోసాగా మారింది? సేవ చేయాలంటే డబ్బు కంటే మనసు, సమయం, సంకల్పమే ఎందుకు ముఖ్యం…? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ మనతో పంచుకున్నారు. సమాజానికి ఉపయోగపడే పని చేయాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన పాడ్కాస్ట్ ఇది! South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో... Rice ATM వ్యవస్థాపకులు రామదాస్ పట్టి గారి స్ఫూర్తిదాయక ప్రయాణం... వారి మాటల్లోనే మీకోసం! This ATM doesn’t dispense money... it serves a plate of food! At a time when thousands of families were struggling with hunger during the COVID-19 pandemic, Mr. Ramadas Patti came up with a simple yet powerful idea—Rice ATM, ensuring that anyone in need could access food, anytime. Through this initiative, he has not only provided meals to people facing hunger but has also created livelihood opportunities for those who lost their jobs and supported underprivileged families with essential groceries and other forms of assistance. How did one simple idea become a lifeline for thousands of people? Why does creating social impact require more compassion, time, and determination than money? Find out in this inspiring episode! A must-listen podcast for anyone who wants to make a meaningful difference in society. As part of "Charcha With Real Leaders", presented by TALRadio in partnership with South India’s CSR Summit, listen to the inspiring journey of Rice ATM Founder Mr. Ramadas Patti, in his own words. Guest: Ramu Dosapati Host: Vinil Reddy #TALRadioTelugu #CharchaWithRealLeaders #RiceATM #RamadasPatti #FoodForAll #ZeroHunger #HungerRelief #SocialImpact #CommunityService #ChangeMaker #SocialEntrepreneur #InspiringStories #Leadership #CSR #SouthIndiasCSRSummit #Podcast #Inspiration #Humanity #TALRadio #TouchALifeFoundation

    30 min
  6. తూర్పు తీరంలో తెలుగు రేఖలు | మన రచయితలు | Season - 2 | Episode - 3

    Jul 2

    తూర్పు తీరంలో తెలుగు రేఖలు | మన రచయితలు | Season - 2 | Episode - 3

    ఉద్యోగం ఆయనకు ఉపాధి కల్పించింది... తెలుగు మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది! ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లినా... తెలుగు భాషను మాత్రం ఎప్పుడూ వదల్లేదు మల్లికేశ్వర రావు గారు. న్యూజిలాండ్‌లో మొదలైన ఆయన రచనా ప్రయాణం... ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి అందరికీ చేరువైంది. ఉద్యోగం చేస్తూనే... తెలుగులో కథలు రాయడం, కవితలు రాయడం, పత్రికలు నిర్వహించడం, వెబ్‌సైట్ ద్వారా డిజిటల్ రూపంలో సాహిత్యాన్ని పరిచయం చేయడం ఇవన్నీ ఆయన జీవితంలో భాగమయ్యాయి. చిన్నప్పుడు చూసిన పద్యనాటకాలే ఆయనలో తెలుగు మీద ప్రేమను పెంచాయి. అదే ప్రేమ... ఆయనను రచయితగా మార్చింది. మాతృభాషపై ఆయనకున్న ప్రేమ ఎలాంటిది? విదేశాల్లో ఉంటూనే తెలుగు భాష కోసం ఎందుకు కృషి చేస్తున్నారు? యువ రచయితలకు ఆయన చెప్పే సూచనలు ఏమిటి? ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ ఆయన మాటాల్లోనే వినడానికి... ఈ పాడ్కాస్ట్‌ను తప్పకుండా వినండి! His job gave him a livelihood... but Telugu gave him a unique identity. Though he moved abroad for work, Mallikeswara Rao never left his love for the Telugu language behind. What began as a literary journey in New Zealand has now reached Telugu-speaking people across the world. Alongside his professional career, he has devoted himself to writing stories and poems in Telugu, publishing magazines, and promoting Telugu literature digitally through a dedicated website. The traditional verse dramas he watched as a child sparked his love for Telugu. That very passion eventually shaped him into a writer. What does his love for his mother tongue mean to him? Why does he continue working for the Telugu language while living overseas? What advice does he have for aspiring young writers? Listen to this inspiring podcast to hear his journey and insights in his own words! Guest: Mallikeswara Rao Host: Renu Sree #TALRadioTelugu #ManaRachayithalu #Podcast #TeluguPodcast #Telugu #MotherTongue #TeluguLanguage #TeluguLiterature #MalliswaraRao #Writer #Author #Poetry #Stories #NewZealand #NRI #TeluguCommunity #LiteraryJourney #Inspiration #YouthWriters #LanguageLove #TALRadio #TouchALifeFoundation

