యవ్వనం - ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మధురమైన కాలం. సినీ కవులు యవ్వనాన్ని పాటల్లో రక రకాలుగా వాడుకున్నారు. “ యవ్వనం అంటేనే ఓ వరం, తప్పు ఒప్పు తేడానే లేదురా ” , “నవ్వుకునే మన యవ్వనమే ఒక పువ్వుల తోటంటా”. కానీ ఏమి లాభం. “పాడు జీవితము, యవ్వనం, మూడు నాళ్ళ ముచ్చటలేరా”. కంగారు పడకండి, ఇప్పుడు యవ్వనం మీద వచ్చిన పాటలను పాడి విసిగించను. ఇంకోలా విసిగిస్తా. అలాంటి మధురమైన నా యవ్వనంలో, నేను కొన్ని రచనలు చేశాను. అవి ఇంతవరకు ఎవరికీ ఇవ్వలేదు(ఎవ్వరూ తీసుకోలేదు) . వాటిని ఇప్పుడు శ్రవణ రూపంలో మళ్ళీ మీ ముందుకు తీసుకు వస్తున్నాను.
ముందుగా రామ్@శృతి.కామ్. 2012, 2013 లో హైదరాబాద్ లో చేసిన ఘనకార్యాలలో ఇది ఒకటి. నేను ఆ వయస్సులో (ఆ మాటకొస్తే ఇప్పటికీ) చేయలేని వన్నీ చేసినట్టు ఊహించుకొని రాసిన నవల. దీనిని ఎపిసోడ్ కి ఒక చాఫ్టర్ చొప్పున మీకు వినిపించబోతున్నాను. ఆలస్యం చేయకుండా వినేయండి.
정보
- 프로그램
- 주기매주 업데이트
- 발행일2023년 12월 7일 오전 8:00 UTC
- 시즌3
- 에피소드5