    37 min
  7. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట UDS Foundation | CHARCHA With Real Leaders - 7

    Jun 30

    విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట UDS Foundation | CHARCHA With Real Leaders - 7

    "సేవ చేయడం... ఒక అలవాటు కాదు, అది మన బాధ్యత!" ఈ ఒక్క విషయాన్ని నమ్ముకొని తన జీవితాన్నే సమాజ సేవకు అంకితం చేశారు కృష్ణమోహన్ గారు! పిల్లలు తమకు నచ్చిన కెరీర్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి? యువత సేవా కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనాలి? సమాజంలో నిజమైన మార్పు తీసుకురావాలంటే అసలు మనమేం చేయాలి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు. సమాజానికి ఉపయోగపడే పని చేయాలని, జీవితంలో ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన పాడ్కాస్ట్ ఇది! South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో... UDS Foundation వ్యవస్థాపకులు కృష్ణమోహన్ గారి స్ఫూర్తిదాయక ప్రయాణం... వారి మాటల్లోనే! "Service is not just a habit... it's our responsibility." Believing in this simple yet powerful thought, Krishna Mohan dedicated his life to serving society. How should children choose the right career? Why should young people actively participate in social service? What does it really take to bring meaningful change to society? In this inspiring podcast, he shares his thoughts and experiences on these important topics, along with valuable lessons from his journey. If you aspire to make a difference, serve society, and lead a life with purpose, this is a podcast you shouldn't miss! As part of "Charcha With Real Leaders," presented by TALRadio in association with South India's CSR Summit, listen to the inspiring journey of Krishna Mohan, Founder of UDS Foundation, in his own words. Guest: Krishna Mohan Host: Vinil Reddy #TALRadioTelugu #CharchaWithRealLeaders #KrishnaMohan #UDSFoundation #SouthIndiasCSRSummit #SocialService #Leadership #CommunityImpact #YouthEmpowerment #CareerGuidance #PurposeDrivenLife #Inspiration #SocialChange #Podcast #TALRadio #TouchALifeFoundation

    31 min
  8. "ఆనందంగా ఉండటమే అసలైన విజయం" - Anweshi Pagadala | Vijeta

    Jun 30

    "ఆనందంగా ఉండటమే అసలైన విజయం" - Anweshi Pagadala | Vijeta

    ఆనందంగా ఉండటమే అసలైన విజయం.. రోజూ కొత్త విషయాలు తెలుసుకుంటే జీవితం కూడా ప్రతిరోజూ కొత్తగా అనిపిస్తుంది… అంటూ ఎన్నో విలువైన విషయాలను మనతో పంచుకున్నారు ఈ వారం విజేత కార్యక్రమంలో Anweshi గారు! హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆమె... నాన్న ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే డ్యాన్స్ నేర్చుకొని, భారతీయ సాంస్కృతిక కళలపై మంచి పట్టు సాధించారు. ఆ తర్వాత IT రంగంలో ఉద్యోగం కోసం UK, Europe వెళ్లినా... తన మూలాలను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. విదేశాల్లో ఉద్యోగం చేస్తూనే... దేవాలయాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం, ప్రతి రోజూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఆనందంగా జీవించడం ఆమె జీవితంలో భాగమయ్యాయి. ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం, జీవితంలో నేర్చుకున్న పాఠాల గురించి ఆమె మాటల్లోనే ఈ పాడ్కాస్ట్ లో మీ కోసం! మిస్ అవ్వకండి!  True success is being happy.When you learn something new every day, life itself feels new every day. This week on Vijetha, Anweshi shares many such meaningful insights with us. Born and raised in Hyderabad, she developed a strong foundation in Indian classical arts after her father encouraged her to learn dance from a young age. Later, she moved to the UK and Europe for a career in the IT industry, but never lost touch with her roots. Alongside her professional journey abroad, she actively participated in temple service activities, promoted Indian culture through cultural performances, and embraced lifelong learning as a way of life. In this inspiring podcast, Anweshi shares her remarkable journey, the lessons she has learned, and her perspective on living a joyful and meaningful life. Don't miss it! Guest: Anweshi Pagadala Host: Renu Sree #TALRadioTelugu #Vijetha #Anweshi #Podcast #Inspiration #LifeLessons #Success #Happiness #LifelongLearning #IndianCulture #ClassicalDance #TempleService #WomenInspiringWomen #PersonalGrowth #Motivation #PositiveLiving #TALRadio #TouchALifeFoundation

    39 min

About

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.